వంట్లో కొవ్వు తగ్గించుకోండి..లేదంటే కరోనా రిస్క్ డబల్ అట


మీరు లావుగా ఉన్నారా...తస్మాత్ జాగ్రత్త కరోనా సోకే ఛాన్స్ ఎక్కువ.. కోవిడ్ 19 కోరల్లో చిక్కడమే కాదు..ఒబేసిటీ ఉంటే హాస్పటల్‌లో చేరాల్సి రావచ్చు ఇలాగంటూ అమెరికాకి చెందిన రీసెర్చ్ ఒకటి ఇప్పుడు భయపెడుతోంది..కరోనా కాలంలో లావుగా ఉన్నవాళ్లు అలర్ట్‌గా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.. షుగర్, హైబిపి ఇతర అనారోగ్య లక్షణాలకు మూలం లావుగా ఉండటమే.. మెడికల్ పరిభాషతో పాటు వాడుక భాషలోనూ ఒబేసిటీ అంటే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. దాంతో వచ్చే అనారోగ్య సమస్యలపై ఎప్పట్నుంచో ఓ అవగాహన ఉన్నా కూడా..కరోనా కాలంలో ఒబేసిటీ మరింత ప్రమాదకరమని అమెరికన్ నార్త్ కెరోలినా యూనివర్సిటీ హెచ్చరిస్తోంది

కరోనా వ్యాక్సిన్ కూడా లావుగా ఉన్నవాళ్లపై పని చేయదని నార్త్ కెరోలినా రీసెర్చ్ స్కాలర్లు చెప్తున్నారు దీనికి ఉదాహరణగా ఫ్లూ వ్యాక్సిన్లు బాడీ మాస్ ఇఁడెక్స్ 30 కంటే ఎక్కువ ఉన్నవారిపై పని చేయకపోవడాన్ని చూపిస్తున్నారు..ప్రపంచం మొత్తం మీద 75 స్టడీలను యూనివర్సిటీ ఆఫ్ కెరోలినా యూనివర్సిటీ నిశితంగా పరిశీలించింది ఈ 75 అధ్యయనాల్లో దాదాపు 4లక్షలమంది కరోనా పేషెంట్ల డీటైల్స్ ఉన్నాయ్..వాటన్నింటినీ క్రోడీకరించిన తర్వాత లావుగా ఉన్నవాళ్లకి కరోనా సోకే ఛాన్స్
రెండింతలు ఎక్కువగా ఉన్నట్లు కనుక్కున్నారు. అంతేకాదు అలాంటి వారిలో 74శాతం మంది హాస్పిటల్‌లో ఐసీయూలో చేరాల్సిన అవసరం ఏర్పడుతుందని
హెచ్చరించారు. శరీరంలో అనవసరమైన కొవ్వు తగ్గడంతో పాటు..అవసరమైన ఫ్యాట్ కూడా ఉండే డైట్ తీసుకోవాలంటున్నారు. తీపి ఎక్కువగా పానీయాలు వదిలేయడం..ఫ్యాట్
ఎక్కువగా ఉన్న ఆహారపదార్ధాలను తగ్గించడం..ఆయిల్ ఫుడ్‌కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు..అంతేకాదు శారీరక శ్రమకు ప్రాధాన్యత పెరగాలని నార్త్ కెరోలినా యూనివర్సిటీ స్కాలర్లు సూచిస్తున్నారు. లేదంటే రేపొద్దున్న కరోనాకి వ్యాక్సిన్ వచ్చినా..ఒబేసిటి ఉన్నవాళ్లపై పని చేయకపోవచ్చని కూడా వార్నింగ్ ఇస్తున్నారు..








Comments