భారత ఆర్ధికరంగంపై కరోనా వైరస్ ప్రభావం కేపిఎంజి అంచనా



కరోనా పడగ నీడ భారత్‌పై పడటంతో ఆర్ధికరంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని..నివేదికలు వస్తున్నాయ్..కొన్ని రేటింగ్ ఏజెన్సీలు భారత్ ఇప్పట్లో కోలుకోలేదంటూ బెంబేలెత్తిస్తున్నాయ్..మరి కొన్ని మాత్రం కరోనా కట్టడిని చేయగలిగితే ఈ ప్రభావం కొంతకాలం తర్వాత  పూడ్చుకోవచ్చంచూ సూచిస్తున్నాయ్. ఈ నేపధ్యంలోనే కేపిఎంజీ మూడు రకాల అంచనాలను వెల్లడించింది
 నడస్తున్న సంవత్సరంలో అంతర్జాతీయంగా ప్రతికూల ప్రభావానికి లోనైన దేశ ఆర్ధికరంగంపై కరోనా వైరస్ పెనుప్రభావాన్నే చూపుతోంది.. చివరి క్వార్టర్‌లో పడ్డ ఈ పిడుగు మొత్తం ఆర్ధిక సంవత్సరాన్నే దారుణంగా దెబ్బతీస్తోంది..ఈ ప్రభావం ఎంత ఉండొచ్చనే అంచనాలను కేపిఎంజి తన నివేదికలో పొందుపరిచింది..దీని కోసం మూడు రకాల పరిస్థితుల ఆధారంగా అంచనా వేసింది
మొదటిది..ఏప్రిల్ నుంచి మే నెల చివరికల్లా కరోనా ప్రభావం తగ్గితే..మన దేశంలో వృద్ధి రేటు 5.3 నుంచి 5.7శాతంగా నమోదు కావచ్చనే పాజిటివ్ సంకేతం ఇచ్చింది. ఎందుకంటే..ఇప్పటికే చైనాలో ఫ్యాక్టరీలు తెరుచుకుని తిరిగి పనులు మొదలయ్యాయ్. దాంతో పాటే ఇతర దేశాల్లోనూ వైరస్ కట్టడి అయినట్లైతే ప్రపంచదేశాల ఆర్ధిక స్థితి కూడా మెరుగుపడుతుందని కేపిఎంజి ఆశావహంగా అంచనా వేసింది..ఐతే ఇది మే నెల చివరికి కానీ జరగదనే సంకేతాలు వెలువడుతున్న నేపధ్యంలో ఎక్కువమంది ఈ స్థాయి ఆర్దిక వృద్ధి జరగకపోవచ్చంటున్నారు..

ఇక కేపిఎంజి సంస్థ అంచనా వేసిన రెండో సిచ్యుయేషన్...భారత్‌లో మాత్రమే కరోనా నియంత్రణలోకి వచ్చి ఉండి..ఇతర దేశాల్లో అలానే ఉంటే అనే రెండో పరిస్థితి..ఇతర దేశాలతో ముడిపడి ఉన్న అనేక ఎగుమతులు దిగుమతులు దెబ్బతింటాయి కాబట్టి..ఈ మధ్యస్థ స్థితిలో భారత్ మాత్రమే కాస్త ఆశాజనకంగా ఉంటుందని..వృద్ధిరేటు నాలుగు నుంచి నాలుగున్నర శాతం మధ్య నమోదు కావచ్చని కేపిఎంజి లెక్క గట్టింది..కానీ అంతర్జాతీయ సంస్థలు ఈ మాత్రం వృద్ది రేటుని కూడా భారత్ సాధిస్తుందనే నమ్మకం పెట్టుకోవడం లేదు..గోల్డ్‌మేన్ శాక్స్ అయితే ఏకంగా  1.6శాతంగా నమోదవ్వచ్చనే అంచనా వేయడం గుర్తుంచుకోవాలి...

 కేపీఎంజి సంస్థ వేసిన మూడో పరిస్థితి...కరోనా కట్టడి కాకుండా..లాక్‌డౌన్ కొనసాగిస్తే ఎలా ఉంటుందనే అంశం ఆధారంగా వేసింది..భారత ఆర్థికవ్యవస్థ తీవ్రంగా నష్టపోతుంది..వృద్ధిరేటు 3శాతానికంటే తక్కువగా నమోదు అవుతుంది.. కని వినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం చోటు చేసుకుంటుంది...

 ముడిపదార్ధాల దిగుమతులు లేక లక్షలాది కార్మికుల వలసతో తయారీ రంగం కుదేలవుతుంది.మరోవైపు క్రూడాయిల్ ధరలు ఎంత తగ్గినా ఆయిల్ వినియోగం తగ్గిపోవడంతో..రేటు తగ్గడంతో వచ్చే లాభాలను పొందలేకపోతోంది భారత్..దీనికి కారణం లాక్‌డౌనే...ఈ సమయంలోనే సోషల్ డిస్టెన్స్ పాటింపజేస్తూ..అట్టడుగు వర్గాలకు ప్రయోజనాలు అందేలా పాలసీలు రూపొందాలని కేపిఎంజీ నివేదికలో పేర్కొంది..సప్లై చైన్‌లోని
ఉత్పత్తి, తయారీ రంగాల్లో కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యే చర్యలు తీసుకోవాలి..అలానే వైద్యరంగంలోని సన్నద్ధతని పెంచాలి..అన్నింటినీ మించి గత ఏడాదికాలంగా నీరసించిపోయిన డిమాండ్ పెంచడమే ఆర్థికవృద్దికి కీలకం..కానీ లాక్‌డౌన్ తర్వాత కూడా కరోనా భయాలు వెంటాడతాయి..

ఏవి అవసరమో..అవే కొనుగోలు చేయడానికే జనం ఇష్టపడతారు.. విలాసవస్తువులు..అనవసర వినియోగం
దాదాపు తగ్గిపోతుందని అంచనా..ఇదే వినియోగరంగానికి శాపంగా మారనుంది.అందుకే  డిమాండ్ పెంచడమే సూత్రంగా పాలసీలు తయారు కావాలని కేపిఎంజీ సూచించింది. స్టిమ్యులస్ ప్యాకేజీలు భారీగా ఉండాలని..ఉపాధి కల్పనతో పాటు..ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని సూచించింది...ఇదే సమయంలో ఐక్యరాజ్యసమితికి చెందిన యూఎన్ సిటిఏడి కూడా భారత్, చైనాపై కోవిడ్ 19 ప్రభావం తక్కువే ఉండొచ్చని అంచనా వేయడాన్ని గుర్తు చేసింది

Comments