మహేష్ బాబు పవన్ కల్యాణ్ ఛార్జీలు తగ్గించుకుంటున్నారా...ఇదేమైనా గవర్న మెంట్ ఫిక్స్ చేసిన ఫీజా..?


ఏంటీ మనోళ్లు రెమ్యూనరేషన్ తగ్గించుకుంటున్నారట...అది కూడా 20శాతం..నిజమేనా...నమ్మాలి మరి
ఓ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు..ఆయనకో ఫిక్స్ డ్ శాలరీ ఉంటుంది..అలానే ప్రవేట్ ఉద్యోగులకూ ఓ శాలరీ ఉంటుంది..మరి ఈ సినిమావాళ్లకి ఖచ్చితమైన జీతం ఏదైనా ఉందా..ఉండదు..మరి సినిమా సినిమాకి ఖచ్చితంగా ఇంతే తీసుకుంటామని..తీసుకుంటున్నామని ఏదైనా అగ్రిమెంట్ ఉఁదా...తెలీదు

పైగా ఓ సినిమా హిట్టైతే..వెంటనే ఆ తర్వాత అమాంతం 25 నుంచి 50శాతం పెంచుతారని కూడా హీరోలపై కామెంట్ ఉంది..అది చాలా వరకూ నిజం కూడా..లేకపోతే బొంగులో సినిమా ఒకటి హిట్టైతే..వెంటనే కోటి రూపాయలు తీసుకునే హీరోలు ఎంతమంది లేరు..మరి అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన హీరోలకు రెమ్యునరేషన్ కోస్తారు

పైగా అయ్యా మీరు గతంలో 10 కోట్లు తీసుకున్నారు..కాబట్టి..8 కోట్లు తీసుకోండి అని చెప్పే నిర్మాతలు ఉన్నారు..అలాగని హీరోల దగ్గరకి పోతే వింటారా..ఏమంటారు..నా రేంజ్ ఇది ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అంటారు..స

సరే ఈ సోదంతా హీరోలపనే ఎందుకు అంటే..అసలు బడ్జెట్ కంటే ఈ హీరో..దర్శకుల రెమ్యునరేషనే 

ఎక్కువ కాబట్టి..సినిమా తీయడానికి అంటే ఓ ప్రొడక్ట్ ఉత్పత్తి కావడానికి ఎంత ఖర్చు అవుతుందన్నది ప్రొడక్షన్ కాస్ట్ అయితే..పోస్ట్ కానీ..ప్రీ ప్రొడక్షన్ కాస్ట్లో ఈ ఇద్దరిదే ఎక్కువ పాత్ర..ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులు..కానీ చిన్న పాత్రలు వేసేవారిని పక్కనబెడితే..జ్యూనియర్ ఆర్టిస్టులకు ప్రత్యేకించి ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువన్నట్లు నిర్మాతలు బిల్డప్ ఇస్తుంటారు..మరి ఖర్చు తగ్గేదెక్కడ..

 


కింద ఫోటో చూడండి..ఏ రావోయి చందమామనో...టక్కరిదొంగ సమయంలోదో...చేతనైతే ఆ స్థాయికి రెమ్యునరేషన్స్ తీసుకెళ్లండి..అప్పుడు ఇండస్ట్రీ చాలా హ్యాపీగా ఫీలవుతుంది..నిజంగా అంత సీన్ ఉందా..లేదు..ఇవన్నీ ఏంటంటే..చిన్న పాత్ర ధారులకు డబ్బులు తగ్గించి ఇవ్వడానికే ఈ సెకలన్నీ..ముందసలు ఏ హీరో..ఏ డైరక్టర్ ఎంత తీసుకుంటున్నారో బైటికి చెప్పమనండి..అప్పుడు తేలుతుంది..ఎవరి లెక్క ఎంతో...


అంతిమంగా మన సంగతేంటి..మన జీతాలు పోయాయ్..ఉపాధి పోయింది..ఉద్యోగాలు పోయాయ్..మరి సినిమాకి రావడానికి మనకి ఖర్చు తగ్గించాలిగా..టిక్కెట్లలో 20శాతం తగ్గించి అమ్మమనండి..అబ్బే ఆ పని మాత్రం చేయం





 

Comments