వామ్మో ఈ సంగతి చైనాకి తెలిస్తే ఇంకేమైనా ఉందా..దమ్మున్న పత్రికే కన్ఫామ్ చేసిందంటే ఎవరిదా తప్పు

 


అసలే ఇప్పుడు చైనా ఎవడికి ఏం బిస్కెట్ వేద్దామా...వైరస్ తప్పు తనది కాదని చెప్పుకునే ఛాన్స్ కోసం చూస్తుంటే..పొరపాటున ఈ దమ్మున్న పత్రిక గురించి కానీ తెలుసుకుందా..అదిగో ..కరోనా వైరస్ ఇండియాలోనే సంవత్సరం క్రితమే వచ్చిందట..అప్పట్నుంచి వాళ్లే ఏ ట్రీట్ మెంట్ చేయాలో తెలీక అల్లాడిపోతున్నారు..మామీద పడతారేంటి..ఇదిగో ట్రంపూ నీ బెస్ట్ ఫ్రెండ్ మోదీ నువ్వూ కలిసే మా మీదకు వదిలారు కదా..అని ఏ ఐక్యరాజ్యసమితిలోనే కంప్లైంట్ చేస్తే మా సంగతేం కావాలి..?
జిన్ పింగ్ అర్జంట్ గా ఈ దమ్మున్న పత్రికను మనకి కూడా సర్కులేట్ చేయండి...ఇదే మనకి ఆదారం..గాఠ్టిగా పోరాడదాం..అవసరమైతే అమెరికా అడిగినట్లే మనం కూడా నష్టపరిహారం డిమాండ్ చేద్దాం..వైరస్ మేడ్ ఇన్ అదర్ కంట్రీస్ నాట్ మేడ్ ఇన్ చైనా..అంటూ స్లోగన్ ఇద్దాం..ఇదిగో దానికి సాక్ష్యం 18ఏళ్లుగా ఇండియాలో దుమ్ము రేపుతున్న ఈ నంబర్ వన్ పత్రికే సాక్ష్యం అంటూ  పేపర్ క్లిప్పింగ్స్ దాచి పెడితే..

అసలు ఈ వ్యాసం చదివితే ఎవరికైనా బుర్ర పోతుంది..రెమ్ డెసివర్ పని చేయడం లేదని అమెరికా చెప్పిందట..మళ్లీ అదే ఎఫ్ డిఏ వాడమని సిఫాీర్సు చేసిందట..ప్లాస్మా థెరపీ వద్దని ఐసిఎంఆర్ చెప్పిందట..మన డాక్టర్లకి ఏం చేయాలో తెలీక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారట..ఇది మనల్ని మనం అవమానించుకోవడమే...70లక్షలమందికి వైరస్ ట్రీట్  మెంట్ ఇచ్చి దాని బెడదనుంచి తప్పించగలిగిన మన డాక్టర్లకి ఏం చేయాలో తెలీడం లేదా..? 90శాతం రికవరీ రేటు ఉన్న చోట ఇలాంటి పనికిమాలిన రాతలు ఎందుకు రాయడం..ఖాళీగా గ్యాప్ ఉంటే..అక్కడేదో యాంటీ జగన్ వార్తలతో నింపేయక..సిగ్గు చేటు రాతలు మానుకోకపోతే..చివరికి పత్రికలంటేనే అసహ్యం పుట్టి చదవడం మానేయరు...కొనడం మానేస్తారు..

 

Comments