ఛల్ మేరీ లూనా...మళ్లీ వచ్చేస్తోందట..వస్తుంది కానీ..ఆదరణ దక్కుతుందా


నా చిన్ననాడు..నా ఫ్రెండ్ వాళ్ల నాన్నగారు ఇదే బైక్ పై వెళ్లేవారు..నాకప్పుడు బిఎస్ఎ ఎస్ఎల్ఆర్ సైకిలు ఉండేది..అదే స్టైల్ గా ఉండేది..ఈ మోపెడ్ పై మోజు అలాగని చిన్నచూపు కూడా ఉండేది కాదు..కానీ సైకిల్ కంటే కాస్త వేగంగా..మధ్యతరగతి మనుషులకు టైమ్ కి ఆపీస్ కి వెళ్లాలంటే ఈ లూనానే ఆధారమని తర్వాతి రోజుల్లో తెలిసింది..ఇప్పుడు మళ్లీ దీన్ని ట్రాక్ లో పెడదామనే ట్రయల్స్ ప్రారంభం అయ్యాయట..

కానీ రయ్ రయ్ మని..జుయ్ మంటూ దూసుకుపోతోన్న ఈ యుగంలో పాతమోడల్ కి ఎంత మేర ఆదరణ లభిస్తుందో చెప్పలేం కానీ..ఎంక్వైరీలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయంటున్నారు  

గేర్స్ లేకపోవడం..లుంగీతో అయినా..శారీతో అయినా నడపగలగడం దీని స్పెషాల్టీనే..దీని తర్వాత టివిఎస్ 50 కూడా మంచి సేల్సు ఉన్న బళ్లే..ఐతే 1973లో ఆయిల్ సంక్షోభంతో..ఈ కంపెనీ మోడల్ పై పెద్ద పిడుగుపడిందని చెప్తారు.. లీటర్ కి 55 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ బండి..అమ్మకాలు పడిపోయాయట..ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే..అప్పట్లో ఓ బైక్ కొనాలంటే ఎంత డబ్బున్నా సరే 15ఏళ్లు ఆగాల్సి వచ్చేదట..అందుకే చాలామంది స్కూటర్ బుక్ చేసేసి..డెలివరీ తీసుకునే సరికి వాళ్లకి పిల్లలు పుట్టడం  పెద్దవాళ్లవడం కూడా జరిగేదట...

అప్పట్లో లూనా బండి ఖరీదు 3వేల రూపాయలు మాత్రమే..దీంతో వెంటనే లూనా కొనుక్కోవడం సాధ్యపడేది..ఎందుకంటే బుక్ చేసిన మూడేళ్లలో వచ్చేదట..ఐతే గంటకి 40 నుంచి 45 కిలోమీటర్ల వేగం మాత్రమే వెళ్లగలిగిన లూనా మోపెడ్..మరి ఇప్పుడు గంటకి 100 మైళ్ల వేగంతో వెళ్తోన్న బళ్లని అధిగమిస్తుందా...?



Comments