చైనా కిట్లు కూడా చైనా బజార్ బాపతేనా...సందేహాలొస్తున్నాయ్ మరి


కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించడానికి చైనా నుంచి తెప్పించిన ర్యాపిడ్ టెస్టు కిట్లు తేడా కొట్టాయంటూ రాజస్థాన్
ఇక ఈ కిట్లను వాడమంటూ ఐసిఎంఆఆర్‌కి రిపోర్ట్ చేసింది..దీంతో ఇప్పుడు చైనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల వాడకంపైనా వివాదం ముసురుకుంది

పది నిమిషాల్లోనే ఫలితాలు తెలుస్తాయంటూ అదే పనిగా ఊదరగొట్టన చైనా ర్యాపిట్ టెస్ట్ కిట్ల డొల్లతనాన్ని రాజస్థాన్
ప్రభుత్వం ఎండగట్టింది...తమ రాష్ట్రంలో 168 ర్యాపిడ్ టెస్టులు చేశామని..ఐతే 5.4శాతం మాత్రమే కరెక్ట్‌ ఫలితాలను ఇచ్చాయని సదరు రాష్ట్ర మంత్రి వాపోయారు...

  సవాయ్ మాన్‌సింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న కరోనా వైరస్ పేషెంట్లకు ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ద్వారా పరీక్షలను నిర్వహించామని, ఫలితాలు ఆశించిన విధంగా లేవని రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది.. దీంతోపాటే ఈ టెస్ట్ కిట్ల ద్వారా  కరోనా వైరస్ పరీక్షలను నిలిపివేసిన విషయాన్నిఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తెలియజేసింది  ఐసీఎంఆర్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని మంత్రి రఘుశర్మ చెప్పుకొచ్చారు.. కరోనా అనుమానితుల రక్త నమూనాలను సేకరించి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. హాట్ స్పాట్‌లలో అనుమానితులకు ర్యాపిడ్ కిట్ల ద్వారా టెస్టులు చేయడం ద్వారా స్క్రీనింగ్ తేలికవుతుంది. ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్ అని తేలిన వారికి పీసీఆర్ టెస్టు చేసి మరోసారి ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. ఐతే మాన్ సింగ్ ఆస్పత్రిలో ఆల్రెడీ కరోనా పాజిటివ్ వచ్చినవారికి ర్యాపిడి్ టెస్ట్ చేయగా..నెగటివ్ అంటూ  రిజల్ట్ రావడంతో ప్రభుత్వం వీటి సమర్ధతపై సందేహం వ్యక్తం చేసింది..రాజస్థాన్ వాడిన ఈ టెస్టింగ్ కిట్లను చైనా నుంచి తెప్పించినవి..

గువాంగ్ఝౌ సిటీ నుంచి రాజస్థాన్, తమిళనాడుకు ఇలాంటి ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ 3 లక్షలవరకూ వచ్చాయ్..వీటిలో ఏ కంపెనీ కిట్లను రాజస్థాన్ తప్పుబట్టింది..నిలిపివేసింది తెలియరావడం లేదు..ఐతే చైనా నుంచి భారత్‌కి వచ్చిన కిట్లను అక్కడి రెండు కంపెనీలు పంపాయ్..వాటిలో ఒకటిజుహాయ్ లివ్‌జోన్ డయాగ్నోస్టిక్ సంస్థ కాగా..రెండోది..గువాంగ్ఝో వండ్‌ఫో బయోటెక్ సంస్థ ఈ రెండిటిలో ఏ కంపెనీ కిట్లు ఫెయిలయ్యాయో తెలియాల్సి ఉంది..

చైనా నుంచి పెద్ద ఎత్తున ర్యాపిడి యాంటీ బాడీ టెస్టింగ్ కిట్స్ వస్తున్నాయన్న సందర్భంలోనే దేశంలో చాలామంది చైనా కిట్లపై సందేహాలు వెల్లిబుచ్చారు..ఐతే కేంద్రం, ఐసిఎంఆర్ మాత్రం గ్వాలియర్ డీఆర్‌డిఓలో వీటిని చెక్ చేసే పంపుతామని..మన స్టాండర్డ్స్‌కి తగ్గట్లుగా లేకపోతే అనుమతించమని చెప్పారు..ఆ తర్వాత గ్వాలియర్‌లోని
డిఆర్‌డిఓని ఢిల్లీకి కూడా మార్చారు..ఐతే రాజస్థాన్ ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం  ర్యాపిడ్ టెస్ట్ కిట్ల పనితనంపై..అందులోనూ చైనా కిట్లపై సందేహాలు మళ్లీ  ప్రారంభమయ్యాయ్..

 ఐసిఎంఆర్ స్పందనని బట్టి తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్తున్న రాజస్థాన్..ఐసిఎంఆర్ కిట్లను వెనక్కి పంపమంటే వెంటనే తిరగగొడతామని ప్రకటించింది..మరి ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చర్చకు వస్తోంది..అవి కూడా రాజస్థాన్ బాట పడతాయా లేక ర్యాపిడ్ టెస్టులను కంటిన్యూ చేస్తాయా అనేది తేలాల్సి ఉంది

Comments

  1. ఈ టెస్టు కిట్లకి తగలేసే డబ్బులతో హైడ్రాక్షీ క్లోరోక్వీన్ తయారు చేసి జనాలకు ఫ్రీగా ఇస్తే కాస్త ఉపయోగమేమో.

    ReplyDelete

Post a Comment