జగన్ ని ఏకడానికి పెట్టే దృష్టి నీ పేపర్ పై పెట్టు సామీ...ఇదేం రాతలు

 

ఆదివారం ఓ మసాలా కాలక్షేపం కోసం ఓ పేపర్ కొన్నాం...అందులో వార్తలు చూస్తే..భలే మజా వస్తుంది..రకరకాల ఎమోషన్స్ వస్తాయ్..అసలు ఇది రాసినోడితో మనం చర్చకి కూర్చోవాలి..రచ్చబండ అరిగేదాకా వాదించుకోవాలనే తపన ప్రారంభమవుతుంది..ఎవడికీ ఏ ఉపయోగం లేదనేది నిజమే కానీ...పేపర్ సేల్ అవుద్ది..తర్వాత దాన్ని గాలి కొదిలేస్తాం...ఇది పైసలు పెట్టి కొనేవాడి యాంగిల్..
మరి యజమాని కోణం ఎలా ఉండాలి..నా పేపర్ లో ఏం రాసినా..నాకో గౌరవం ఉండాలి..డబ్బూ రావాలి..పరపతి పెరగాలి..నా పనులు జరగాలి..ఇఁచుమించుగా అందరూ ఇదే కాన్సెప్ట్ పాలో అవుతారు..జనప్రయోజనం..జనం కోసం. దేశం కోసం అనే ప్రబుద్దులు ఉంటే వాళ్లకి జోహార్లు...
కానీ పైన చూడండి..ఎలాంటి హెడ్డింగ్..సరే హెడ్డింగ్ వదిలేద్దాం..కిందైనా వేరే మ్యాటర్ ఉంటుందా అంటే లేదు..మొదటి లైన్ లోనే అదే తప్పు..అందులనూ బ్లండర్...
 కరోనా వచ్చి ఏడాదవుతున్నా..ఇంకా అదే తీరట..నీ....నాకు బండబూతులు వస్తున్నాయ్...కనీసం చదువరులకు ఇచ్చే గౌరవం ఇదేనా..ఏది పడితే అది రాసేయడమేనా..ఇప్పుడు గూగుల్ లో ఓ 50 ఏళ్ల తర్వాతో..20 ఏళ్ల తర్వాతో కరోనా   ట్రీట్ మెంట్..కరోనా వచ్చిన కొత్తల్లో-- ఇలాంటి పదాలు టైప్ చేస్తే..ఇదిగో ఇలాంటి రాతలే వస్తే..ఏమనుకుంటారు..మనం సన్నాసులనమనుకోరా.. .? ఇదేనా వీళ్ల జ్ఞానం...ఎవడో ఏదో రాసేస్తే..దాన్ని అనువదించి జనం మీదకు వదిలేడమేనా..కనీసం ఆలోచన ఉంటే ఇలా జరుగుతుందా..? మన దేశంలో కరోనా కేసు బయటపడి భయపడటం గట్టిగా స్టార్ట్ అయిందే ఫిబ్రవరిలో..అక్టోబర్ కూడా పూర్తి కాకముందే ఏడాదిగా ఇదే తీరా...ఛీ...( మాలాంటి సత్రకాయ్ బ్లాగర్లు ఏవేవో తప్పులు రాస్తే సరే..కానీ ఇలా పేరు మోసి...డబ్బు చేసి..18 ఏళ్ల నుంచి ఇరగదీసామని చెప్పుకుంటున్న దమ్మున్న పత్రికల్లో కూడా ఇలానే వస్తే ఎలా..?


Comments