భిల్వారా మోడల్ తప్పదు ఈ రాష్ట్రాల్లో...కరోనా పారిపోవాల్సిందే




లాక్‌డౌన్‌తో కష్టాలు పెరిగిపోతున్న సమయంలో...ఏదోక రోజు ఆంక్షలు సడలించకతప్పని పరిస్థితి..మరో వైపు
పెరిగిపోతోన్న కేసులు..అంతకంతకూ పెరిగిపోతోన్న భయం..ఈ సమయంలోనే కేంద్రం  నోటి వెంట భిల్వారా మోడల్ అనే మాట బైటకి వచ్చింది ఇంతకీ ..ఏంటీ   భిల్వారా మోడల్..

రాజస్థాన్‌లోని  జైపూర్ నుంచి 250 కిలోమీటర్ల దూరంలోని ఓ జిల్లా భిల్వారా..మార్చి 18 వరకూ ఇక్కడ ఒక్క కరోనా కేసు కూడా  నమోదు కాలేదు..కానీ మార్చి 19 నుంచి వరసగా..కేసులు పెరుగుతూ పోయాయ్...మార్చి 30నాటికి అలా కరోనా కేసుల సంఖ్య 27కి చేరింది.. అలా ఈ రాష్ట్రంలోనే ఎక్కువ వైరస్ బాధితులున్న రెండో ఏరియాగా భిల్వారా మారిపోయింది...ఐతే ఏం చేశారో ఏమో కానీ ఇక్కడ మార్చి 30 నుంచి ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదైంది..దీంతో ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుసుకునే ఆసక్తి  అందరిలో అధికమైపోయింది...మొదటగా ఇక్కడి ఓ ప్రవేట్ ఆస్పత్రిలోని డాక్టర్‌కి కరోనా సోకినట్లు మార్చి 19న తెలిసింది..ఆ తర్వాత తర్వాత కేసుల సంఖ్య పెరుగుతూ పోయి 27కి చేరింది..దీంతో వెంటనే భిల్వారా జిల్లా యంత్రాంగమంతా కదిలింది..వైరస్‌పై కసిగా...రూత్ లెస్ యుద్ధం ప్రారంభించింది..

ముందుగా భిల్వారాలో వైరస్ తీవ్రత ఉన్న క్లస్టర్లను గుర్తించారు..క్వారంటైన్ కఠినంగా అమలు చేసారు..ఇందుకోసం 3వేల బృందాలు డోర్ టూ డోర్ క్యాంపైన్ నిర్వహించాయ్..28లక్షలమంది ప్రజలను స్క్రీనింగ్ చేసి..ఇన్‌ఫ్లుయెంజా  లక్షణాలున్న వారిని హోమ్ క్వారంటైన్లలోనే ఉంచారు..అంటే 27 కేసులు బైటపడితే..28లక్షలమందిని స్క్రీనింగ్ చేశారన్నమాట.,6లక్షల15వేల కుటుంబాలను సర్వే చేయడమంటే మాటలు కాదు కదా...ఈ మూడువేల బృందాలు కూడా రోజూ ఇంటి దగ్గర శానిటైజ్ చేసుకోవడం...తిరిగి ఇంటికి వచ్చే ముందు శానిటైజర్లతో శుభ్రపరుచుకోవడం అంతా ఓ యజ్ఞంలా చేసారు..వారికి కూడా ఎప్పటికప్పుడు థర్మల్ స్క్రీనింగ్ చేసుకునేవారు..ప్రతి గంటకూ ఆరోగ్యస్థితి చెక్ చేసుకోవాల్సిందిగా టీమ్ లీడర్లనుంచి ఆదేశాలు వస్తుండేవి..ప్రతి ఒక్కరు ఇళ్ల నుంచి బయలుదేరేటప్పుడు ఇంట్లోవారికి వారు ఎలా తిరిగి వస్తారో అనే ఆందోళన ఉండేది..ప్రతి టీమ్ లో ఐదుగురు హెల్త్ సిబ్బంది..ఆ టీమ్ కి ఇద్దరు పోలీసులు..ఇలా ప్రతి బృందానికి ఓ లీడర్..ఇలా మొత్తం 3వేల బృందాలు రాత్రింబవళ్లూ తేడా లేకుడా శ్రమించి చివరికి వైరస్ ని కట్టడి చేయగలిగారు


మొదటి దశలో కర్ఫ్యూని ఖచ్చితంగా అమలు చేయడం...రెండోది కంటైన్‌మెంట్ జోన్లని సీల్ చేయడం..ఆ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు  భిల్వారా యంత్రాంగం రెండోదశలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న క్లస్టర్లను గుర్తించి..వైరస్ బాధితుల కాంటాక్ట్స్‌ని జాడ తీశారు..వారిలో హై రిస్క్ గ్రూప్ ఉన్న వ్యక్తులను  ఐసోలేటే చేసారు..వారి శాంపిల్స్ త్వరగా టెస్టులకు పంపించి ఫలితాలు తెలుసుకోగలిగారు..మూడో దశలో మొత్తం ప్రజలకు స్క్రీనింగ్ చేయడం ద్వారా ఫ్లూ లక్షణాలు ఉన్నవారిని గుర్తించామని రాజస్తాన్ హెల్త్ సెక్రటరీ  రోహిత్ కుమార్ సింగ్ ప్రకటించారు..అలా ఈ మూడు దశలను విజయవంతంగా పూర్తి చేశారు కాబట్టే..ఇప్పుడు భిల్వారాలో కరోనా వైరస్ కట్టడి కాగలగింది. మొత్తం 27మంది పేషెంట్లలో 17మందికి వైరస్ నయమైంది.13మంది డిశ్చార్జ్ అయ్యారు కూడా..ఐతే ఈ కేసులలో మొదటగా కేసు బయటపడిన ప్రవేట్ హాస్పటల్ నుంచే 17మంది వైద్యసిబ్బందికి కూడా కరోనా సోకడంతో ఆ హాస్పటల్‌ని సీజ్ చేసారు..ఇక జిల్లాల్లోని హోటల్స్  అన్నింటినీ ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది
 హోటల్స్ కూడా క్వారంటైన్ కేంద్రాలుగా మార్చేసారు..అలా 1541 రూమ్స్‌లో దాదాపు వెయ్యిమంది గత వారం వరకూ క్వారంటైన్‌లో గడిపి డిశ్చార్జ్ అయ్యారు..ఇంకా మరో 730మంది ఈ హోటల్ క్వారంటైన్‌లో గడుపుతున్నారు.. జిల్లాలో మొత్తానికి మొత్తం అన్నీ బంద్ చేసిన యంత్రాంగం..కూరగాయలు..రేషన్ సహా నిత్యావసరాలన్నీ డోర్ డెలివరీ చేసింది. ఏ ఒక్క మనిషి కూడా బైటికి రావడానికి వీలు లేకుండా చేసింది

Comments