భావదారిద్ర్యంతో చరిత్ర పురుషుల పేర్లు వాడుకోవడం..ఆ తర్వాత కేసుల భయంతో లేదనడం..ఇదేనా నేటి దర్శకుల నీతి



గొప్ప పేరున్న వాళ్లని వాడేసుకోవడం..వారికి సంబంధించిన వారసులు కానీ..అబిమానులు కానీ తిరగబడతారనుకున్నా..కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందనుకున్నా..వెంటనే ప్లేటు తిప్పేయడం...కంచం లేపేయడం ఈ మధ్యన సినేమా వాళ్లకి బాగా అలవాటైంది..ఉదాహరణకు ఓ పేరు మోసిన దర్శకుడు ఉన్నాడు.. మన్యం దొరగా పిలుచుకునే అల్లూరిని..ఈ 20 ఏళ్లలో అందరికీ పాపులర్ అయిన కొమరం..ఉరఫ్ కొమ్రుం బీమ్ క్యారెక్టర్లు అంటూ ఇద్దరు నటులతో ఓ సినేమా అనౌన్స్ చేసాడు..అసలు వీళ్లిద్దరూ సమకాలీనులు కానే కాదు..అయినా సరే..ఒకరిని చూసి ఒకరు స్ఫూర్తి పొందారంటూ కట్టు కథలు..అడిగేవాడు లేడు కదాని..ఇష్టం వచ్చినట్లు తీసేయడానికి రెడీ అయ్యారు..కానీ  మధ్యలో కరోనా కజ్జికాయ కొట్టడంతో అది కాస్తా వెనక్కిపోయింది..

ఇప్పుడు మళ్లీ తెరపైకి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటుంటే..ఎక్కడో ఏదో తేడా కొడుతుందనే డౌట్లు వచ్చేసాయ్ యూనిట్ కి..అబ్బే స్వాతంత్ర సమరానికి వీళ్లిద్దరూ పోరాడిన సీన్లు పెట్టం..అసలు ఈ రెండూ కల్పితం.అంటూ లీకులు ఇస్తున్నారు..

కనీసం ఆ రెండు పాత్రల పేర్లు చెప్పినప్పుడన్నా..ఆ మాత్రం దమ్ము ఉండొద్దా...నిజం ఒప్పుకునేందుకు కూడా దమ్ము ఉఁడాలి కదా..ఓ ఏడాది క్రితం హైరా....హైరా..అంటూ ఓ కర్నూలు రెడ్డి కథ వచ్చింది..వచ్చినట్లే పోయింది కూడా..బహుశా ఇది కూడా అలానే వెనక్కిపోకూడదనే..ముందే ఓ జానపద..చారిత్రక..సాంఘీక సినిమా ముద్ర పడితే బెటర్ అనుకున్నారేమో..అబ్బే మేం అలా తీయడం లేదని అంటున్నారు..

సైరా చిన్నపరెడ్డి అని విజయచందర్ ఓ సినిమా తీసాడు..అలానే కరుణామయుడు అని క్రీస్తుపైనా తీసాడు..ఎవరిని ఎంత కన్విన్స్ చేసి తీసాడో అందరికీ తెలుసు..ఎన్ని కష్టాలు పడిందీ తెలుసు..అందుకే అది చరిత్రలో నిలిచిపోయింది..ఓ అల్లూరి సీతారామరాజు కూడా వచ్చింది..దానికోసం అల్లూరి సత్యనారాయణరాజు అని శ్రీరామరాజుగారి సోదరులతో కృ,ష్ణ సోదరులు ముందే సినిమా చూపించి మరీ విడుదల చేసారు..అదీ వాళ్ల కమిట్ మెంట్..

కానీ ఇప్పుడో చెట్టు పేరు చెపుదాం...బ్రహ్మాండంగా  అమ్మేద్దాం...ఏదైనా క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుందా..అబ్బేఈ కాయలు వేరండీ అని చెప్పుకుందాం ఇదే తీరులో నడుస్తున్నాయ్ కథలన్నీ...మీనాల్లాంటి సినిమాలు ఇప్పుడు అ ఆ ల సమయానికే కాపీ కొడుతుంటే..భలే కృష్ణుడు గురూ ఈ సన్నాఫ్ సత్తెరెడ్డి అనుకోవాల్సిందే 

Comments

  1. పబ్లిసిటీ ఎక్కువైన సినిమాలు పచ్చడైపోయాయి చరిత్రలో!
    ఇంకో దిక్కుమాలిన డైరెక్టర్ ఉన్నాడు. కాంట్రవర్సీ ఎక్కువ కాంటెంట్ తక్కువ. చరిత్రలో జరిగే మర్దర్లు మానభంగాలకి తన మసాలా జోడించి సినిమాలు తీస్తాడు.

    ReplyDelete

Post a Comment