అవి ఎగిరే పళ్లేలేనా..వచ్చింది ఏలియన్సేనా..!


అమెరికన్ యుద్ధ విమానాలను గ్రహాంతరవాసులు వెంటాడారా..? యూఎస్ విమానాలను యూఎఫ్ఓ వెంటాడటం నిజమేనా...? .అమెరికా పెంటగన్ డిపార్ట్‌మెంట్ రిలీజ్ చేసిన వీడియోలే ఇప్పుడీ చర్చకు దారి తీసాయ్
చడీ చప్పుడూ లేకుండా  పెంటగన్ వర్గాలు పనిగట్టుకుని మరీ అధికారికంగా మూడు వీడియాలో విడుదల చేశాయ్

ఇవేం కొత్త వీడియోలు కాదు..దాదాపు పదమూడేళ్ల నుంచి ఇలా నెట్‌లో చక్కర్లు కొడుతున్నవే..ఐతే వీటి గురించి సోషల్ మీడియాతో పాటు అమెరికన్ సిటిజెన్స్ రకరకాల ఊహాగానాలు చేయడమే తప్ప..ఎప్పుడూ అమెరికా ప్రభుత్వం ఓపెన్‌గా మాట్లాడింది లేదు..
ఏలియన్స్‌పై 80ఏళ్లుగా శాస్త్రలోకంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయ్..ఓ రకంగా దేవుడున్నాడా లేడా అనేది ఎలాగైతే అంతుచిక్కని ప్రశ్నో..గ్రహాంతరవాసుల ఉనికి కూడా అలానే తయారైంది..యూఎఫ్ఓల గురించి ప్రచారం కూడా అదే స్థాయిలో జరుగుతుంటుంది..అమెరికాలాంటి వెస్ట్రన్ కంట్రీస్‌లో ఇది మరీ ఎక్కువ..ఐతే తొలిసారిగా అమెరికన్ ప్రభుత్వ శాఖే ఇలాంటి వీడియో అధికారికంగా విడుదల చేయడమే కలకలం రేపుతోంది...గ్రహాంతరవాసులను కనుక్కున్నట్లు తెలపడమే దీని వెనుక ఉన్న ఉద్దేశమా...లేక ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అయ్యే వీడియోల క్రెడిబులిటీపై క్లారిటీ కోసం ఒరిజినల్ ఫుటేజ్ రిలీజ్ చేసిందా అన్నది మాత్రం తెలీదు..యూఎస్ విమానాలను వెంటాడిన వస్తువులు ఏంటి ఎక్కడ నుంచి వచ్చాయ్..?  మళ్లీ ఎటు మాయం అయ్యాయ్..?
ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలని సెనేటర్ హ్యారీ రీడ్ డిమాండ్ చేశారు..దీంతో పెంటగన్ రిలీజ్ చేసిన వీడియోలపై అమెరికా సెనేటర్ హ్యారీ రీడ్ స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది..ఈ వీడియోల విడుదల అసలు రహస్యాన్ని పైపైన తడమటమే అని..ఇంకా లోతుగా దర్యాప్తు జరగాలని ట్వీట్ చేసారాయన..అమెరికా సైన్యం భద్రతకి సంబంధించిన కోణంలో ఇంకా ఎంక్వైరీ చేయాలని..ఆ వివరాలు కూడా అమెరికన్ పౌరులకు తెలియాలన్నారు

ఇదే సమయంలో పెంటగన్ స్పందన మాత్రం గందరగోళంగా ఉంది.. సర్క్యులేట్ అవుతున్న వీడియోలు నిజం కానీ కాకపోనీ..ప్రజలు తప్పుడు అర్ధాలు వెతుక్కోకూడదనే.అసలు ఫుటేజ్ పబ్లిష్ చేసినట్లు ప్రకటించింది..వీడియోల్లో కన్పించినదాన్ని మించి ఉండొచ్చు లేకపోవచ్చంటూ కన్ఫ్యూజ్ చేసింది..
ఐతే నెవడా సిటీలో ఏరియా 51 మిలిటరీ టెస్టింగ్ గ్రౌండ్స్‌లో ఏలియన్స్‌పై రీసెర్చ్ జరుగుతున్నట్లు ఎప్పట్నుంచో ప్రచారం సాగుతుంది..
అసలు గ్రహాంతరవాసులనే కాన్సెప్టే ఇప్పటిది కాదు..కోటానుకోట్ల కాంతి సంవత్సరాల దూరం నుంచి అర్థం కాని కొన్ని సిగ్నల్స్  శాస్త్రవేత్తలకు జిజ్ఞాస పెంచుతుంటాయ్..సవాళ్లు విసురుతుంటాయ్..ఒక్క భూవాతావరణంపైనే కాదు..ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చేరువలో కూడా కొన్ని అంతు చిక్కని ఆకారాలు తిరిగాయని ప్రచారం ఉంది..ఐతే ఆ తర్వాత అవి ఏవో స్పేస్‌షిప్స్‌గానో..మేఘాలుగానే కొట్టిపారేయడం కూడా జరుగుతుంటుంది
 ఐతే ఇక్కడ అన్నిటికంటే వింత విషయం..ఈ యూఎఫ్ ఓలు..అమెరికా వాళ్లకే కన్పిస్తాయా..అంటే ఏలియన్స్ ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడతారా...? మన  తెలుగు కానీ..హిందీకానీ రాదా..జోక్‌గా అన్పించినా...బుద్దీజీవులనే గ్రహాంతరవాసులకు మరి మన భాష రాకపోవడం విచిత్రమే



Comments

  1. शुभ दोपहर, आप कैसे हैं? मैं ब्राज़ील का हूँ और अपने ब्लॉग के लिए नए अनुयायियों की तलाश कर रहा हूँ। मैं भी आपका अनुसरण कर सकता हूं।
    https://viagenspelobrasilerio.blogspot.com/?m=1

    अगर आप मुझे फॉलो करते हैं तो आप मेरे ब्लॉग का लिंक भेज सकते हैं और मैं आपको फॉलो करूंगा।

    ReplyDelete

Post a Comment