అయ్యా అభినవ చే..గు..వే రాధాకృష్ణగారూ..న్యాయవ్యవస్థపై ఎవరూ దాడి చేయడం లేదు..మీ ఓవరాక్షన్ ఆపండి

 


ఫస్ట్ మీరో సంగతి తెలుసుకోండి..వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది సిబిఐ కోర్టు మాత్రమే..సుప్రీంకోర్టు కాదు....


అయ్యా చాలా రోజులకు తమకి చేతినిండా పని దొరికినట్లుంది..అలానే న్యాయ వ్యవస్థపై కరుణ పుట్టుకొచ్చినట్లుంది..ఫస్ట్ మీపై పరువు నష్టం దావా కేసులో ఎందుకు పది వాయిదాలు ఎగ్గొట్టారు..ఎందుకు వెళ్లలేదు..హైదరాబాద్లోని న్యాయస్థానమే విచారణకు పిలిచినా ఎందుకు వెళ్లకుండా అబ్ స్కాండ్ అయ్యారు..కాదూ అప్పటికప్పుడు అనారోగ్యం వచ్చిందీ అంటే అదీ లేదు..మీ  మీ కార్యకలాపాల్లో బ్రహ్మాండంగా తిరుగుతూనే ఉఁటిరాయే..అంటే కోర్టుల విచారణ కంటే మీకు మీ పనే ముఖ్యమా...అంటే కోర్టు అన్నిసార్లు పిలిచినా వెళ్లలేదంటే కోర్టులంటే మీకు గౌరవం లేదా..?

అది వదిలేద్దాం..ఏంటీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మీకు జగన్ రెడ్డి అయ్యాడా..ఓకే మీకు ఆయన పేరు చివర రెడ్డిని హైలైట్ చేయడమనేది స్ట్రాటజీ అన్పించవచ్చు..కానీ జనాలకు అదేం కొత్తకాదు..ఓకే వదిలేద్దాం..అసలు ఓ చెట్టుకింద ప్లీడర్ లా రోజూ ఓ వ్యక్తి ఢిల్లీలో లైవ్ లు ఇస్తానంటుంటే ఓ రెండు ఛానళ్లు తప్ప ఎవరూ లైవ్ తీస్కోవు..అవేంటో మీకు తెలుసు..మరి ఆయన ..మీ సంయుక్త భాషలో వైసీపీకి ఎన్డీఏలో చేరేంత సీన్ లేదు..మరి అయినా జగన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ప్రదానన్యాయమూర్తిగా అవకుండా అడ్డుకోగల సత్తా ఉందని మీరే మీ రాతల ద్వారా ఎందుకు ఎత్తి చూపుతున్నారు..ఇది కోర్టు దిక్కారమేనేమో
 అయినా ఫలానా వ్యక్తే..ఫలానా పదవిలో కూర్చోబోతున్నట్లు మీకెలా తెలుసు...ఇది నిజంగా..నిజమేనా..?

అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన వ్యక్తికి బెయిల్ రావడం మీకు కంటగింపుగా ఉందా..సరే మరి మన అంతేవాసుల్లో ఎవరూ జైలుకు వెళ్లలేదా..బెయిల్ దొరకలేదా...అంటే ఫలానావాళ్లకే బెయిల్ ఇవ్వాలని మీరు కోర్టులను శాసించదలిచారా../పైగా ఆ బెయిల్ రావడానికి అప్పటి కేంద్రమంత్రులు సాయపడ్డారని మీకెలా తెలుసు..? మీకెలాంటి స్పై కెమెరాలు ఉన్నాయో చెప్తే..ఆ వివరంతో అంతా జాగ్రత్త పడతారు కదా..

మరి అంత సాయపడిన కాంగ్రెస్ తో వైఎస్ జగన్ ఎందుకు అంటకాగలేదు..బహుశా మీరేమైనా బాబుగారితో చెప్పి కాంగ్రెస్ తో కలవనీయకుండా అడ్డుపడ్డారా...? పైగా ఇప్పుడు మీరేదో న్యాయవ్యవస్థపై అపారగౌరవం ఉన్నట్లు నటిస్తున్నారు..ఇక్కడ ఏపీ ప్రభుత్వం అభ్యంతరం న్యాయవ్యవస్థపై అని ఎక్కడైనా అఫిడవిట్ ఇచ్చిందా..లేదు కదా..మరి మీరెందుకు ఇలా వక్రీకరిస్తున్నారు..ఇలా వక్రీకరించడం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుందని మీకు తెలీదా..?

Comments