వాళ్లే కరోనా వాహకులైతే. వారింకా బతికే ఉన్నారేం బాబూ ! సిగ్గులేని రాతలకు అర్ధం కూడా ఉండదా..హెరిటేజ్ సంగతేటి


వైఎస్సార్ కాంగ్రెస్ లీడర్లే వైరస్ వాహకులంటూ అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్న చంద్రబాబుగారు..ఓ మాటకి జవాబు ఇవ్వాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు..కనీసం ఒక్కళ్లు డిమాండ్ చేస్తున్నారనుకోండి..కరోనా వైరస్ విజృంభించడం ప్రారంభమై నెల రోజులు అవుతోంది..కర్నూలు కానీ..చిత్తూరు కానీ..మరో చోట కానీ..మీరెవరిని అయితే వాహకులు అంటున్నారో..వారంతా బతికే ఉన్నారు..పైగా మీ ఆరోపణల ప్రకారం రోజూ తిరుగుతున్నారు..అంటే వైరస్ వాళ్లనేం చేయలేకపోయిందా..కనీసం ఓ పది రోజులు కూడా ఇంట్లో పడుకోబెట్టలేకపోియిందా వారిని కరోనా వైరస్...అంటే మీకు వాహకులు అని ఎవరినో అనాలో కూడా తెలీకుండా విమర్శించేస్తన్నారా...?  
కనీసపు స్థాయి బుద్దీ జ్ఞానం లేకుండా మాట్లాడటం సరికాదు..ఈ మాట మీ అంత పెద్దవాళ్లను పట్టుకుని అనడానికి బాధగా ఉన్నా..ఇందులో వాస్తవం లేదా..ఈ స్థితికి మిమ్మల్ని మీరే దిగజార్చుకుంటున్నారు..ఎవరో ఉల్టాపల్టా లీడర్లు నోటికి వచ్చినట్లు పేలుతున్నారంటే అర్ధం ఉంది..మీ వయసెంత మీ అనుభవమెంత..అంత ఉండి కూడా ఇలాగున..అర్ధం పర్థం లేకుండా మాట్లాడవచ్చా...?




ఈనాడులో ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పట్టణం మా సొంత ఊరు..అక్కడ గత పదిరోజులుగా బైటికి జనం రావడం లేదు..అందులో ఇలాంటి మీడియా వాళ్లకి తెలిసేట్లుగా గుంపుగా నిలబడి ఎవరూ ఆరోపించేంత తీరికలో అసలే లేరు..అంటే ఊరూ పేరూ లేకుండా ఇలాగున ఫలానావాళ్లు ఆరోపిస్తున్నారు అంటే ఎవడేం చేయలేడనా..? మరదే మన భాగ్యనగరంలో సెకండరీ కాంటాక్టులకు టెస్టులు చేయం అని భీష్మించుకున్న నేతల జోలికి పోరేం...సెంట్రల్ గవర్నమెంట్ టూర్ చేస్తున్న సమయంలో ఎక్కువ కేసులు బయటపడతాయనే కదా...కావాలని తక్కువ టెస్టులు చేస్తుంది..దానిపై చేతనైతే ఏదైనా రాయరాదా...? అబ్బే అలా ఎఁదుకు కుదురుతుంది..ఆస్తులను బిగదీస్తారని భయం

మరి మీ హెరిటేజ్ సంగతులు కూడా చెప్పండి..ఎంతమందికి వస్తే..ఎంతమందిని క్వారంటైన్ చేయాల్సి వచ్చిందో చెప్పండి మరి..అక్కడ కూడా వైఎస్సార్సీపీనే వ్యాపింపజేసిందా..?

Comments