కరోనాపై మరో డ్రగ్ పిడుగు...ఈసారి నైట్రిక్ ఆక్సైడ్


రికవర్ అయిన పేషెంట్లో ప్లాస్మా...
తర్వాత యాంటీ మలేరియా డ్రగ్స్,
 ఆ తర్వాత ఐవర్‌మెక్టిన్ ...
ఈ మధ్యలోనే చైనా నానో మెటీరియల్...
ఇ ప్పుడు ఈ వరసలో మరో మెడిసిన్...నైట్రిక్ ఆక్సైడ్ తో కరోనాని చంపేస్తామంటూ అమెరికాలోని మూడు రాష్ట్రాలు ,మూడూ ఐరోపా దేశాలు ట్రీట్‌మెంట్ కూడా మొదలుపెట్టాయ్..సక్సెస్ రేటు బావుంటే ఇదే కంటిన్యూ చేస్తామంటున్నారు  తమ పేషెంట్లపై ట్రయల్స్ ప్రారంభించాయ్..

నైట్రిక్ ఆక్సైడ్‌లో ఒక ఆక్సిజన్..ఒక నైట్రోజన్ మాలిక్యూల్స్ ఉంటాయ్..ఈ రంగులేని గ్యాస్..బ్లడ్‌లోకి పంపినప్పుడు రక్తకణాలు డైలేట్ అంట్ వ్యాకోచం చెందుతాయ్..తద్వారా బ్లడ్‌లో ఆక్సిజన్ ప్రవాహం ఎక్కువ అవుతుంది..ఇలా చేయడం ద్వారా హార్ట్ సంబంధ వ్యాధులకు ట్రీట్‌మెంట్ ఇస్తుంటారు..ఎక్కువగా అప్పుడే పుట్టిన చిన్నారుల్లో
గుండెలోకి ఆక్సిజన్ సరఫరా తగ్గినప్పుడు ఇలా చేస్తారు..ఇప్పుడు అమెరికా రాష్ట్రాలు..యూరప్ దేశాలు..కరోనాతో శ్వాస పీల్చుకోవడం కష్టమైనవారికి ఈ నైట్రిక్ ఆక్సైడ్ గ్యాస్‌ని సిపిఏపి-కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెషర్ మిషన్ల ద్వారా పంపుతున్నారు..తద్వారా శ్వాస ఆడటం తేలిక అవుతుంది. రోజుకి ఇరవై నుంచి ముప్పై నిమిషాలు
చొప్పున రెండుసార్లు...రెండువారాల పాటు ఇలా కొనసాగిస్తే..వైరస్ బాధితుల ఊపిరితిత్తుల్లోని వైరస్ కూడా చనిపోతుందని వైద్యులు నమ్మకం అలా వెంటిలేటర్లపై ఉండాల్సిన పేషెంట్ల సంఖ్యా తగ్గుతుంది..

నైట్రిక్ ఆక్సైడ్‌ 1992 నుంచి ముఖ్యమైన మాలిక్యూల్‌గా గుర్తించడం ప్రారంభం కాగా..1998లో ముగ్గురు అమెరికన్లకు ఈ నైట్రిక్ ఆక్సైడే కార్డియోవేస్కులార్ సిస్టమ్‌లో కీలకమైన మాలిక్యూల్‌గా పని చేస్తుందని కనుక్కున్నందుకు నోబెల్ కూడా గెలుచుకున్నారు..చాలా ఏళ్ల నుంచి వైద్యశాస్త్రంలో
 క్రిటికల్ కేర్‌లో ఉన్నవారికి..డయాబెటీస్‌తో రక్తసరఫరా తగ్గినవారికి  నైట్రిక్ ఆక్సైడ్‌ని వాడుతున్నారు..అన్నింటికంటే ముఖ్యంగా 2002లో కరోనా గ్రూప్‌కే చెందిన సార్స్‌ ట్రీట్‌మెంట్‌లో కూడా నైట్రిక్ ఆక్సైడ్‌ని వాడిన చరిత్ర ఉంది..

ప్రస్తుతానికి మసాచుసెట్స్ జనరల్ హాస్పటల్,అలబామా, లౌసీయానా, ఆస్ట్రియా, ఇటలీ, స్వీడన్‌లో నైట్రిక్ ఆక్సైడ్‌ను నోవెల్ కరోనా వైరస్‌కి ట్రీట్‌మెంట్‌గా వాడుతున్నారు..ఐతే నైట్రిక్ ఆక్సైడ్‌ని పేషెంట్‌కి అందించే మిషన్లైన సిపిఏపి మిషన్లు మాత్రం ఇక్కడ బాగా కొరత ఉందని రిపోర్ట్స్ వస్తున్నాయ్. ఇదీ నైట్రిక్  ఆక్సైడ్ కథ
ఇంకో కొసమెరుపు ఏమిటంటే..నైట్రస్ ఆక్సైడ్ అని ఇంకో గ్యాస్ ఉంది..అది లాఫింగ్ గ్యాస్ అని కూడా అంటారు..పీల్చితే సినేమాల్లో చూపించినట్లుగా...పిచ్చెక్కినట్లు నవ్వేస్తూ ఉంటారు..అది వేరు ఇది వేరూ...

Comments

  1. నైట్రిక్ ఆక్సైడ్ ఫార్ములా NO
    నైట్రస్ ఆక్సైడ్ ఫార్ములా N2O (ఇదే లాఫింగ్ గ్యాస్)

    ReplyDelete

Post a Comment