సబ్బం హరిపై దాడి చేశారట..పట్టాభిని కొట్టారట..మై గాడ్ ఏం జరుగుతోందండీ ఏపీలో..!




నిన్న ఉదయం 9 గంటల సమయంలో ఓ బ్రేకింగ్ సబ్బం హరి ప్రహరీ గోడని కూల్చేసారని..చూస్తే..వైజాగ్ మున్సిపల్ కార్పోరేషన్ వాళ్లు పార్కు స్థలాన్ని ఆక్రమించినందుకు ఆ స్థలాన్ని స్వాదీనం చేసుకున్నట్లు తెలిసింది..ఇప్పుడే గుర్తొచ్చిందా.?

ఇన్నాళ్లూ ఏం చేసారు.?

అసలు నోటీసులు కూడా ఎందుకు ఇవ్వలేదు?

అంటూ ఆయన వాపోయారు..నిజమే ఏదో సమయంలో ఏదోటి చేస్తారు..అంత మాత్రాన మీరు ప్రభుత్వ వ్యతిరేక వైఖరి ప్రదర్శించారని..మీరు చేసిన కబ్జాలను వదిలేయాలా?

పోనీ నోటీసులు ఇచ్చి పడేస్తే ఓకేనా..?

మంత్రి అవంతి శ్రీనివాస్ ఉరఫ్ ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు ఆ ముచ్చట కూడా తీర్చేశారు కదా నోటీసులు ఇచ్చేశాం అని చెప్పారు..మరిక మీ వాదనకి బలం ఎక్కడ..

పైగా ఎప్పుడో రెండేళ్ల క్రితం అంటే చంద్రబాబుగారే ఉన్నారు అప్పుడు అధికారంలో..ఏదో బీచ్ రోడ్ వైడెనింగ్ చేస్తున్నామంటే నా అంతట నేనే ఇచ్చేశాను..కానీ  వాళ్లే రోడ్డు వేయలేదు..అందుకే నన్నందరూ దేవుడిలా కొలుస్తారు అంటూ మీ శీలానికి మీరే కితాబులు ఇచ్చుకుంటూ పోవడం ఎందుకు..

అది అక్రమం కాకపోతే..ఖచ్చితంగా కోర్టుకి పోండి..మీ స్థలం మీరు తెచ్చుకోండి..లేకపోతే అది అక్రమం అని ఒప్పుకోండి..అంతే కానీ నేనేం మాట్లాడను..ఇప్పుడు కూడా ఏం మాట్లాడతున్నా అంటే..ఏదేదో మీ పై ఆధారపడిన ఛానళ్లకి కబుర్లు చెప్పకండి


ఇక ఎపిసోడ్ 2...పట్టాభి గారి కారుమీద దాడి చేశారట..ఆయన కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారట..ఎక్కడ బాబూ గత రెండు నెలల్లో మీరెక్కడ కన్పిస్తున్నారండీీ...సరే మీ పై దాడి చేసింది..వైఎస్సార్సీపీ లీడర్లే అని కాసేపు అనుకుందాం..మీరు మహాత్మునిలా..ఊరికే కూర్చునే టైపా..ఆ టైపే అయితే..మిమ్మల్ని ఈ స్థాయికి పార్టీ ఎలా తీసుకువస్తుంది..కబుర్లు చెప్పకండి..ఎవడో దాడి చేసారు..అని చెప్పడం కాదు..కంప్లైంట్ ఇవ్వండి..ఎటూ కోర్టులకు వెళ్లడం అలవాటే కాబట్టి..ప్రవేట్ కేసులు కూడా పెట్టండి..బాబ్బాబ్బూ నా కారుపై దాడి వెనుక  సిఎం హస్తం ఉందని గగ్గోలు పెట్టండి..

మీ మాటలు ఎవరూ నమ్మరని  ఇప్పటికే మీ ఊళ్లో...మీ పార్టీ లీడర్లే చెప్తున్నారట..ఆ ఆడియో ఒకటి తిరుగుతుంది ఆ సంగతి చూసుకోండి..

Comments