బాలుగారికి భారతరత్న అనవసరమట ! ఈ ఛానల్ పైత్యం చూడండి..జగన్ అడిగాడు కాబట్టే ఇలా వాగుతోందా..?

 




ప్రపంచంలోనే ఇంతకంటే వితండ వాదన ఇంకోటి ఉండదు..మన ప్రత్యర్ధి కోరాడు కాబట్టి..అది వచ్చినా ఆ ముందు కోరిన ఘనత ఆయనకి చెందుతుందేమో అన్న దుగ్ధే తప్ప..ఈ వాదనలో ఏమైనా అర్ధం ఉందా..ఇలాంటి పిల్లిమొగ్గలు ఛానళ్లను జనాలు ఛీ కొడుతుంది ఇందుకే అనుకుంటా...


లేకపోతే బాలసుబ్రహ్మణ్యానికి భారతరత్నతో ఒరిగేదేం ఉండదట..లాంగ్ టర్మ్ లో బాలు పేరు నిలవాలంటే..ఏదో కాలేజో..ఇంకేదో..ఇంకేదో చేయాలట..ఎన్టీఆర్ కి కూడా అంతేనట..అసలు దాన్నీ దీన్నీ పోల్చడంలోనే వీళ్ల అజెండా కన్పిస్తుంది..వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏం చేసినా దాన్ని వ్యతిరేకించడమే ఎజెండాగా పెట్టుకున్నవాళ్లకి ఇది కూడా ఓ ఉదాహరణ అనుకోవాలి..లేకపోతే సమయం సందర్భం లేకుండా...గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా అంటూ..ఈ అవాకులు చెవాకులూ ఏంటి..ఎన్టీఆర్ కి మెడికల్ కాలేజ్ కి సంబంధం ఏంటి అంటే...మరి తెలంగాణలో ని ఆచార్య ఎన్ జీ రంగా యూనివర్సిటీ పేరు తీసేసి జయశంకర్ పేరు పెట్టలేదా...

అసలు బాలుకి భారతరత్న ఇవ్వాలో వద్దో కేంద్రం డిసైడ్ చేస్తుంది..ఈ లోపే ఈ చానల్ కి ఎందుకింత ఆత్రం..పొరపాటున ఆ క్రెడిట్ ఏపీ ప్రభుత్వం ఖాతాలోకి పోతుందనా..ఏం కాదు సార్..అది బాలు క్రెడిట్ కే పోతుంది తప్ప..జగన్ అడిగాడు కాబట్టి..ఆయనకి పోదు..అయినా ఈ మాత్రం తెలివిడి లేకనే ఇన్నాళ్లూ భారతరత్నలు..పద్మశ్రీలు ఇస్తూ పోతున్నారా...ఈ లెక్కన దేశంలో అవార్డులు తీసేసే వాళ్ల పేరిట కాలేజీలు..స్మృతి వనాలు పెట్టించాలనే ఉద్యమాన్ని చేపట్టండి మీరు


https://www.youtube.com/watch?v=QtuJSs7UD1w

అన్నిటి కంటే కొసమెరుపు ఈ ఛానల్ వాళ్లే నిన్నా మొన్న తెలుగు ప్రభుత్వాలు తెలుగు చిత్రపరిశ్రమ బాలుకి ఘోరమైన అవమానం చేశాయంటూ వీడియోలు పెట్టారు..మరిప్పుడు ఈ పై వాదన ఇంకెంత అవమానించినట్లు..


Comments

  1. అసలే మనం ఏమీ చేయబళ్ళేదని లోకం కోడై కూస్తాంది. అనుకుల గొట్టాల్లో అసమదీయ కులకాంతే డాక్టర్ ఫీజు డబ్బు కట్టిందని డప్పు కొట్టిస్తే ఓపని ఐపోయుండ్ల?

    ReplyDelete
  2. జగన్ అడిగాడు కాబట్టే వాళ్ళు అలా వాగుతున్నారని మీరనుకుంటున్నారా?

    ReplyDelete

Post a Comment