పైన పటారం లోన లొటారం బ్యాంకులకి బ్యాడ్ టైమ్


కొండంత ఎన్పిఏలతో  అల్లాడుతున్న బ్యాంకులకు కరోనా మరో పెద్ద పిడుగు వేసింది..ఐతే పెద్ద బ్యాంకులు ఈ సంక్షోభాన్ని తట్టుకోవడానికి ప్యాకేజీలు సాయపడుతున్నా..భవిష్యత్తులో వీక్‌గా ఉన్న బ్యాంకులకు మాత్రం గడ్డుకాలంగానే కన్పిస్తోంది..సమస్యలను సరిగా గుర్తించకపోతే పెద్ద ఎత్తున రుణ ఎగవేతలు చోటు చేసుకోవచ్చని కేపిఎంజి హెచ్చరించింది

కోవిడ్ 19 మహమ్మారి ప్రభావం ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్‌పై భారీగానే పడనుందనే అంచనాలు ఉన్నాయ్. దీంతో బ్యాంకులు ఇచ్చే రుణ వ్యయ నిష్పత్తి , మొండిబకాయిలు భారీగా పెరిగిపోయే ప్రమాదాలు కన్పిస్తున్నాయ్...జనవరి నెలాఖరు వరకూ చూస్తే..నాన్ ఫుడ్ క్రెడిట్ రూపంలో 101 లక్షల కోట్లు పంపిణీ జరిగినట్లు తెలుస్తోంది.. ఇందులో వ్యవసాయ అక్కౌంట్లలో 13శాతం, ఇండస్ట్రీ 31.7శాతం, సేవా విభాగంలో 27.3శాతం వాటాకాగా...మొత్తంగా బ్యాంకింగ్ రగంలోని డిపాజిట్లు..132.1లక్షలకోట్ల రూపాయలు...మొత్తంగా బ్యాంకింగ్ రంగంలో 2019
సెప్టంబర్ నాటికి 9.3శాతం కాగా...నెట్ ఎన్‌పిఏలు 3.7శాతంగా తేల్చారు.

 కరోనా ప్రభావంతో..బ్యాంకుల లాభదాయకత దెబ్బతింటుందని ఫైనాన్షియల్ సేవల సంస్థ కేపిఎంజి అంచనా వేసింది..ఎప్పుడేమవుతుందో తెలీని పరిస్థితుల్లో లోన్లు తీసుకోవడానికి కస్టమర్లు ముందుకు రాకపోవడం మారటోరియం పీరియడ్ తర్వాత చోటు చేసుకునే చిన్న చిన్న ఎగవేతలు..సరిహద్దుల మూసివేతలతో నిలిచిపోయే ట్రాన్సాక్షన్స్, ధనసంబంధిత లావాదేవీల నిలిచిపోవడం ఇందుకు కారణాలుగా కేపిఎంజి లెక్క గట్టింది..ఐతే షార్ట్ టర్మ్‌లో మాత్రం జనం పొదుపుకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉండటంతో లిక్విడిటీ ఇబ్బందులు ఉండవని అంచనా వేసింది. షట్ డౌన్ కారణంగా..పైనాన్షియల్ ఎస్సెట్స్, హౌసింగ్ అసెట్స్‌ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌లో పెట్టుబడులు..కొనుగోళ్లు ఉండవు కాబట్టి..రానున్న రెండు మూడు త్రైమాసికాలు రిటైల్ పైనాన్సింగ్ రంగం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుందని హెచ్చరించింది. .నియంత్రణ యంత్రాంగం కనుక అప్రమత్తంగా లేకపోతే  డిఫాల్టర్లు..దివాలాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉందని సూచించింది..అందుకే తక్షణం కార్పోరేట్ సెక్టార్‌లోని సమస్యలను పరిష్కరించాలని సలహా ఇచ్చింది

 ఐతే ప్రస్తుతానికి ఆర్బీఐ గత నెలలో ప్రకటించిన నిర్ణయాలతో ఫైనాన్షియల్ సంస్థలు బ్యాంకులు కాస్త కుదుటపడవచ్చనే అభిప్రాయాన్ని వెల్లిబుచ్చిన కేపిఎంజి.. బలహీనమైన ప్రవేట్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు మాత్రం రాబోతుందంతా గడ్డు కాలంగానే
హెచ్చరించింది..  మారటోరియం ఎత్తివేశాక రెండు, మూడో  త్రైమాసికాల్లో మొండిపద్దులు పెరిగే పక్షంలో బ్యాంకులపై భారం పెరగవచ్చు. అలానే ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్యాకేజీలేమీ ఇప్పటివరకూ లేకపోవడంతో ఏవియేషన్, ఆటోమొబైల్,  నిర్మాణ తదితర రంగాల సంస్థలు రుణాల చెల్లింపుల్లో సమస్యలు ఎదుర్కోవచ్చు. ఆ ప్రభావం బ్యాంకింగ్ వ్యవస్థపైనే పడే అవకాశం కన్పిస్తోంది.. రిటైల్‌ రుణాల విషయానికొస్తే అందుబాటు ధరల్లోని గృహనిర్మాణాలు..టూవీలర్ , మైక్రో ఫైనాన్స్ రుణాలపై నెగటివ్ ఎఫెక్ట్ పడే సూచనలు ఉన్నాయ్..జూన్ క్వార్టర్ నుంచే ఈ ప్రభావం కన్పించవచ్చని కేపిఎంజీ అంచనా వేసింది..ఏవైనా ఎగవేతలు చోటు చేసుకుంటే అది జూన్ త్రైమాసికంలో స్పష్టంగా ప్రతిబింబిస్తుందంది..ఈ సమస్యలను పరిష్కరించేందుకు వన్ టైమ్ రీస్ట్రక్చరింగ్ విండోల ఏర్పాటు
కోవిడ్ 19 క్రెడిట్ గ్యారంటీ స్కీములు బ్యాంకులకు..ఎన్‌బిఎఫ్‌సిలకు వర్తింపజేయాలని కోరింది. అలానే మొండిబకాయిలు పెరిగిపోయిన బ్యాంకులపై విధించే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్‌కి ఉన్న ఏడాది గడువు అమలును సడలించాలని సూచించింది.

Comments