ఫార్మాలో ఇక ఇండియాదే రాజ్యం కాబోతుందా..?


ప్రస్తుతం భారత్‌కి ఆశాజనకంగా కన్పిస్తున్న రంగం ఫార్మా ఇండస్ట్రీ..కరోనాకి ట్రీట్‌మెంట్‌లో అవసరమైన డ్రగ్స్ విషయంలో అన్ని దేశాలకు భారత్ ఓ డెస్టినేషన్ సెంటర్‌గా మారిందంటే అతిశయోక్తి కాదు..మరోవైపు , వేక్సిన్ తయారీ టెస్టింగ్ కిట్స్ వంటి అంశంలో కూడా దేశీయ ఫార్మా రంగం వేగంగా తన సత్తా చాటుతోంది..

 2019 సంవత్సరం లెక్కల ప్రకారం 55 బిలియన్ డాలర్ల మేర మార్కెట్ పరిమాణం కలిగిన భారత ఔషధ రంగం
27లక్షలమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలిగిస్తోంది.. ఫార్మా ట్రేడ్ విషయానికి వస్తే..2019 ఏప్రిల్ నుంచి 2020 జనవరి వరకూ 13.7 బిలియన్ డాలర్ల మేర ఎక్స్‌పోర్ట్స్ చేయగా..దాదాపు 2 బిలియన్ డాలర్ల మేర దిగుమతులు జరిగాయ్. ప్రపంచంలోని సగం జనరిక్ డ్రగ్స్‌ని తయారు చేసేది భారత్ ఒక్కటే తయారు చేస్తుంది. అలానే ఎయిడ్స్‌కి వాడే మందుల్లో 80శాతం ఒక్క మన దేశమే సప్లై చేస్తుంది. 
అమెరికా,యూకే,కెనడా, మిడిల్ ఈస్ట్ ప్రాంతాలకు ఎక్కువగా భారత్ తన ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది..ఇంత  గ్లోబల్ ప్రెజన్స్ ఉన్న దేశం కాబట్టే ఇప్పుడు కరోనాపై పోరాటంలోనూ ప్రపంచదేశాలు భారత్ ఫార్మారంగంవైపు చూస్తున్నాయ్. మన దేశంలో 3వేల ఫార్మా కంపెనీలు..10,500 మందుల తయారీ యూనిట్లు ఉన్నాయని అంచనా..
 రా మెటీరియల్ కోసం చైనాపైనే ఆధారపడటంతో గత రెండు నెలలుగా భారత్ ఫార్మా ఇండస్ట్రీ కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా ప్రస్తుతం చైనాలో తిరిగి పనులు ప్రారంభం అయ్యాయ్ కాబట్టి...ఆ సమస్య ఉండదనే కేపిఎంజి అంచనా వేసింది.. ఐతే అమెరికాతో పాటు యూరోపియన్‌ యూనియన్‌లోని చాలా దేశాలు మెడిసిన్స్, డ్రగ్స్  నిల్వ చేసుకుంటూ ఉండటం వల్ల స్వల్పకాలికంగా మన ఫార్మా ఎగుమతులకు డిమాండ్‌ పెరగవచ్చు. ఇప్పటికే ఆ సంకేతాలు కన్పిస్తున్నాయ్ కూడా..మరోవైపు కరోనాకి వేక్సిన్‌ని కనుగొనే ప్రయత్నంలో దేశీయ కంపెనీలు కూడా పాల్గొనడం భవిష్యత్తులో లాభదాయకంగా మారనుంది
 లాక్‌డౌన్ నుంచి ఫార్మా కంపెనీలకు మినహాయింపు లభించినా....వర్కర్లు దొరకకపోవడం  ప్యాకింగ్‌ మెటీరియల్‌ లభ్యతపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలతో చిన్న పాటి సంస్థల ప్రొడక్షన్ దెబ్బతింటోంది. ఐతే దిగ్గజ కంపెనీలు ఈ సమస్యని అధిగమిస్తున్నాయని కేపిఎంజి తన నివేదికలో పేర్కొంది..ముడిఉత్పత్తులు ఫ్యాక్టరీలకు చేరకపోవడం కూడా తయారీని దెబ్బతీస్తోంది. అత్యవసర ఔషధాలు, శానిటైజర్లు, పీపీఈల సరఫరా, పంపిణీపై ప్రతికూల ప్రభావం పడుతోంది.
 ప్రస్తుతం ఫార్మా కంపెనీలు ఎదుర్కొంటోన్న సమస్యలకు పరిష్కారంగా మేనుఫేక్చరింగ్ యూనిట్లకు..నిబంధనల సడలింపు రాయితీలపై క్లారిటీ ఇవ్వాలని కేపిఎంజి సూచించింది..వీటన్నింటికీ సింగిల్ విండో క్లియరెన్స్ ఇవ్వాల్సుంటుందని చెప్పింది. అలానే జీఎస్టీ రీఇంబర్స్మెంట్ త్వరగా ఇవ్వాలని అభిప్రాయపడింది.సోషల్ డిస్టెన్సింగ్ అమలు అయ్యేలాగా డిజిటల్ పేమెంట్లకు ప్రోత్సాహించాలని..స్థానికంగా ఎఫ్‌డిఏ ప్రమాణాలను అమలు చేయాలని ప్రభుత్వానికి కెపిఎంజి సూచించింది. అలానే ఫార్మారంగం ఎదుర్కొంటున్న లేబర్ సమస్యని పరిష్కరించేందుకు ఎలక్ట్రానిక్ పాసులను జారీ చేస్తే..లాక్‌డౌన్ పీరియడ్‌లో ఉత్పత్తుల తయారీకి ఇబ్బందులు తలెత్తవని సిఫార్సు చేసింది

Comments