గొప్పోళ్ల అప్పులు రద్దు చేశారు...లేదు మీరే చేశారు..నిర్మలాసీతారామన్ రాహుల్ ట్విట్ల వార్


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత వారం విడుదల చేసిన విల్‌ఫుల్ డిఫాల్టర్ల లిస్ట్ రాజకీయంగా దుమారం రేపుతోంది...ఈ లిస్టులోని వారంతా బిజెపి అగ్రనేతలకు దగ్గరివారని..అందుకే వారి రుణాలన్నీ రద్దు చేశారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించడం వివాదం రేగింది..దీనికి కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ కౌంటర్ ఇచ్చారు..ఎవరి అప్పులు తాము రద్దు చేయలేదని స్పష్టంగా చెప్పారామె..

 రాహుల్ జీ..అసలు డిఫాల్టర్ల పర్వం ప్రారంభమైందే మీ ఫోన్ బ్యాంకింగ్ హయాంలోనంటూ రాహుల్‌గాంధీకి చురకలు అంటించారు..కాంగ్రెస్ పార్టీ ఈ అంశంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది..ముఖ్యంగా వయనాడ్ ఎంపి కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ట్వీట్ల వర్షం కురిపించారు..మొత్తం 13 ట్వీట్లతో రాహుల్‌గాంధీపై ట్విట్టర్ వార్ ప్రారంభించారామె....అంతకు ముందు రాహుల్ గాంధీ..తాను పార్లమెంట్‌‍లో ఈ విల్‌ఫుల్ డిఫాల్టర్ల వివరాలు అడిగినా కేంద్ర ఆర్దికమంత్రి దానికి జవాబు ఇవ్వలేదని ఆరోపించారు..దీనికి కారణం..బిజెపి అగ్రనేతల సన్నిహితుల రుణాలు రద్దు చేయడమే కారణంటూ ఎద్దేవా చేశారు..

ఇప్పుడు ఆర్బీఐ ప్రకటించిన లిస్టుతో వారి బండారం బైటపడిందంటూ విమర్శించారు రాహుల్...రాహుల్ విమర్శలను సీరియస్‌గా తీసుకున్న నిర్మలాసీతారామన్..వెంటనే రంగంలోకి దిగారు..అసలు ఆర్బీఐ ప్రకటించిన జాబితా విల్‌ఫుల్ డిఫాల్టర్లు..అంటే కావాలనే అప్పు ఎగ్గొట్టినవారి జాబితా అని దాన్ని సాంకేతికంగా రైటాఫ్ చేశారే తప్ప రుణాలను రద్దు చేయడం కాదంటూ వివరించే ప్రయత్నం చేశారు..సెప్టెంబర్ 30,2019 వరకు ఇలా బ్యాంకులకు అప్పులెగ్గొట్టిన వారి రుణాలను సాంకేతికంగా లెక్క గట్టడం నిలిపివేస్తారని..ఆర్బీఐ నిబంధనల ప్రకారమే బ్యాంకులు ఇలా చేస్తాయని చెప్పుకొచ్చారామె...అంత మాత్రాన ఈ అప్పులను రద్దు చేసినట్లు కాదని కూడా ట్వీట్ చేసారు నిర్మలాసీతారామన్...


ఆర్టీఐ  కింద సాకేత్ గోఖలే అనే వ్యక్తి  పిటిషన్‌తో ఆర్బీఐ 50 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారుల వివరాలను వెల్లడించింది..అందులో  నీరవ్ మోదీ,మెహుల్ చోక్సీ,విజయ్ మాల్యా వంటి ఆర్ధికనేరగాళ్లు కూడా ఉన్నారు. ఈ ముగ్గురు సహా 50మంది ఎగవేతదారులకు సంబంధించి మొత్తం రూ.68607కోట్ల రుణాలను బ్యాంకులు రైటాఫ్ చేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది..దీంతో కేంద్రంలోని బిజెపిని ఇరుకునపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి ఓ ఆయుధం
దొరికినట్లైంది..బిజెపినేతలకు సన్నిహితులైన వారి రుణాలను మాఫీ చేసారంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా బిజెపిపై దాడి ప్రారంభించగా..రాహుల్ గాంధీ దాన్ని ఓ రేంజ్‌కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు..దానికి ప్రతిగానే ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ ట్వీట్ల వర్షం కురిపించారు. అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను బాగు చేయడంలో ఏనాడూ కాంగ్రెస్  సరిగ్గా వ్యవహరించలేదని..కనీసం అప్పోజిషన్‌లో ఉన్నప్పుడైనా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలంటూ సైటెైర్లు వేశారు..మీ హయాంలోనే ఇలా కోట్లకి కోట్లు రైటాఫ్ చేసే ప్రక్రియ ప్రారంభమైందని గుర్తు చేశారు

 ఆర్బీఐ విడుదల చేసిన టాప్ 50 విల్‌ఫుల్‌ డిఫాల్టర్ల జాబితాలో లిక్కర్ కింగ్ విజయ్‌ మాల్యా, మెహుల్‌ చోక్సీ వంటి వ్యాపారవేత్తలకు చెందిన సంస్థలు కూడా ఉన్నాయి. సమాచార హక్కు చట్టం  కింద వచ్చిన దరఖాస్తుకు సంబంధించి ఆర్‌బీఐ ఈ మేరకు సమాధానం ఇచ్చింది. గతేడాది సెప్టెంబర్‌ 30 నాటి వరకు చూస్తే.. టాప్‌ 50 జాబితాలో.. మెహుల్ చోక్సీకి సంబంధించిన గీతాంజలి జెమ్స్‌అత్యధికంగా రూ.5,492 కోట్ల బాకీలు చెల్లించాల్సి ఉంది. అలాగే ఆర్‌ఈఐ ఆగ్రో రూ. 4,314 కోట్లు, విన్‌సమ్‌ డైమండ్స్‌ రూ. 4,076 కోట్లు కట్టాల్సి ఉంది. విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ రూ.1,943 కోట్ల బాకీలతో 9వ స్థానంలో ఉంది. ఇక డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ రూ. 1,962 కోట్లు, ట్రాన్స్‌ట్రాయ్‌ రూ. 1,790 కోట్లు బాకీ పడ్డాయి. మొత్తం మీద ఇలా టెక్నికల్‌గా రైటాఫ్ అయిన ఖాతాలనుంచి డబ్బు రాబట్టే ప్రక్రియ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించినా..రాజకీయపరమైన విమర్శలు మాత్రం ఆగడం లేదు.

Comments