కాంగ్రెస్ ను ఖతం చేయడమే బిజెపి టిఆర్ఎస్ జాయింట్ ఆపరేషన్

పోటీ మా మధ్యనే ఉండాలి...విజేత మేమే కావాలి..ఇదే బిజెపి, టిఆర్ఎస్ కలివిడి వ్యూహంలా ఉంది..ఓ వైపు కాంగ్రెస్సే తమ టార్గెట్ అని కేసీఆర్ అంటాడు..ఎంఐఎంనే తమకి పోటీ అని బిజెపి అంటోంది..వాస్తవానికి ఉంటే ఈ రెండు పార్టీలే
ఉండాలని రెండు పార్టీల అధినేతల ఆలోచన అంటారు..అందుకే దుబ్బాకలో కాంగ్రెస్ ని ఈజీగా ఓడించారు
ఇక ఆల్టర్నేటివ్ తామే అని బిజెపి చెప్పుకోవడం..టిఆర్ఎస్ అబ్యంతర పెట్టకపోవడం ఇదే అనుమానం కలిగిస్తుంది

ఐతే ఇక్కడే బిజెపిని పాపం కేసీఆర్..అక్కడ జగన్ లైట్ తీసుకుంటున్నారు..అనకొండ తోటి పాములను తినకుండా వదిలేస్తుందా..అక్కడిదాకా వస్తే అప్పుడు చూసుకుందామని ఈ ఇద్దరూ అనుకుంటున్నారా..
టిడిపిని తెలంగాణలో లేకుండా చేసారు..ఏపీలో అలాంటి ప్రయత్నమే జరుగుతుంది..ఏపీలో కాంగ్రెస్ లేకుండా పోయింది ఇక తెలంగాణలోనూ అదే చేద్దామనేది టీఆర్ఎస్ ప్లాన్..మొత్తంగా చూస్తే..కాంగ్రెస్ ఉండకూడదు..తామే నెక్స్ట్ కావాలనేది బిజెపి ప్లాన్..ఈ ప్లాన్లలో గోలలో అసలు చావుకొచ్చింది మాత్రం జనాలకే

Comments