ప్రాణం తీసిన అభిమానం అంటే ఇదేనా..పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్..చిత్తూరు జిల్లాలో అతని బర్త్ డేకి బ్యానర్స్ కడుతూ కరంట్ షాక్ కొట్టి చనిపోయారు..ఇదీ వార్త..ఎంత విషాదం..కరోనా టైమ్‌లో ఇలాంటి సోంబేరి పనులు చేయవద్దని పవన్ ఎందుకు చెప్పడు అని ఈజీగా ప్రశ్నించవచ్చు..కానీ వీళ్ల అభిమానానికి అడ్డుకట్ట వేయలేం అనేది అతగాడి వాదన

తల్లిదండ్రులను పట్టించుకోరు..పెళ్లాం బిడ్డల ఊసు అక్కర్లేదు..కానీ మన హీరో మాత్రం కావాలి..క్లాస్ బుక్స్ ఎక్కవ్..ఉద్యోగంలో టాలెంట్ చూపించరు..కానీ హీరోగారి ఊసులన్నీ కావాలి..ఇవే మన హీరోల ఫ్యాన్స్ పై వచ్చే విమర్శలు..మొన్నటికి మొన్న చూడండి మహేష్ బాబు తన బర్త్ డేకి ఎలాంటి పిచ్చ పనులు చేయవద్దని హంబుల్ గా చెప్పాడు..అప్పుడే అనుకున్నా..ఐనా ఈ టైమ్ లో ఈ ట్వీట్ ఏంటి ఎవరు పట్టించుకుంటారు అని..కానీ ఇప్పుడనిపిస్తుంది..అతను చాలా దూరం ఆలోచించి చెప్పాడే ఈ మాట అని

ఇక పవన్ కల్యాణ్ ఆ కుటుంబాలకు ఆర్ధికసాయం..ఆదుకోవడం..ఇవన్నీ ఓ పార్సుగా మిగలడం తప్ప..ఏంటి సాదించేది..ప్రాణం విలువ ఎలా కట్టాలి..తిరిగిరాని ప్రాణాలను ఊరికే ఎక్కడ బడితే అక్కడ దేనికోసం బడితే దాని కోసం ఇలా బలి చేయడం కరెక్టేనా..

Comments