జగన్ రాజకీయం రాజవంశీకులను రోడ్డుపైకి లాగితే..చంద్రబాబు విజన్ ఆశోక్ గజపతిరాజుకు ఛైర్మన్ గిరీని శాశ్వతంగా దూరం చేసేలా ఉంది

 


అనగనగా ఓ రాజు గారు..ఆయనకి కొడుకులు..కొడుకులకు పెళ్లాలు..( తప్పు కాదు..ఒకాయనికి ఇద్దరు మరి)

ఓ కొడుకు రాజుగారు తమ సంస్థానంలోని విద్యాసంస్థలకు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు..ఈయనే అశోక్ గజపతి రాజుగారు ఈయన రాజకీయాల్లో నిలవడానికే( గెలుపు, ఓటమి కాదు) తన ఆస్థంతా అమ్మేసుకుంటుంటారని..మాజీ ముఖ్యమంత్రి రోశయ్యగారు ఓ సందర్భంలో చెప్పారు..మరి ఇప్పుడు రాజులు పోయారు..రాళ్లే కాదు..ఇంకేమీ మిగల్చకూడదనుకున్నారో కానీ..అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ నేతలు..ఇక్కడ ఓ వారసురాలిని డంప్ చేశారు..

ఈమె పేరు సంచయిత..సరే దింపారు..తమకి అధికారం ఉంది కాబట్టి ఛైర్మన్ గా ఆమెని చేసేశారు.. దీనిపై చంద్రబాబుగారు

ట్విట్టర్ వేదికగా బాగా గెలకడం ప్రారంబించారు..కరోనా లేకపోతే చాలా చేసేవాళ్లే కానీ..ఏం చేస్తారు..పైగా పిల్లకాకి( బాబుగారి దృష్టిలో) సంచయిత ఆయనకే ఝలక్ ఇచ్చింది..మహిళా సాధికారికత గురించి లెక్చర్లివ్వడం కాదు..నేనూ వారసురాలినే..సుప్రీంకోర్టు కూడా మాకు వారసత్వపు హక్కు ప్రసాదించింది దాన్ని గుర్తించరా..అని..ఐతే ఇక్కడ

చనిపోయిన రాజుగారి మొదటి భార్య కుమార్తె సంచయిత..రెండో భార్య కుమార్తె ఊర్మిళ ఎంట్రీతో విషయం కాస్తా మీడియాకి కావాల్సినంత పండగ చేస్తోంది..ఎందుకంటే ఇద్దరూ అందగత్తెలే..చేదుగా ఉన్నా..ఎవడికి నచ్చినా నచ్చకపోయినా ఇదే నిజం..వాళ్ల బ్యూటీనే తమ టిఆర్పీకి క్యాష్ చేసుకుంది..పైగా విషయం కూడా సరుకున్న టాపిక్కే..

ఇంకేముంది చర్చలు..ఇంటర్వ్యూలు..ఈలోపే ఇంకో చచ్చుబండ రాజు అసలు నే చెప్తా సంచయిత స్టోరీ అంటూ బిల్డప్పులిస్తూ..స్టోరీ చెప్పాడు..సంచయిత తల్లి, రాజు గారి మొదటి బార్య ఎప్పుడో ఇక్కడ్నుంచి వెళ్లిపోయింది..ఆ  పిల్ల కూడా తన స్టెప్ ఫాదర్నే తండ్రిగా చెప్పుకుంటోంది అంటూ తన వెకిలితనం ప్రదర్సించాడు..ఓ వేళ ఇదే విషయంపై సంచయిత ఫోకస్ పెడితే..మనోడికి వేధింపుల చట్టం ప్రయోగించబడుతుంది..అది వదిలేద్దాం..

వాస్తవానికి చంద్రబాబుగారు కోరుకున్నది పెదరాజు వారసత్వం...తమ్ముడు అశోక్ గజపతిరాజుకు కొనసాగించేలా చేయాలని..కానీ ఇక్కడ జ రుగుతున్నది ఏంటంటే..రాజవంశీకులు రోడ్డున పడ్డారు..ఇద్దరు యువతులు వారసత్వం కోసం కోర్టులో తేల్చుకుంటారు..చివరికి అది ఇద్దరిలో ఒకరికే దక్కుతుంది..అంటే అశోక్ గజపతిరాజుగారికి ఇక ఛైర్మన్ గిరీ దక్కడం ఇప్పట్లో కుదరకపోవచ్చు..ఎందుకంటే పెదరాజుగారికి వారసులు ఇప్పుడు ఊర్మిళ, సంచయితలుగా మాత్రమే ఎస్టాబ్లిష్ మెంట్ జరిగిపోయింది..ఓ వేళ ఊర్మిళ ఎంట్రీ వెనుక చంద్రబాబుగారున్నా...ఆయన చెప్పినట్లైతే ఊర్మిళ నడుచుకోదు..సాఫ్ట్ గా కన్పిస్తున్నారు కాబట్టి ఇద్దరినీ తక్కువ అంచనా వేయవద్దు..ఆల్రెడీ సంచయిత 2018లోనే బిజెపిలో చేరింది..ఊర్మిళ కూడా ఛాన్స్ ఇస్తే పాలిటిక్స్ లో రావడం ఖాయమంది..

Comments