బంకర్లో దాక్కుంటే కరోనా వదులుద్దా...ఐతే ఇవీ మరీ కాస్ట్లీ బంకర్లు లెండి



ప్రపంచమంతా కరోనా భయంతో వణుకుతుంటే, అది తమ దాకా రాకుండా ఉండేందుకు అమెరికన్ నియో రిచ్ ఫ్యామిలీలో ఏకంగా బంకర్లలోకి వెళ్లిపోతున్నారు. అది కూడా ఇతర దేశాలకు పారిపోయి మరీ...అమెరికాలోని హై ఎండ్ పర్సనాలిటీలు చాలామంది ఇలా బంకర్ల బాట పట్టారట. అమెరికాలో వైరస్ కేసులు..మరణాలు భారీగా పెరిగిపోవడంతో అమెరికాలోని బాగా డబ్బున్నోళ్లంతా ఇలా వలసబాట పట్టారని తెలుస్తోంది..మన పల్లెల్లో ఎలాగైతే..పొలాల్లోకి వెళ్లి టెంట్లు వేసుకుంటున్నారో..కరోనానుంచి కాపాడుకోవడానికి అమెరికన్లు..ఇలా బంకర్లను ఆశ్రయిస్తున్నారు

న్యూజిలాండ్‌లో బంకర్ల తయారీలోనే  ఉన్న రైజింగ్ ఎస్ అనే కంపెనీ..రీసెంట్‌గా పది బంకర్లు నిర్మించిందట..ఒక్కో బంకర్ నిర్మాణానికి 3 మిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది..ఇక వీటిలో లగ్జరీ బాత్రూమ్స్ గేమ్ రూమ్, షూటింగ్ రేంజ్ ఫెసిలిటీ, జిమ్స్ థియేటర్లు..సర్జికల్ బెడ్లు కూడా కనుక కడితే..అప్పుడు ఖర్చు ఇంకా వాచిపోయి 8 మిలియన్ డాలర్ల వరకూ చేరుతుందని అంటున్నారు.. కరోనా కంటే ఇవేం ఎక్కువ కాదంటూ చాలామంది సిలికాన్ వేలీ సెలబ్రెటీలు ఏకంగా న్యూజిలాండ్‌కే పయనమవుతున్నారు..ఇలా మార్చి 12 నుంచే అమెరికా నుంచి వలసలు ప్రారంభమయ్యాయ్.. ఇప్పుడు కనుక బయటపడకపోతే..ఇక ఎప్పటికీ అమెరికా నుంచి బైటికి వెళ్లలేమనేది వారి భయం..దానికి తగ్గట్లే అప్పట్నుంచే అమెరికాలోని న్యూజెర్సీ, న్యూయార్క్, సహా అనేక రాష్ట్రాల్లో మరణ మృదంగం ప్రారంభమైంది..
చాలామంది ఇలా అమెరికా నుంచి బంకర్ల కోసం కివీస్‌కి వెళ్తున్నప్పుడు తమ ఫర్నిచర్..ఇతర స్థిరఆస్తులు అన్నీ స్నేహితులకు అప్పగించేసి న్యూజిలాండ్‌కి జంప్ అవుతున్నారు..సిలికాన్ వేలీలోని వెంచర్ కేపిటలిస్టులు చాలామంది ఇలానే వెళ్దామనుకున్నా...సరిహద్దులు మూసేయడంతో..వెళ్లలేకపోయినందుకు బాధపడుతున్నారట
కొంతమందైతే చావు భయంతో శాశ్వతంగా అమెరికా వదిలేసి న్యూజిలాండ్‌లోనే సెటిల్ అవుదామనే ప్రయత్నాలు మొదలెట్టారు..ఇక్కడే భారీగా ఇన్వెస్ట్ చేస్తే..పర్మినెంట్ రెసిడెంట్ హోదా పొందవచ్చా అనే ఎంక్వైరీలు కూడా ప్రారంభమయ్యాయంటే పరిస్తితిని ఊహించుకోవచ్చు..

Comments