స్కూల్స్ కి వెళ్తే కరోనా సోకడం లేదు...సోకినవారు బైటపడుతున్నారు..తేడా గమనించాలి

 ఏపీలో స్కూల్స్ ఓపెన్ అవుతుండటంతో..కరోనా బారిన పడుతున్నారంటూ బ్రేకింగ్స్ చూస్తుంటే తమాషా అన్పిస్తుంది..
నవంబర్ 2న స్కూల్స్ ఓపెన్ అయ్యాయ్...నవంబర్ 4 కల్లా అందరూ వైరస్ సోకిందని చెప్తున్నారంటే దాని అర్ధం అక్కడికి వెళ్లి అంటించుకుంటున్నారని కాదు..వీళ్లంతా ఎసింప్టమేటిక్ కేసులు..అంటే ఇప్పటిదాకా ఇళ్లలో ఉన్నారు కాబట్టి..ఎవరికీ తెలీదు..కానీ స్కూల్స్్ కి వచ్చిన తర్వాత కచ్చితంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి కానీ ఎంట్రీ ఇవ్వనీయడం లేదు..అలా టెస్టులు చేసినప్పుడు ఇంతమందికి వచ్చినట్లు తెలిసింది..అంతేకానీ..అదేదో స్కూల్స్ నిండా వైరస్ తిరుగుతుంది..వెళ్లి అంటించుకుంటున్నారని అపోహలు అనవసరం..
ఇదే సమయంలో ఇంకో విషయం కూడా గమనించాలి..ఇంతమందికి బయటకు రాగానే టెస్ట్ చేయగానే వైరస్ ఉన్నట్లు తెలుస్తుందంటే..వైరస్ విశ్వవ్యాప్తం అయిందనుకోవాలి..ఓ రకంగా హెర్డ్ ఇమ్యూనిటీ కూడా వచ్చినా రావచ్చు..ఇప్పటికే సీరో సర్వేల్లో 30శాతంమందికి సోకిందంటున్నారు..ఎటూ ఆంధ్రప్రదేశ్ లో 80లక్షలమందికి టెస్టులు చేసారు..డిసెంబర్ నెలాఖరుకల్లా కోటి మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగిపోతాయ్..అంటే ఏపీలో 25శాతంమందికి టెస్టులు జరిపినట్లే...
ఇలా టెస్టింగ్ చేయడంతోనే ఎవరికి యాంటీబాడీలు ఉన్నాయ్..ఎవరికి లేవనే సంగతి తెలీకపోయినా...ప్రతి ఐదుగురిలో ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తుంది..భయపడాల్సిందల్లా..పిల్లల నుంచి ఇళ్లలో ముసలోళ్లకి సోకకుండా ఉండేలా చూడటమే..ఆ జాగ్రత్తలేవో తీసుకుంటే సరిపోతుంది..అంతేకానీ..స్కూళ్లు ఓపెన్ చేయడమే తప్పన్నట్లుగా భావించ కూడదు
x

Comments