మంచినీళ్ల కోసం అలమటిస్తున్నా...నన్నిక్కడ్నుంచి తీసుకుపోండి..అంటూనే ప్రాణాలు విడిచాడు


ఒక్క సిప్ కూడా లేదు..మంచినీళ్ల కోసం అలమటిస్తున్నా...నన్నిక్కడ్నుంచి తీసుకుపోండి...
ఈ మాటలే అంటూ ఓ వ్యక్తి కరోనాతో చనిపోయాడు..ఈ దృశ్యాలు రాబోయే రోజుల్లో ముంబైలో ఇంకా ఎక్కువ అవుతాయనే భయం పెరిగిపోతుంది . ప్రదీప్ మాలి అనే ఓ పాతికేళ్ల వ్యక్తికి ఏప్రిల్ 14న జలుబు దగ్గు రావడంతో ఆస్పత్రిలో చేర్చారు..

కస్తూర్బా ఆస్పత్రి అది..ఇక్కడి సూపర్నెంటే ముంబైలో వచ్చే ఆరునెలల్లో సరిగా
కరోనాని కంట్రోల్ చేయకపోతే 12కోట్లకి మందికి సోకినా సోకుతుందంటూ లెక్చర్లు ఇచ్చేవాడు..ఇప్పుడా ఆస్పత్రిలోనే ప్రదీప్ మాలి జాయినైన రెండు రోజులకు తనని వేరే ఆస్పత్రికి షిప్ట్ చేయమని పదే పదే కుటుంబసభ్యులకు కాల్ చేశాడట..ఐతే ఇతనికి పాజిటివ్ రావడంతో మిగిలిన కుటుంబసభ్యులను కూడా
క్వారంటైన్ చేయడంతో..వాళ్లూ ఏం చేయలేకపోయారు..చనిపోయే రోజుకు ముందు రోజంతా కస్తూర్బా ఆస్పత్రి సిబ్బంది ఏమీ  ఇవ్వలేదట..

అదే విషయం ఫోన్లో తన బ్రదర్‌కి చెప్తే..పదే పదే ల్యాండ్‌లైన్ కి చేయడంతో...ఓ వాటర్ బాటిల్ తాగించారట..అలానే ఆక్సిజన్ మాస్క్ కూడా ఫోన్ చేస్తేనే పెట్టారట..ఐతే ఆస్పత్రి వాళ్లు మాత్రం ఆక్సిజన్‌ని మీవాడే పీకేస్తున్నాడని చెప్పారుట..ఇన్ని..అటల మధ్య ప్రదీప్ మాలి చనిపోయాడు...అతని వయసు పాతికేళ్లు మాత్రమే...ఏడాదిన్నర బాబు..ఇప్పుడు ఆ కుటుంబం..విషాదం వర్ణించలేం...మిగిలిన కుటుంబసభ్యుల్లో ప్రదీప్ తల్లికి కూడా కరోనా సోకింది.. ఇంక రాయడానికేం లేదు...

మరి ఆస్పత్రి నిర్లక్ష్యం చేసిందా...లేక..మరణం దగ్గరపడి..అతనే అలా బిహేవ్ చేశాడా...ఏదైనా సరే..కరోనా క్రూరత్వానికి ఇదో ఉదాహరణ...పేషెంట్లు పెరిగిపోతే ఇక ఇలాంటి కథలే ఎన్ని వినాలో మరి..అందుకే ఇళ్లలోనే ఉండండ్రా సామీ

Comments