సిటీ ఎన్నికలు మా పాలనకి ఓ రకంగా రిఫరెండమే...కేటీఆర్ డేరింగ్ కామెంట్

 


ఎంత వివేచనో..అంతటి అహం..ఎంత మాటకారో..అంత దూకుడు..ఎంత దర్పమో..అంతటి చాకచక్యం..ఇవన్నీ కేటీఆర్ ని చూస్తే వెంట వెంటనే తడుతుంటాయ్..ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే ఇదే అన్పించింది..ఐతే పృచ్ఛకుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎస్..74లక్షలమంది ఓటర్లు పాల్గొంటున్న ఎన్నికను మూడ్ ఆఫ్ ది పీపుల్ గా తప్పకుండా అంగీకరించాలి అని జవాబు ఇచ్చాడు..ఇంకో నాలుగు రోజుల్లో పోలింగ్ పెట్టుకుని ఇలా మాట్లాడటానికి కాస్త ధైర్యం కావాలి..ఎందుకంటే దానికి ముందే ఆయనే డిసెంబర్ 4న ఏం జరుగుతుందో చూడండి అని చెప్పాడు..ఆ తర్వాత

ఆ మాట అనాల్సిన అవసరం లేదు..ఐనా ఇలా చెప్పడాన్ని తన కాన్ఫిడెన్స్ అనుకోవాలి..తారుమారైతే..ఇదే మాటని

ఆయనపైకి రివర్స్ లో వాడటానికి ప్రత్యర్ధులు రెడీగా ఉంటారు కూడా..మరి ఇదే మాటని దుబ్బాక రిజల్ట్ విషయంలో మాత్రం ఎందుకు చెప్పలేదో తెలీదు..ఏదెలా ఉన్నా...కూడా...జిహెచ్ఎంసి ఎలక్షన్స్ రాబోయే రోజుల్లో ఇక వార్డు ఎన్నికలు కూడా ఖరీదుగా మారాయనడానికి ట్రైలర్ గా మారాయ్..తర్వాత పంచాయితీ ఎన్నికలు కూడా ఇలానే ఉంటాయేమో...

మామూలు జనం పోటీకి దిగే రోజులు కావు ఇవి..

Comments