లాక్‌డౌన్‌తో టెక్స్‌టైల్ అప్పెరల్స్ విభాగానికి గడ్డు కాలమే..

 భారత్ జిడిపిలో 2శాతం వాటా కలిగిన టెక్స్‌టైల్ అండ్ అప్పారెల్  రంగం నుంచి కరోనా ప్రభావంతో ఎగుమతులు తీవ్రంగా దెబ్బతింటాయని కేపిఎంజి సంస్థ అంచనా వేసింది..భారత్ నుంచి అమెరికా, యూకే, కెనడా,రష్యా, యూఏఈ, ఇటలీకి ఎగుమతులు జరుగుతుండగా..కాటన్ ముడి సరుకు బంగ్లాదేశ్, చైనా, కాంబోడియాకి ఎగుమతి అవుతున్నాయ్. లాక్‌డౌన్‌తో పాటు అంతర్జాతీయంగా సరిహద్దులు మూసివేయడంతో..ఈ దేశాలకు ఉత్పత్తులు ఎగుమతులు నిలిచిపోయాయ్...మరోవైపు ఈ రంగంలోని ముడి సరుకు కోసం భారత్
బంగ్లాదేశ్, చైనా‌పైనే ఆధారపడింది..

అంటే టెక్స్‌టైల్ రంగానికి కావాల్సిన ఎక్స్‌పోర్స్ అండ్ ఇంపోర్ట్స్ రెండూ తాత్కాలికంగా ఇప్పుడు రద్దైనట్లే  ఈ ప్రభావంతో ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో దేశీ టెక్స్‌టైల్స్, అపారెల్‌ రంగ ఉత్పత్తి 10-12 శాతం నష్టపోవడం ఖాయంగా తెలుస్తోంది..అలానే మరి కొన్ని త్రైమాసికాలు టెక్స్‌టైల్‌ ఎగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది తయారీ రంగ కోణంలో చూస్తే దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్‌ పడిపోవడంతో చాలామంది ఉపాధి కోల్పోతారని అంచనా..

టెక్స్ టైల్ అప్పారెల్ రంగంలో దాదాపు నాలుగున్నర కోట్లమంది ఉపాది పొందుతున్నారు...దీంతో వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి.  చిన్న, మధ్య తరహా సంస్థల్లో ఉద్యోగుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారొచ్చు. లాక్‌డౌన్‌ నాలుగు వారాలు మించి కనుక కొనసాగితే ఏడున్నరకోట్ల చిన్న మధ్యతరహా సంస్థలలో 25శాతం మూతబడొచ్చని కేపిఎంజి అంచనా వేసింది..అదే లాక్ డౌన్ కనుక ఎనిమిది వారాల పైగా  కొనసాగితే ఏకంగా 43 శాతం సంస్థలు మూతపడే అవకాశం ఉందని అఖిల భారత తయారీ సంస్థల సంఘం ఈ మధ్యనే అంచనా వేసింది..
ఇందుకోసం పన్నుల సరళీకరణతో పాటు టెక్స్‌టైల్ రంగంలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభాన్ని భారాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని కోరింది. ఎంఎస్ఎంఈలకు రుణాలు ఇచ్చే పద్దతిని కూడా మరింత సరళీకృతం చేయాలని కేపిఎంజి సూచించింది..అలానే అమెరికా, జర్మనీలో ఈ రంగంలో ఎలాంటి ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించారో అలాంటి ప్యాకేజీ సపోర్ట్ అవసరమని కేపిఎంజీ సంస్థ అభిప్రాయపడింది..

Comments