నారా లోకేశ్ గారూ ఇది చూడండి శానిటైజర్ తాగారట...

ఏపీలో జే ట్యాక్స్ కోసమే..మద్యం అమ్ముతున్నారుట...ప్రపంచమంతా..మందు బంద్ చేస్తే..ఆంధ్రప్రదేశ్ లో మాత్రం
బతిమాలో..బలవంతపెట్టో..దాడి చేసో...మందు అంటకడుతున్నట్లుగా టిడిపి భావిస్తుంది..మేం తాగం బాబూ అన్నాసరే..వెంటబడి మరీ అమ్మేసి సర్కారు సొమ్ము చేసుకుంటున్నట్లే నారా లోకేశ్ గారి ట్వీట్లు ఉంటాయ్..
ఇక కరోనా విషయంలోనైతే మరీ...ఒక్క పది రూపాయలు కూడా కరోనా పేషెంట్లకు ప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదట..

కరోనా పేషెంట్లు భారీగా ఉన్నారు ఏపీలో...అవును..రేపో మాపో దేశంలోనే నంబర్ వన్ కూడా కావచ్చు..అంతమాత్రాన అదంతా వైఎస్సార్సీపీ బాధ్యతా..డెంగూ...మలేరియా..స్వైన్ ఫ్లూ కంటే వేగంగా ఒకరి నుంచి ఒకరికి సోకే వైరస్..కరోనా...ఇది ఎంత కట్టడి చేసినా..అవదు..దాన్నో జ్వరంగా చూడాలి..లేదంటే సామాజిక నేరాలకు  ఆస్కారం  ఇచ్చినట్లే..కొడుకు చచ్చిపోతే తండ్రి దగ్గరకి పోడు..ముసలి తల్లికి సోకితే..కొడుకులు ఆదరించరు..ఇది పోవాలంటే దాన్ని తక్కువగానే చూడాలి...జాగ్రత్తలు తీసుకోవాలి..అంతేకానీ..తేలికగా తీసుకోవడం వల్లనే  అందరికీ వస్తుందనే రొటీన్ డైలాగ్స్ వద్దు..ఇళ్ల యజమానులు బైటికి నెడుతుంటే..టిడిపి ఏం చేసింది..వైఎస్సార్సీపీ ఏం చేస్తుంది..అందుకే బాబూ కరోనా వైరస్ ని అంటురోగంగా..చూడాలే తప్ప...సామాజిక ద్రోహంగా చూడొద్దు...

మద్యం దుకాణాల్లో మందు అమ్మొద్దంటూ నారా లోకేశ్ గారు చక్కగా సెలవిచ్చారు..పోనీ ఇలా ఎన్నాళ్లు చేద్దామంటారో కూడా చెప్పాలి...ఇదిగో ఇలాటి టైమ్ లో మందు దొరక్క..ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగేసి 9మంది చచ్చారట..మరి దీన్ని కూడా ఎలా రూపుమాపాలో టిడిపి కానీ..ఇతర మేధావులు కానీ చెప్పాలి...మందు అమ్మాలా...లేక అందరికీ అందుబాటు ధరల్లోకి(టిడిపి వాదన) తీసుకురావాలా...లేక..ఎవరికి వారే మానుకోవాలా...?

Comments