రవాణా ఆగకూడదు..సరుకులు సరఫరా అవ్వాలి


దేశంలోని కోట్లాదిమందికి ఆహారాన్ని వస్తువులు, ఇతర సరుకు రవాణా చేస్తూ....కీలక పాత్ర పోషిస్తోన్న రంగం రవాణా..లాక్‌డౌన్‌ తర్వాత ఏవియేషన్ రంగం ఎలా నిలబడిపోయిందో..ట్రాన్స్‌పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ సెక్టార్ కూడా తక్షణం ప్రభావానికి లోనైంది..ఒక్క నిత్యావాసరాలు అత్యవసర రవాణా తప్ప ఇంకేదీ ఇప్పుడు రోడ్డెక్కడం లేదు
 భారతదేశ జిడిపిలో 14శాతం వాటా కలిగిన ట్రాన్స్‌పోర్ట్ రంగంలో 82లక్షల70వేలమంది ఉపాధి పొందుతున్నట్లు అంచనా

ప్రభుత్వం ఈ రంగంపై గత బడ్జెట్ ప్రకారం 1,70,000కోట్లు కేటాయించింది..215 బిలియన్ డాలర్ల మేర వ్యాపారం జరుగుతున్న ఈ రంగం ఇప్పుడు కరోనా కారణంతో విధించిన లాక్‌డౌన్‌తో స్తంభించిపోయింది... రా మెటీరియల్ రవాణా నిలిచిపోవడంతో షార్ట్ టర్మ్‌లో మెటీరియల్ ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయ్. అలానే చేపట్టిన ప్రాజెక్టులు..ఈ రంగంపైనే ఆదారపడిన ఇతర రంగాల్లోని ప్రాజెక్టులు ఆలస్యం జరుగుతోందని ఫైనాన్షియల్ సర్వీస్ సంస్థ కేపిఎంజి నివేదిక ద్వారా తెలుస్తోంది..ఇక సప్లై వైపునుంచి చూస్తే..ఫ్యూయెల్ ధర తగ్గింపుతో ఆ ప్రభావం లాజిస్టిక్స్, ట్రాన్స్‌పోర్ట్ రంగంపై సానుకూలంగానే ఉండొచ్చు..అలానే..ఇతర రంగాల్లాగా లేబర్ సమస్య అనేది ఇక్కడ ఉత్పన్నం కాదని.. కేపిఎంజి సంస్థ అంచనా వేసింది...

క్యాష్ ఫ్లో సమస్యలు డెట్ సర్వీసులపై బాగా ఉంటుందని తెలిపింది..
రవాణా రంగం స్తంభించడంతో..కొ్ద్ది రోజులపాటు కృత్రిమంగా డిమాండ్ తగ్గిందని..ఇది ఆంక్షలు ఎత్తివేస్తే సాధారణ స్తితికి చేరుకోవచ్చని కూడా కేపిఎంజి చెప్తోంది లాజిస్టిక్ ఫ్రైట్ సర్వీస్ సెక్టార్లలో ఆర్ధికపరమైన నగదు లభ్యత, క్యాష్ ఫ్లోలో మాత్రం నిర్వహణపరంగా పెద్ద ఎత్తునే చిక్కులు ఎదురు కావచ్చని, కార్గో పరిమాణం,వ్యాపారం, రోజువారీ సేవలపై భారీసమస్యలను ఎదుర్కొనబోతున్నట్లు అంచనా వేసింది..ఆదాయపరంగా కూడా గడ్డు స్థితిని ఎదుర్కొంటున్నట్లు సూచించిన కేపిఎంజి..ఈ రంగంలో సమస్యల కోసం . ట్యాక్స్ రిలాక్సేషన్స్  ..డిజిటల్ కంప్లయెన్స్‌ పద్దతులను అమలు చేయాలని సూచించింది

ఆర్ధికపరమైన ఒత్తిడిని తగ్గించేందుకు బ్యాంకుల ద్వారా వర్కింగ్ కేపిటల్, లోన్ రీపేమెంట్లలో సపోర్ట్ కల్పించాలని..వడ్డీ మినహాయింపులతో పాటు చెల్లింపులపై మారటోరియం పొడిగించాలని సిఫార్సు చేసింది కేపిఎంజి..ట్రాన్స్ పోర్ట్ రంగంలో పని చేసేవారికి డైరక్ట్ బెనిఫిటీ  ట్రాన్స్‌ఫర్ సౌకర్యంతో పాటు అన్నిరకాల రవాణా సాధనాల్లో టిక్కెట్ల క్యాన్సిలేషన్ తర్వాత తిరిగి బుక్ చేసుకునే విధానాన్ని దేశమంతటా ప్రవేశపెట్టాలని కేపిఎంజి
తన నివేదికలో సూచించింది

Comments