ఈ టైమ్‌లో టీవి ప్రోగ్రామ్స్ ఎందుకు వద్దంటే..బాలుకి అలానే సోకింది మరి


జులై 30న జరిగిన ప్రోగ్రామ్‌లో బాలసుబ్రహ్మణ్యంగారికి కరోనా సోకింది..ఇది ఓ పాటల కార్యక్రమం...లాక్ డౌన్ ఎత్తేసారంటే అది ఆర్థిక కార్యకాలపాలు..వ్యక్తిగత జీవితం కోసం తప్ప..వైరస్ పూర్తిగా పోయిందని కాదు..సోషల్ డిస్టెన్స్ ఎంత ఫాలో అయినా..కొన్ని రంగాల్లో ఎలా పాకుతుందో చెప్పినా వినరు..అందుకే అనివార్యంగా చాలామందికి సోకుతుంది..అయినా కూడా పట్టించుకోకుండా..మా పని మాదే అన్నట్లుగా వ్యవహరిస్తే..ఇలా జరుగుతుంది

బాలుకి వచ్చింది సరే..కానీ ఆతర్వాత నెటిజన్లు ఇంకా దుర్మార్గంగా వ్యవహరించడం..ఫలానా సింగర్ వలన వచ్చింది ఆయనకి అంటూ..నిజంగా ఎవరికైనా కావాలని అంటించుకుంటారా...పైగా ఆమె నుంచి ఇంకొకరికి పో అంటేపోతుందా..ఎవడో ఒకడిమీద పడి ఏడవడం ఓ వ్యసనంగా మారిపోయిన వేళ కరోనా కరాళ నృత్యం వాళ్ల మనసులోనే చేస్తుంది..చెత్తగాళ్లు..అక్కడికేదో దగ్గరుండి వైరస్ వ్యాప్తి చేసినట్లు..
వైరస్ అంటే దగ్గర వాళ్లకి రాదన్నట్లుగా ఇప్పటికీ కొంతమంది బిహేవ్ చేస్తున్నారు..ఏహ..మాస్క్ తీయ్..ఏ చాయ్ వన్ బై టూ తాగుదాం..ఎహ ఏం కాదు..వచ్చేదెటూ వస్తుంది అంటూ తెగ ఓవరాక్షన్..ఇలాంటి చెత్తవాగుడుగాళ్లకే ఎక్కువ వస్తుంది అదిప్పటికే రుజవైంది కూడా...

Comments