2 నెలల నుంచి చేస్తున్నాం...అబ్బే మా కథనాలతో స్పందించారు సార్..ఆ టీవి 9కి బుద్ది రాదా..

 ఎక్కడేం జరిగినా తమ గొట్టం హడావుడికే జరుగుతుందన్నట్లుగా బిల్డప్ ఇచ్చే ఈ ఛానల్..మరోసారి ఓపెన్ గా బుక్కైంది.. హైదరాబాద్ విజయవాడ రోడ్డులో ప్రవేట్ ట్రావెల్స్ దోపిడీ ఇవాళ కొత్త కాదు..ఇప్పుడు ఆగిపోయేదీ కాదు..ఐనా తనకి గుర్తొచ్చినప్పుడల్లా ఓ స్టింగ్ ఆపరేషన్ అంటూ బిల్డప్ ఇస్తూ..హడావుడి చేస్తుంటుంది..ఇప్పుడు కూడా ప్రవేట్ ట్రావెల్స్ పై మేం చేసిన స్టోరీలకు స్పందన వచ్చిందహో...్ంటూ బిల్డప్ ఇచ్చి..లైవ్ లోనే భంగపడింది..ఐనా సరే తన టముకు  ఆపదు కదా..

లైవ్ లో అడిగితే..అఫిషియల్సే చెప్పారు...2 నెలల నుంచి చేస్తున్నాం...ట్రాఫిక్..ఆర్టీఏ జాయింట్ ఆపరేషన్ లో రోజూ బస్సలున ు పట్టుకుంటున్నాం...25 బస్సులు సీజ్ చేసాం అని చెప్తున్నా..రెండు రోజుల నుంచి మా కథనాలతో స్పందన వచ్చిందంటూ డప్పు కొట్టుకునే ఈ ఛానల్ సమాజాన్ని మురుగు పరుస్తుందనడంలో డౌట్ ఎందుకు

Comments