కపిల్ సిబల్ తగ్గడం లేదు..కంటిన్యూ చేస్తున్నాడు


రోజులు గడిచే కొద్దీ కపిల్ సిబల్ తగ్గడం లేదు..సరికదా తన దాడి ఇంకాస్త పెంచుతున్నారు..కాంగ్రెస్ హైకమాండ్ పై తన ప్రెజర్ ఎక్కు వ చేస్తున్నారు.. మొన్న లేఖాస్త్రం  నిన్న..దేశం కోసమంటూ ట్వీట్
ఇప్పుడు మాపై సర్జికల్ స్ట్రైక్స్ వద్దంటూ మరో ట్వీట్ ఇంతకీ కపిల్ సిబల్ రూట్ ఎటువైపు
కాంగ్రెస్‌లో ఆయన పయనం ఎలా సాగబోతోంది..ఇదే సందేహాలు ఇప్పుడు కలుగుతున్నాయ్...కాంగ్రెస్‌ సీనియర్లు కొంతమంది  మేడమ్ సోనియాగాంధీకి లేఖాస్త్రం సంధించడంపై సిడబ్ల్యూసీలో జరిగిన రచ్చ ఇంకా కంటిన్యూ అవుతున్నట్లుంది.. సీనియర్లంతా కూడా కేవలం పార్టీలో మార్పుల గురించే లేఖ రాసాం తప్ప..ఇంకోటి కాదంటూ సైలెంటైపోయారు..వీరప్పమెయిలీ లాంటి వాళ్లు మాత్రం తమ ఆక్రోశం స్థాయి పెంచారే తప్ప..అధిష్టానానికి వ్యతిరేకం కాదంటూ చెప్పుకొచ్చారు



 ఐతే కపిల్ సిబల్ మాత్రం తన ఇన్‌డైరక్ట్ అటాక్ కొనసాగిస్తూనే ఉన్నారు..సూటిగా..సుత్తిలేకుండా తాను చెప్పేదేంటో
చెప్తున్నారు..ముందుగా తమ లేఖ రాసింది సొంత పదవి కోసం కాదని..దేశం కోసమని ట్వీట్ చేయగా..గురువారం తాజాగా మరోటి వదిలారు..కాంగ్రెస్ బిజెపిపై సర్జికల్ స్ట్రైక్ చేయాలి కానీ..సొంతవాళ్లపై కాదంటూ సెటైర్ వేశారాయన.
తాజాగా కపిల్ సిబల్ ఉత్తరప్రదేశ్‌లో జితిన్ ప్రసాదని కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేస్తున్నారంటూ వాపోయారు..ఇది దురదృష్టకరమన్నారాయన దీనికి మరో సీనియర్ మనీష్ తివారీ కూడా ప్రెసెంట్ అంటూ నర్మగర్భంగా సింగిల్ లైన్ ట్వీట్ చేశారు..ప్రెసెంట్ అంటే ముందే ఊహించిన పరిణామం అని అర్ధం
అంటే జితిన్ ప్రసాదను టార్గెట్ చేస్తారని ముందే తెలుసని చెప్పడమే..ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జితిన్ ప్రసాద కుటుంబం సోనియాకి వ్యతిరేకంగా పని చేస్తుందని ఆరోపించింది..అతనిపై క్రమశిక్షణపరమైన చర్యలు తీసుకోవాలంటూ తీర్మానించింది..దీనిపైనే కపిల్ సిబల్ తన ఒపీనియన్ చెప్పగా..మనీష్ తివారీ తన ఇన్‌డైరక్ట్
మద్దతు తెలిపారు. దీంతో ఈ ఇద్దరు నేతల తీరు ఇప్పుడు కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది..ఇంతకీ రాహుల్ బాబా దీన్ని ఎలా తీసుకుంటాడో మరి..









Comments