కేరళలో కొత్త టెన్షన్...కరోనా లక్షణాల్లేవ్ కానీ..పాజిటివ్


కరోనా సోకిన తర్వాత ఎన్ని రోజులకు లక్షణాలు బయటపడతాయి...పద్నాలుగు రోజులా..కాకపోవచ్చు..ఎందుకంటే
ఇప్పుడు కొన్ని కేసులలో ఆ గడువు ముగిసిన తర్వాత..అందులోనూ అసలే లక్షణాలు లేనివారికి టెస్ట్ చేసినా వైరస్ ఉన్నట్లు తేలింది.ఇదే  గాభరా పెడుతోన్న విషయం.

కేరళలోని పథనంతిట్ట  కరోనా వైరస్ హాట్ స్పాట్‌గా ప్రభుత్వం గుర్తించింది..ఇప్పుడక్కడ
ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ రావడం సంచలనం కలిగిస్తోంది..ఎందుకంటే వీరు ఇద్దరూ క్వారంటైన్‌లో 14 రోజులు గడిపారు ఎలాంటి వైరస్ లక్షణాలు కన్పించలేదు..ఐనా టెస్టులో మాత్రం కరోనా వైరస్ ఉన్నట్లు కన్పించడంతో అధికారయంత్రాంగమంతా అలర్టైంది..

 కేరళ ప్రభుత్వం కరోనా వచ్చే హై రిస్క్ గ్రూప్ ఉన్నవారిని ముందునుంచీ 28 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచిస్తూ వచ్చింది. అందులో భాగంగానే దుబాయ్ నుంచి వచ్చిన ఓ 60 ఏళ్ల వ్యక్తి..ఢిల్లీ నిజాముద్దీన్ ట్రైన్‌లో జర్నీ చేసిన 19ఏళ్ల యువతి కూడా క్వారంటైన్‌లో గడుపుతున్నారు..ఐతే పద్నాలుగు రోజుల క్వారంటైన్ అయిన తర్వాత టెస్టులు చేయగా..ఇద్దరికీ కరోనా పాజిటివ్ రావడం జిల్లా యంత్రాంగానికి అంతు చిక్కకుండా ఉంది..ఐతే ఇక్కడే ప్రపంచ ఆరోగ్యసంస్థ చేసిన సూచనని గుర్తుకు తెచ్చుకోవాలి..కొన్ని కేసుల్లో ఎలాంటి లక్షణాలు కన్పించవని డబ్ల్యూహెచ్ఓ ఎప్పుడో సూచించింది..అలానే వైరస్ ఇంకుబేషన్ పీరియడ్ కొంతమందిలో 21 రోజులు కూడా ఉండే అవకాశం ఉందని కూడా డబ్ల్యూ హెచ్ఓ చెప్పింది..మరి ఇప్పుడు పథనంతిట్టలోని ఈ రెండు కేసులలో ఏది నిజమో తొందర్లోనే తేలనుంది.మరోవైపు  పథనంతిట్ట జిల్లా కలెక్టర్ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు..దాంతో పాటే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరెవరిని కలిశారనే వివరాలు తెలుసుకుని వారికి కూడా టెస్టులు చేయబోతున్నారు..తాజా పరిణామం చూస్తుంటే కరోనా లక్షణాలు కన్పిస్తే ట్రీట్‌మెంట్ కోసం పరుగులు పెట్టవచ్చు కానీ..ఇలా లక్షణాలు కన్పించకుండానే వైరస్ వ్యాప్తి చెందితే ఏం చేయాలనే  ఆందోళన నెలకొంది














వాయిస్() 

Comments