వ్యవసాయానికి సాయం చేస్తేనే...బతకడానికి తిండి దొరికేది


లాక్‌డౌన్ కారణంగా పంట చేతికి వచ్చిన తరుణంలో లాక్‌డౌన్ వ్యవయసాయరంగంపై తీవ్ర ప్రభావమే చూపనుంది
ఐతే ఇప్పుడు తాజాగా కేంద్రం రైతులకు వెసులుబాటు కల్పించడంతో కాస్త తెరిపిన పడే అవకాశాలు కన్పిస్తున్నాయ్..

 భారత ఆర్ధికరంగానికి జీవనాడి లాంటి ఆహార వ్యవసాయరంగాలు.. గ్రాస్ వేల్యూ యాడెడ్ రంగంలో 16.5శాతం
వాటా కలిగి ఉండటంతో పాటు..43శాతం ఉపాధి కల్పిస్తున్నాయ్.. మన ఫుడ్ అండ్ రిటైల్ మార్కెట్ పరిమాణం చూస్తే
ఏకంగా దాదాపు 829బిలియన్ డాలర్లు కాగా..ఫుడ్ ప్రాసెసింగ్ మార్కెట్ 543 బిలియన్ డాలర్లు..ప్రపంచవ్యాప్తంగా డైరీ, సుగంధద్రవ్యాలు జీడిపప్పు ఉత్పత్తిలో నంబర్ వన్ స్థానం, ఆహారధాన్యాలు, పళ్లు, కూరగాయల ఉత్పత్తిలో రెండో స్థానం మనదే.. మన అగ్రికల్చరల్ ఇన్‌పుట్స్ మార్కెట్ సైజ్ చూస్తే..విత్తనాల వ్యాపార పరిమాణం 4 బిలియన్ డాలర్లు..ఆగ్రోకెమికల్స్ 5 బిలియన్ డాలర్లు ఫర్టిలైజర్లు 19.3 బిలియన్ డాలర్లు..ఇక ఈ కామర్స్ సహా దేశీయ వాణిజ్యంలో ఫుడ్ అండ్ గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్‌లో డ్రై ఫ్రూట్స్, పానీయాలు
తాజా ఉత్పత్తులు, డైరీ, సుగంధ ద్రవ్యాలు ప్రధాన పాత్ర వహిస్తాయ్

 లాక్‌డౌన్ ప్రభావంతో ధరల్లో తేలికపాటి మార్పును సెరెల్స్, కూరగాయలు,పాలు, పళ్లు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల్లో గమనిస్తుండగా సీ ఫుడ్ మాంసంలో మధ్యతరహా ప్రభావం కన్పిస్తోంది..పౌల్ట్రీరంగంలోని గుడ్లు,చికెన్ ‌మాత్రం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.. ఇవన్నీ కూడా  నిత్యావసరాలుగా భావించిన ప్రభుత్వం వీటి సరఫరాకు ఎలాంటి అడ్డంకులు కల్పించకపోవడంతో వినియోగదారులపై కాస్త ధరల ప్రభావం తప్ప వేరేరకంగా పడలేదు..ఐతే రానున్న రోజుల్లో మాత్రం రాష్ట్రాల మధ్య సరిహద్దులు నిలిచిపోయిన ప్రభావంతో రేట్లు పెరగవచ్చని కేపిఎంజి సూచించింది.. రానున్న రోజుల్లో ఈ కామర్స్ రంగంతోపాటు ప్రభుత్వాల పాలసీలే వీటి ధరలను నిర్ణయించబోతున్నాయ్..అలానే వంటనూనెలు..వినియోగసంబంద నూనెలు రానున్న కాలంలో డిమాండ్ తగ్గడంలో ధరలు తగ్గుతాయని అంచనా వేసింది..ఎరువుల రంగంలో కూడా కొంత ఊగిసలాట కన్పిస్తుందని ప్రస్తుతానికి అగ్రి ఉత్పత్తుల్లో ప్రభావం కన్పించకపోయినా..లాంగ్ టర్మ్‌లో ప్రభావం ఊహించలేమని..కెపిఎంజి అభిప్రాయపడింది..ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాతే ఈ అంచనాల్లో వాస్తవమెంత..అపోహలెంత అనేది కూడా తేలిపోనుంది..

షట్ డౌన్ ప్రభావం ఒక్కఐస్ క్రీమ్ తప్ప..అన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇప్పటికి బానే ఉన్నాయని కేపిఎంజీ సంస్థ తన నివేదికలో పొందుపరచగా..ప్రభుత్వం ఏవి నిత్యావసరాల జాబితాలో చేర్చాలో వాటితో ఓ ప్రాధాన్యక్రమాన్ని ప్రకటించాలని కోరింది..గోధుమ, వరి, పప్పు దినుసుల పంట కోత కాలం కావడంతో లాక్‌డౌన్ ప్రబావం పడుతుందని కేపిఎంజి తన నివేదికలో చెప్పినా..ప్రస్తుతం కేంద్రం రైతాంగానికి వ్యవసాయ ఆధార పరిశ్రమలకు ఊరటనివ్వడంతో ఆ ప్రతికూల ప్రభావం లేనట్లే భావించాలి.. ఫుడ్ ప్రాసెసింగ్..గ్రాసరీ వ్యాపారాల  నగదు లభ్యతకి కూడా ఆర్బీఐ ప్రకటించిన స్టిమ్యులస్ ప్యాకేజీ ఉపయోగపడుతుందని కేపిఎంజి భావించింది. ఇక పాలు, కూరగాయలు..పళ్లు, పౌల్ట్రీ, ఎగ్స్ చికెన్‌కి సంబంధించిన సప్లై చైన్‌‌కి అడ్డంకి ఏర్పడటమే ఈ రంగాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా కేపిఎంజి అంచనా వేసింది.. నిల్వ ఉండని కూరగాయల విషయంలో రవాణా సులభంగా సాగిపోయే విధానాలను అనుమతించాలని సూచించింది..అలానే సీజనల్ పళ్లైన మామిడి..సీ ఫుడ్‌ రవాణాతో పాటు ప్రధాన వ్యవసాయానికి లేబర్ కొరత లేకుండా చూడాల్సిందని అభిప్రాయపడింది. ఇందుకోసం ప్రతి రాష్ట్రం, జిల్లా యంత్రాంగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరింది. సీఫుడ్, మీట్, రైస్, టీ, సుగంధ ద్రవ్యాలను అమెరికా,ఐరోపా, చైనాకి మనవాళ్లు ఎక్కువగా  ఎగుమతి చేస్తుంటారు..ప్రస్తుతం ఇవి నిలిచిపోవడంతో భారీగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది..మరోవైపు దేశీయంగానూ వీటి వినియోగానికి  రవాణా లేకపోవడంతో డిమాండ్ పడిపోయింది
వాయిస్() ఆహార వ్యవసాయరంగంలోని  ఈ  సమస్యలను ఎదుర్కోవడానికి కేపిఎంజి సంస్థ ప్రధానంగా రవాణాకి ఉన్న అడ్డంకులు తొలగించాలని సూచించింది ఇందుకోసం జిఎస్టీ..ఫాస్టాగ్ పద్దతులను అమలు చేస్తూ..త్వరితగతిన ఉత్పత్తులు సరఫరా చేసేందుకు వీలు కల్పించాలి..ఫుడ్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్స్ నెలకొల్పాలి. ఆధార్ బేస్డ్ పాస్‌లు జారీ చేయాలని సూచించింది..ఇక ఈ రంగంలోని ఆర్ధికపరమైన సమస్యలకు ఖరీఫ్ సీజన్ వరకూ అగ్రి ఇన్‌పుట్స్‌ని ఉచితంగా రైతాంగానికి అందించాలి..ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు..ఎక్స్ పోర్టర్లకు ఇన్సెంటివ్స్ ప్రకటించాలి పోర్టుల వద్ద అగ్రి ఉత్పత్తుల హ్యాండ్లింగ్‌కి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది..ఇక ఈ రంగంలో ఆహార వ్యవసాయ ఉత్పత్తులు డెలివరీ చేసే వ్యక్తులకు హెల్త్ ఇన్సూరెన్స్, ఈపిఎప్ఓ విత్ డ్రాయల్ సౌకర్యం వర్తింపు , గ్రామాల్లోని నిరుద్యోగులను
ఈ రంగంలో తాత్కాలిక ఉద్యోగులుగా తీసుకోవడం చేయాలని సిఫార్సు చేసింది..అంతేకాదు..లేబర్ కొరత ఉన్న చోట్ల డ్రోన్లతో మందులు పిచికారీ చేసే అంశాన్ని పరిశీలించాలని కోరింది. ఈ మొత్తం వ్యవస్థని పటిష్టపరిచేందుకు దేశవ్యాప్తంగా నేషనల్ అగ్రికల్చరల్ లేబర్ ఫోర్స్ పేరిట రిజిస్టర్ నిర్వహించి..ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేస్తూ..ఆధార్ బేస్డ్ డైరక్ట్ మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలని కూడా కేపిఎంజి ప్రత్యేకంగా సిఫార్సు చేసింది..

Comments