మేడ్ ఇన్ చైనా వైరస్‌కి మేక్ ఇన్ ఇండియా వేక్సిన్ ...వాటే స్క్రిప్ట్





కరోనా వైరస్‌కి వేక్సిన్ రెడీ అవుతోంది.. మీరు వింటున్నది నిజమే..అంతా అనుకున్నట్లే జరిగితే..సెప్టెంబర్ నాటికి వేక్సిన్ రెడీ అవడమే కాదు..అందుబాటులోకి వస్తుంది కూడా ..అదీ భారత్‌లోనే..తయారు చేస్తోంది ఆక్స్‌ఫర్డ్ ఇన్సిట్యూట్ అయినా..కరోనా వైరస్‌ వేక్సిన తయారీలో పాలుపంచుకుటుంది సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియానే..ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులతో కలిసి భారత కంపెనీ చేస్తోన్న ఈ ప్రయాగం ఇప్పటికే కోతులపై ప్రయోగం విజయవంతం అయింది..దీంతో ఇక మనుషులపై కూడా ట్రయల్స్ జరుగుతున్నాయ్..అన్నీ అనుకున్నట్లు జరిగితే వేక్సిన్ తయారైనట్లే..వేక్సిన్ల తయారీ చరిత్రలోనే మున్నెన్నడూ లేనంత వేగంగా 
మామూలుగా వేక్సిన్ తయారీకి ఆరు నుంచి ఏడేళ్ల సమయం పడుతుంది.కానీ ఇప్పుడు కరోనా వేక్సిన్ మాత్రం ఐదింతల వేగంతో ఇంకా చెప్పాలంటే జెట్ స్పీడ్‌తో తయారవుతోంది..కరోనా వైరస్ సార్స్ గ్రూప్‌కే చెందినది కాబట్టి...ఇప్పటికే వాటి జన్యుక్రమాన్ని బట్టి వేక్సిన్ తయారీలో ఉన్న దశలను..వాటి అధ్యయనాన్ని సైంటిస్టులు వినియోగించుకుంటున్నారు..ఓ ఛాన్స్ తీసుకుంటున్నారు..ఇదే వర్కౌట్ అయితే..సెప్టెంబర్ 2020నాటికి అంటే మరో ఐదునెలల్లో కరోనా భూతానికి తగిన టీకా మందు రెడీ అయినట్లే..కానీ ఇలాంటి వేక్సిన్లు..వేలల్లో లక్షల్లో కాదు..ఏకంగా వందలకోట్ల సంఖ్యలో కావాలి..మరి ఏ దేశానికి ఇంత కెపాసిటీ ఉందీ అంటే..ఒక్క భారత్‌కి మాత్రమే..అది కూడా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒక్కటే సంవత్సరానికి 150కోట్ల వేక్సిన్లను తయారు చేయగలదు..ఇప్పుడు జరుగుతుంది కూడా అదే..ఈ ఒక్క కెపాసిటీనే కాదు..అతి తక్కువ ధరకి వేక్సిన్ తయారు చేయడం కూడా భారత్‌కే సాధ్యం..అర సెంట్ ధరకే వేక్సిన్ తయారీ ఖర్చు పడుతుందని కొందరి అంచనా..అందుకే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కూడా కరోనా వేక్సిన్ తయారీ భారత్‌‌లోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ ఇండియాకి అప్పజెప్పింది
( కోల్‌కతా లేడీ -చంద్రదత్తా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వేక్సిన్ తయారీలో కీలక పాత్ర పోషిస్తోన్న సైంటిస్ట్)

 బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ . ఇప్పటికే కోతులపై చేసిన ప్రయోగాలు విజయవంతం కాగా.. . రాకీ మౌంటైన్ ల్యాబ్‌లో జరుగుతున్న ప్రయోగాల్లో భాగంగా కోవిడ్ 19 వేక్సిన్ ఆరు కోతులపై ప్రయోగించగా..అన్నీ 28 రోజుల తర్వాత కోలుకున్నాయని తేలింది..ఇప్పటికే హ్యూమన్ ట్రయల్స్ కూడా ప్రారంభం అయ్యాయ్..మొత్తం 550 మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చారు. మే నెలాఖరులోపు 6 వేల మందిపై ఈ ప్రయోగం పూర్తి కానుంది. 

ఇప్పటికే మిలియన్ల కొద్దీ వేక్సిన్ల ఉత్పత్తి జరుగుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది..భారత్‌లోనే కాదు ప్రపంచం మొత్తంలోనే వేక్సిన్ల తయారీకి సీరమ్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియాకి పేరు..వేక్సిన్ ఫలిస్తుందో లేదో తెలీదు కానీ..కరోనాపై పోరాటంలో ఛాన్స్ తీసుకోకూడదనే కంపెనీ సొంత రిస్క్‌పై ఇంత భారీగా వేక్సిన్ల తయారీకి దిగినట్లు తెలుస్తోంది... సీరమ్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియాకి రెండు వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయ్..కేవలం కోవిడ్ 19 వేక్సిన్ కోసమే సంస్థ రూ.600కోట్ల  ఖర్చుతో ఓ ప్లాంట్ పెట్టింది..  అలా కరోనా వైరస్ చైనాలో పుట్టినా వేక్సిన్ తయారీ మాత్రం భారత్‌కే సాధ్యమంటున్నారు

దీంతో ఈ ఏడాది 6కోట్లు..వచ్చే ఏడాది  40 కోట్ల డోసులను అందించాలని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ వ్యాక్సిన్లను ముందుగా భారత్‌లోనే అందించే అవకాశం ఉంది. వ్యాక్సిన్ ధరను సీరమ్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా ఏ ధరకి ప్రభుత్వానికి అందించినా..ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయనుంది. ప్రస్తుతానికి వేక్సిన్ రేటు వెయ్యి రూపాయలుగా చెప్తున్నారు.

Comments