టిడిపి గేమ్‌లో అనస్థీషియన్ సుధాకర్ బలి..సిబిఐ ఎంక్వైరీ ఎప్పటికి పూర్తవ్వాలి..?


ఓ అనస్థీషియన్ సస్పెన్షన్ వ్యవహారంపై ఎంక్వైరీకి సిబిఐని ఆదేశించడంలోని అర్ధం, పరమార్థం..ఏంటో...అసలు ఈ గేమ్ ఎక్కడ్నుంచి ఎక్కడకు పోతుందో ఏమైనా తెలుస్తుందా..ఓ వైపు టిడిపి దీన్ని ఆహ్వానిస్తుందట..వాళ్లే తీర్పుకి ముందే వైఎస్సార్సీపీ వాళ్లు అతనితో రాయబారాలకు వచ్చారంటారు..మరోవైపు అతని ఉద్యోగాన్ని అతన్ని చేసుకోనివ్వండి అంటారు..తీరా కోర్టుకి సదరు పంగలపూడి అనిత రాసిన లేఖతోనే. న్యాయస్థానం ఎంక్వైరీ చేసిందని చెప్తారు..అంటే దీనిపై రగడ ఎన్నాళ్లు సాగితే అంత తమకి మంచి చేకూరుతుందని టిడిపి దింపుడు కళ్లెం ఆశ..

అంధజోతిలో రెచ్చిపోయి డిబేట్లు పెట్టినంత మాత్రాన ఎవరి కేశాలు రాలిపడేది లేదు కదా...పైగా ఈ తీర్పులతో అర్జంట్‌గా మన అధినేతకి కుర్చీ దక్కేదీ లేదూ( అబ్బ...కనీసం అలాంటి రూలేదో తెస్తే బావుండనే ఆలోచన..ఆశ కూడా వీరి డిబేట్లలో చర్చించగల సమర్ధులు వీరు).. ఇంతా చేసి నా  ఎనిమిదేళ్ల సర్వీస్ ఉంది దాన్ని నేను చేసుకుంటా అనే సదరు సుధాకరుడి గోల ఎవరికీ  పట్టలేదు..అంటే ఈ సిబిఐ ఎంక్వైరీ  ఎప్పటికి ముగుస్తుంది..అప్పటిదాకా అతని ఉద్యోగం లేనట్లేనా..

కోర్టు 8వారాల్లోపు ఎంక్వైరీ పూర్తి చేయండని చెప్తుంది కానీ..సిబిఐ ఎంక్వైరీ అంత తొందరగా తెములుతుందా..పైగా కరోనా కాలంలో మరీ మందకొడి కాదా...ఏదో జగన్మోహన్ రెడ్డిని ఇరుకున బెట్టామనే ఓవరాక్షన్ తప్ప ఈ మైండ్ గేమ్..బ్లేమ్‌గేమ్‌లో ట్వీట్లు చేసే మహారాజులు..వారి పుత్రరత్నాలు సేఫే...కానీ బలి అయిందెవరో క్లియర్‌గా కన్పిస్తుంది కదా...

Comments