బాబుగారి హంగామా..మరి వాళ్లకి లేదా కరోనా భయం


ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు కానీ..ఏకంగా ఏపికి ప్రైమ్ మినిస్టర్లాగా బిహేవ్ చేస్తాడనే విమర్శలున్నాయ్..
దానికి తోడు ఏ పేపర్ చూసినా కన్పించే విషయాలనే ఆయనే పరిశోధించి తెలుసుకున్న శాస్త్రవేత్తలాగా కరోనాపై
తన విజ్ఞానప్రదర్శన చేస్తుంటారు..కరోనా కేసులు గురించిన తెలిసిన మొదటి రోజుల్లోనే మన బ్లాగులో చంద్రబాబుగారు దేనికోసం ఎదురు చూస్తున్నారనే అంశాన్ని ఎత్తి చూపాం...బాబుగారు ఇప్పుడు ఖచ్చితంగా దాన్నే పట్టుకుని చెలరేగిపోతున్నారు...

ఏపిలో విజయవాడలో కేసులు దాచి పెట్టారంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడతారా ఎవరైనా..ఎక్కడైనా
ఎవరికి కరోనా వచ్చిందనే అంశాన్ని ప్రపంచంలో ఏ దేశం..రాష్ట్రం ప్రకటిస్తుందా..ఎన్ని కేసులు
నమోదవుతున్నాయనే విషయాన్నే ప్రకటిస్తుంది..అందులో ఏ జోన్ లో ఏ ఏరియాలో ఎలా అయితే
కేసులు వస్తున్నాయో ప్రకటిస్తారు..ఇంతకి మించి చంద్రబాబు అండ్ కో కోరుతున్న స్పష్టత ఏంటో తెలీదు
పైగా టెస్టులు తక్కువ చేస్తున్నారంటూ ఊగిపోవడం ఏంటి..ప్రపంచంలోనే ఏ దేశం కూడా ఉన్న వారందరికీ
టెస్టులు చేస్తూ సమయం వృధా చేయదు..పైగా కేంద్రమే కొన్ని ఆదేశాలు జారీ చేసింది..వాటిని కాదని
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందా..అప్పటికీ రాష్ట్రంలో మూడు దఫాలు సర్వేలు చేసారని చెప్తుంది..సరే
అది నిజం కాదనుకుంటే..కనీసం ఒక్కసారైనా చేసింది కదా..ఆ వాస్తవాన్ని ఒప్పుకోకుండా అవాకులు చెవాకులు పేలడం ఏంటి

పైగా ఈయనగారు హైదరాబాద్‌లో కూర్చుని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఏంటి..దానికోసం
కనీసం పదిమందిని ఇఁటికి పిలిపించుకోవాలి కదా..మరి వారికి లేదా లాక్‌డౌన్..ఈ సమయంలో కూడా
ఈ టీవి పిచ్చ ఏంటని..నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్షం ఇలా బిహేవ్ చేయదు..(దయచేసి
ఇతర రాష్ట్రాలలో ఎవరైనా ఇలా ఆరోపణలకు దిగిన దాఖలాలు ఉంటే చెప్పండి..వాటిని కూడా రాద్దాం)

ప్రతి ఒక్కరికీ మూడు మాస్క్‌లు పంపిణీ చేయాలని గవర్నమెంట్ డిసైడైతే..వాళ్ల మాజీ రాష్ట్రాధ్యక్షుడు
కళా వెంకట్రావ్ మాట్లాడిన మాట..టిడిపి ఎంత రెక్‌లెస్‌గా మాట్లాడుతుందో అర్ధమవుతోంది..రాష్ట్రంలో వైరస్ మూడోదశలోకి వచ్చిందనే మాస్క్‌లు ఇవ్వడం లేదట..ఇంతకన్నా దిక్కుమాలిన తనం ఉందా...
అసలు రేషన్ కార్డ్ లేకపోయినా...సరుకులు అందిస్తామని చెప్తుంటే...విమర్శలు చేయడమంటే..నాకైతే..ఛీ వీళ్ల బతుకులు అన్పిస్తుంది..

Comments

  1. అన్ని వైరస్ ల కన్నా ప్రమాదకరం పచ్చ వైరస్. ఇది పచ్చ మీడియా ద్వారా వ్యాపిస్తుంది.

    ReplyDelete
  2. AP ranked no.1 in implementing lockdown and breaking the spread of virus as per ndtv survey today.

    థూ మీ పచ్చ బతుకులు చెడ. కుళ్ళి కుళ్లి ఎడవండి.

    ReplyDelete
    Replies
    1. NDTV అనే సాక్షికి ఇంగ్లీషు వెర్షన్ కొట్టిన డప్పుకే అంత పులకించిపోయి బట్టలు చింపుకుంటున్నావా GK(less)K?

      రాత్రి నానీ గ్యాంగ్ లీడర్ సినిమా చూసి మాంచి హుషారు మూడ్ లగాయిస్తుంది.నీ రిపీట్ రన్ ఉక్రోషపు తిట్లకి నాకు కోపం రావటం లేదులే.

      నీ అభిమాన హీరో గురించి ఛిన్న క్విజ్ పెడతాను - పాల్గొంటావా!

      మొన్నీ మధ్యనే జగన్ జీవిత చరిత్ర రాశాను నా బ్లాగులో.ముఖపుస్తకంలో షేర్ చేస్తే సూపర్ రెస్పాన్స్ వచ్చుంది. మీ జఫాలకి కూడా నచ్చుతుంది.నీల అబద్ధాలు రాయను కాబట్టి చాలా ప్రామాణికంగా ఉంటుంది, చదివే ధైర్యం ఉందా?

      1.జగన్ తొలిసారి రాజకీయాలలోకి ఎప్పుడు ఎక్కడ ఎలా వచ్చాడు?

      2.జగన్ రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన మొదటి సన్నివేసం ఏది?

      3.జగన్ యొక్క సంపాదనా ఆదాయమూ స్వశక్తితో సాధించినదా, అదృష్టం వల్ల దక్కినదా, దోపిడీ వల్ల సమకూడిన అక్రమార్జనయా?

      5.అప్పటికే ఎన్నికల ప్రచారంలో పార్టీకి వోట్లూ సీట్లూ తేగలిగి తగినంతమంది శాసనసభ్యుల మద్దతు కూదగట్టుకోగలిగి పార్టీకి లాభమే అనిపిస్తున్న జగన్ నాయకత్వాన్ని కాంగ్రెస్ ఎందుకు ప్రోత్సహించ లేదు?

      6.అంత పగబట్టినట్టు కేసు పెట్టిన కాంగ్రెసే జైలులో తన ములాకాతుల్ని స్వేచ్చగా నిర్వహించుకుని తన పార్టీ కార్యకలాపాల్ని నిర్వహించుకునే వెసులుబాటు ఎందుకు ఇచ్చింది?

      7.పై ప్రశ్నని బాగా అర్ధం చేసుకోండి.కేసు పెట్టిందీ జైలుకి పంపించిందీ రాజకీయంగా అతన్ని అణిచివెయ్యడానికే అయితే, తెదెపా వాళ్ళు జగన్ జైలునే తన పార్టీ ఆఫీసు కింద మార్చేశాడని విమర్శించే స్థాయిలో అన్ని పార్టీల నాయకులూ నాగార్జున లాంటి సెలెబ్రిటీలూ అతన్ని కలవడానికి వెల్తూ అతని మీద నిరంతరం మీడియా ఫోకస్ పడుతూ ఉండటం అధికారంలో ఉన్న పార్తీ సహకారం లేకుండా జరుగుతుందా?

      8.అసలు అతన్ని ఆనాడు జైలులో ఉంచడానికి చెప్పిన్న కారణం నేరాలు రుజువు కావటం కాదు, బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చెస్తాడని. నిజానికి ఆ అవకాశం A2 అని పేర్కొనబడిన విజయసాయి రెడ్డితో సహా అందరు సహనిందితులకీ వర్తించేటప్పుదు అందర్నీ జైలులో ఉంచాలి కదా, మరి ఇతన్ని ఒక్కణ్ణే జైలులో ఎందుకు పెట్టారు?

      9.ఎన్నికల ప్రచారాల్లోనూ ఇతర సందర్భాల్లో జరిగే బహిరంగ సంభాషణల్లోనూ రాని పొరపాట్లూ తడబాట్లూ పత్రికా సమావేశాల్లోనూ ఇతర సందర్భాల్లోనూ అక్కడ ఉన్నది చూసి చదివేటప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నాయి?

      10.దిశ చట్టాన్ని ప్రారంభిస్తూ సత్వర న్యాయం గురించి అంత గొప్పగా ప్రశంశించిన వ్యక్తి తన మీద ఉన్న కేసుల విచారణకి ఎందుకు సహకరించడం లేదు?

      11. జగన్ మీద ఉన్న కేసుల గురించి జగన్ లాయర్లే "ఒక కేసులో జగన్ నిర్దోషి అని నిరూపించటానికి పనికొచ్చవి మరొక కేసులో దోషి అని నిరూపించటానికి పనికి వచ్చేలా ఉండటం" నిజమేనా?అది నేను ఆంధ్రజ్యోతిలొ చదివాను. దాన్ని ఎటూ బోకుజ్యోతి అనేస్తున్నారు కదా,పోనీ జగన్ లాయర్లు అసలు చెప్పినది ఏమిటి?అతను నిరపరాధి అయి ఉండి అతని మీద పడినవి తప్పుడు కేసులు అయితే ఎందుకు వాటినుంచి బయటకి రాలేకపోతున్నాడు?అతను అపరాధి అయి ఉండి అతని మీద పడినవి తప్పుడు కేసులు కాకపోతే మీరెందుకు అతన్ని అభిమానిస్తున్నారు?

      12.మొదట తమని ధిక్కరించాడని కేసులు వేసి జైలులో పెట్టి 16 నెలలు కొత్తల్లుడి మర్యాదలు చేసి విభజన ఆఖరు దశలో బయటికి తెచ్చి అతన్ని ముఖ్యమంత్రిని చేసే బదులు సంతకాలు సేకరించడం ద్వారా మెజారిటీని నిరూపించుకున్నప్పుడే ముఖ్యమంతిని చేస్తే సరిపోయేది, అలా ఎందుకు చెయ్యలేదు?

      13.అధికారంలోకి రావటానికి అంత తెలివిని చూపించినవాడు అధికారంలోకి వచ్చాక అంత తెలివితక్కువగా ఎందుకు పరిపాలిస్తున్నాడు?

      BEST OF LUCK/INTELLECT!

      Delete
  3. హహ హ...చంద్రబాబుపై కామెంట్లు చేస్తే...జగన్ నిజస్వరూపం అంటూ వాపోవడం ఏంటి బ్రో...నీ బాధ అర్ధమైందిలే కానీ..తప్పదు మరో నాలుగేళ్లు...:))

    ReplyDelete

Post a Comment