సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్నదే నిజం..మరి ఆర్నాబూ నీ గొంతుని..నీ ఛానల్ ని ఎక్కడ కప్పెడతావ్..?

ఆరోపణలు చేయడం వేరు..అదేదో అంతా దగ్గరనుండి చూసినట్లు..తామే ప్రతి దానికీ నిర్ణాయక పాత్ర పోషిస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం వేరు..దొరికిన ఆధారాలు..లభించిన సమాచారంతో ఫలానావాళ్లుపై ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయ్ అని అనడం వేరు..అదిగో మేమే ఇన్వెస్ట్ చేసేసాం..ఇదిగో ఈ పిల్లని అరెస్ట్ చేయండి..ఇదిగో ఈ కరణ్ జోహార్ పరిస్థితేంటి..ఇదిగో ఈ హీరోయిన్ ని ఎందుకు వదిలేసారంటూ తెగ హడావుడి చేసిన ఆర్నాబ్ నోరు మూసుకుంటాడా ఇప్పటికైనా..లేక పెంట వాగడానికి అలవాటైన నోరు నెక్స్ట్ పెంట ఏరుకోవడానికి బయలు దేరుతుందా...?



పైన కనబడుతున్న పిల్ల పేరు రియాచక్రవర్తి..సుశాంత్ తో కలిసి డేటింగ్ చేసింది..చివరికి బ్రేకప్ అయింది..అయిన వారానికే ఇతగాడు చనిపోయాడు..ఎందుకనేది ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తుంటే..ఠాట్...అంతా హంబక్..అంటూ ఈ ఆర్నాబ్ ...బిజెపి హంగామా చేయడం..తర్వాత ఇప్ుడు ఎయిమ్స్ రిపోర్ట్ కూడా విజరా పరిశీలించి..విషం ఇచ్చి చంపారని కానీ..శరీరంపై ఇతర గాయాలు కానీ లేవని చెప్పింది..

ఆర్నాబ్ గాడు  ఎవరిని వెనకేసుకుని వస్తాడో అందరికీ తెలుసు...ఈ రెండు నెలలూ ఎలాగో కరోనా కేసులు పెరిగుతుంటే మనమెక్కడ ఛానళ్లలో ఆ వార్తలు చూడాల్సి వస్తుందో అని...అది కవర్ చేయకుండా ఉన్నంతమాత్రాన మన చేతకాని తనం తెలీకుండా పోతుందా..చైనా బోర్డర్ ఇష్యూపై చర్చలు పెట్టింది లేదు..తిండి దొరకనివాళ్లపై చర్చలు పెట్టింది లేదు..ఆత్మ నిరభర అబల ప్యాకేజీ ఫెయిలైన సంగతి పట్టించుకుంది లేదు..కానీ ఇదిగో ఈ కేసు పై మాత్రం 200 చర్చలు పెట్టాడట ఈ ప్రబుద్దుడు..ఇప్పుడు అది కూడా బెడిసి కొట్టింది..ఇక 
కాంగ్రెస్ పై పడి ఏడవడం ప్రారంభించాడు..హత్రాస్ లో ఏమీ జరగలేదట..కాంగ్రెస్ స్టంట్ చేస్తుందట
మరి అదే నిజమైతే..మోదీ ఎందుకు  మొదటి రోజే యోగికి కాల్ చేయాలి
ఎందుకు రాత్రికి రాత్రి శవాన్ని తగలబెట్టాలి
ఫ్యామిలీ మెంబర్లని ఎందుకు నిర్భందించాలి
ఇవన్నీ సక్రమమే అయితే ఎందుకు జడ్జిని..ఎస్పీని సస్పెండ్ చేసారు
ఇప్పుడు యోగీ సిబిఐకి ఎందుకు అప్పగించాడు కేసుని..రే్య్..మీరేం చూపిస్తే..అదే చూడర్రా జనం..జస్ట్ కాలక్షేపం కోసం ఛానళ్లు చూస్తున్నారంతే..







Comments