ఈ కామర్స్ కోలుకోకపోవచ్చు..డిమాండ్ పెరగడమే రిటైల్ యాపారాలకు కీలకం



భారత జిడిపిలో రిటైల్ రంగం వాటా పదిశాతంగా అంచనా అయితే మొత్తం ఉపాధి కల్పనలో 8శాతం వాటాగా కేపిఎంజి లెక్కగట్టింది..  భారత్ రిటైల్ వ్యవస్థ ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద వ్యవస్థ..ఇందులో హౌస్ హోల్డ్, వ్యక్తిగత వినియోగ ఉత్పత్తుల వాటా 50శాతం, హెల్త్ కేర్ విభాగం 31శాతం, ఆహార పానీయాల వాటా 19శాతం ఉంటుంది.. మొత్తం మన ఈకామర్స్ రంగం  మార్కెట్ పరిమాణం 64 బిలియన్ డాలర్లుగా అంచనా

 ఇంత భారీగా వ్యాపారం జరిగే  రిటైల్, ఈకామర్స్ రంగంలో లాక్‌డౌన్ ప్రబావం ఎక్కువగాఉంది..ముడి సరుకులు
ముడి ఆహార ఉత్పత్తుల సప్లై చైన్ నిలిచిపోవడంతో..రిటైల్ రంగంలోని కొన్ని వస్తువులతో పాటు..వినియోగసంబంధిత వస్తువులు విక్రయాలు నిలిచిపోయాయ్..అలానే ప్రస్తుతం నిత్యావసరాలను మాత్రమే రవాణాకి అనుమతిస్తున్న నేపధ్యంలో నాన్ ఎసెన్షియల్ కేటగరీలోని ఇతర ఉత్పత్తుల వినియోగం కూడా నిలిచిపోయింది..రేపు తిరిగి వీటి సరఫరా పెరిగినా..డిమాండ్ పుంజుకోవడం కష్టంగా కేపిఎంజి సంస్థ తెలిపింది..ఇలా వినియోగం నిలిచిపోవడం క్రయవిక్రయాలకు అడ్డంకులు ఏర్పడటంతో..రిటైల్ సహా ఈకామర్స్
రంగాలలో క్యాష్ ఫ్లో, నగదు చలామణీ తగ్గిపోయింది..అలానే ఈ రంగంలోని లేబర్ పనుల్లో చేరడం..విధులు నిర్వహించడం కూడా సమస్యగా మారింది. ఐతే ఈ కామర్స్ సంస్థల ద్వారా నిత్యావసరాల కొనుగోలుకి మాత్రం డిమాండ్ విపరీతంగా ఉంది..ఐతే ఇక్కడా ఇదే సమస్య
ఆర్డర్ ఇచ్చిన వస్తువులను సురక్షితంగా..డెలివరీ చేయడమెలా అన్నదే..మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యావసరాల కోసం మాత్రమే ఈ రంగంపై వినియోగదారులు ఆధారపడుతున్నారు..ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో..సౌందర్య ఉత్పత్తులు..హైఎండ్ ప్రొడక్ట్స్‌కి డిమాండ్ బాగా పడిపోయింది..
అలానే రానున్న రోజుల్లో వీటి ఎక్స్‌పైరీ డేట్ దగ్గరపడితే ఆ సరుకంతా నిరర్థకంగా పారేయాల్సి వస్తుంది..దిగుమతులపైనే ఆధారపడే నాన్ ఎసెన్షియల్ ఉత్పత్తులకు ఇకపై గడ్డు కాలమే..అపారెల్, డ్యూరబుల్స్, రెస్టారెంట్లు, జిమ్‌లు మొదలైన విభాగాల్లో జనాలను ఆశించడం అత్యాశే అవుతుంది.. రిటైల్, కన్జ్యూమర్, ఈకామర్స్ రంగంలోని ఈ సమస్యలకు స్వల్పకాలానికైతే..ప్రిన్సిపల్ పేమెంట్లతోపాటు..ఇంట్రస్ట్ రిబేట్ ఇవ్వాలని..దీర్ఘకాలానికైతే..డ్యూటీలు..తగ్గించడంతోపాటు..రిటైల్ ప్రొడక్ట్స్ తయారీకీ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని కేపిఎంజీ సూచించింది..ఆర్ధిక భారం తొలగిపోయేందుకు

వడ్డీ రద్దుతో పాటు..బ్యాంకులు..ఎన్‌బిఎఫ్‌సిలు క్రెడిట్ లిమిట్స్ పెంచాలని..షాపులు..మాల్స్ అద్దెలపై కూడా మారటోరియం విధించాలని కేపిఎంజి సంస్థ అభిప్రాయపడింది..సోషల్ డిస్టెన్సింగ్ అమలు షాపులు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో పాటు, పర్సనల్ ఇన్ కంట్యాక్స్ రిడక్షన్, ఈకామర్స్ సంస్థలకు సరుకు రవాణాలో ఇబ్బందులు తగ్గించే వ్యూహాలు కావాలని కూడా కేపిఎంజీ తన నివేదికలో పేర్కొంది..

Comments