కక్కుర్తిలో కమండలం ఈ టైమ్‌లో భలే ప్రొడక్ట్

కొందరికి సంక్షోభాలే అవకాశాలు..భలే కొటేషన్ కదా..మన ప్రియతమ నేత కూడా ఇదే పదే పదే వల్లెవేస్తూనే...హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది..అంటే ఏదో అనుకోండి..లాక్ డౌన్ కారణంగా అంతా అదే పని చేస్తున్నాంగా.. ఎలాంటి అవకాశాన్నైనా తమకి అనువుగా మలుచుకోవడం..అందులోనూ వ్యాపారం రాజకీయం చేయగలగడం కొందరికే సాధ్యమవుతుంది..అది కొంతమందికి బట్టతలపై జుట్టు మొలిపించడం లాంటిది..అంటే చేతకాదన్నమాట..

కానీ కొందరుంటారు..ఎలాంటి బోడి తలకైనా వెంట్రుకలు మొలిపించాం అంటారు..ఇంకా మాట్లాడితే మేం చెప్పినట్లు చేస్తే..ఇసుక పర్రమీదనైనా గోదావరి జలాలు పొంగి పొరలుతాయ్..వచ్చేటప్పుడు కాస్త కడవలు బిందెలు కూడా పట్టుకుని రండి అనే టైపన్నమాట..

ఆ బాపతుకే చెందిన ఓ తంపులమారి నారదావతారం అన్నంత పనీ చేసింది కూడా...మీ మైదానంలో కొత్తగా మొలకలు జెనింపజేస్తాం..అని చెప్పి కుచ్చుటోపీ పెట్టి అదిగో వచ్చేశాయ్ మీ పొలంలో మొలకలు అంటూ బోలెడంత సొమ్ము చేసుకున్నారు..ఆ తర్వాతా తమ పద్దతి మానుకోలేదు...ఏదైనా జనింపజేయగలం..ఆ సామర్ధ్యం నేలకి మాతృమూర్తులకే కాదనుకుంటూ తమ వ్యాపారం కొనసాగించారు..ఇప్పుడిక కరోనా కాలంలోనూ....హాయ్ హాయ్ రండి బాబూ రండి..మంచి తరుణం మించిపోవును..ఆలసించిన ఆశాభంగమంటూ కొత్తగా జనించిన ఐడియాలను అమ్మడానికి సిద్ధమైపోయారు..

Comments