ఆర్నాబ్ ఏమైనా చట్టాలకు అతీతుడా..ఛానల్ లో కూర్చుని గొంతు చించుకుంటే...ఏం చేసినా వదిలేయాలా

 ప్రశ్నించే గొంతుని నొక్కుతారా..అంట...ఎవరు ప్రశ్నించే గొంతు..మనకి ఇష్టం లేనోళ్లు...అప్పోజిషన్ పార్టీలపైపడి నోరు పారేసుకుంటూ..జుట్టు ఎగదోసుకుంటూ..ఛానల్ ఉంది కదా..డబ్బు ఉంది కదా..పవర్ ఉంది కదా అని రెచ్చిపోేయేవాళ్లంతా

జర్నలిజం ముసుగులో ఏం చేసినా సరిపోతుందా...ఇది ఒక్క ఆర్నాబ్ మాత్రమే కాదు..ఇలాగ గొంతు చించుకునే గార్ధభముత్తులు..పెంటతృష్ణలకూ ఇదే గతి పట్టాలి..ప్రతిసారీ మీడియాపై దాడి అంటూ అరవగానే ఎవడూ నమ్మడిక్కడ

సుశాంత్ సుూసైడ్ కేసులో తెగ రెచ్చిపోయి ముంబై పోలీసులు దద్దమ్మలు...సిబిఐకి ఇవ్వాలి..అంటూ రెచ్చిపోయిన తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు...అప్పటికీ ఓకాయన మొత్తుకంటూనే ఉన్నాడు..బాబూ...ముంబై పోలీసులను ఎంక్వైరీ చేయనీయండి...ఆ తర్వాత ఔట్ కమ్ నచ్చకపోతే సిబిఐకి ఇద్దురు అని..అబ్బే వింటేనేగా...చివరికి ముంబై పోలీస్ చెప్పిందే..సిబిఐ కూడా చెప్పింది..పైగా ఈలోపున వాడ్ని అరెస్ట్ చేయండి..వీడ్ని అరెస్ట్ చేయండంటూ మన ( ప్రభుత్వ) వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు ఇతగాడు చేసిన హంగామా దెబ్బకి ఇప్పుడు ఇతర జర్నలిస్టులు కోట్లకి కోట్లు నష్టపరిహారం కేసుల్లో ఇరుక్కున్నారు..ఇంత చేసి ఈయన పై కేసులు ఉంటే అరెస్ట్ చేయకూడదు

అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తే..అంత చట్టంపై నమ్మకం ఉన్న పోటుగాడు పోకూడదా..అంటే వాళ్లే తోసుకుపోవాలి..దానిపై మళ్లీ ఓ వారం రోజులు గెంతులు వేస్తూ..ఛానల్ నడుపుకోవచ్చనేగా


అసలు ఈ కేసు ఏంటో చూద్దాం

అన్వయ్ నాయక్ అనే 53ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్..2018 మే 5న సూసైడ్ చేసుకుంటూ..ఓ నోట్ పెట్టాడు..ఇదిగో ఇతగాడి వల్లనే మేం చనిపోతున్నాం అంటూ..అందులో మరో ఇద్దరి పేర్లు కూడా ఉన్నాయ్...ఫిరోజ్ షేక్. నీటీష్ సర్దా( నితీష్ సర్జా కూడా కావచ్చు) కారణం ఏమిటయ్యా అంటే...ఐదున్నర కోట్ల రూపాయల మేర పనులు చేయించుకుని డబ్బులు ఎగదొబ్బారుట..అలీబౌగ్ ఫామ్ హౌస్ లో ఓ ర ోజు ఉరేసుకుని చనిపోయాడు..అలానే ఆయన తల్లి 83ఏళ్లావిడ ఆమె కూడా చనిపోయి కన్పించింది అదే రోజున కంకోర్డ్ కంపెనీ పేరుతో చేసిన  ఈ పనంతా రిపబ్లిక్ టివి ఇంటీరియర్ డిజైన్, ఫిరోజ్ షేక్ కి సంబంధించి ఐ కేస్ట్స్స్ , నితీష్ సర్జాకి సంబంధించిన స్మార్ట్ వర్క్స్ వి..అర్నాబ్ 83 లక్షలు..

ఫిరోజ్ షేక్ 4 కోట్లు..నితీష్ సర్జా 55 లక్షలు ఇవ్వాలి..ఇవ్వలేదట..

ఇతగాడు చెప్పే రీజన్..సమన్లు ఇవ్వలేదట..ముంబై పోలీసుల వెర్షన్..ఈ గలీజుగాడు చేసిన క్రైమ్ చాలా తీవ్రమైనది కాబట్టి సమన్లు అక్కర్లేదు..అంతే ముగ్గురని మక్కెలు విరగదన్నలేదు కానీ..బొక్కలోకి మాత్రం నెట్టారు..చేతనైతే ఇప్పుడు తీరిగ్గా రిపబ్లికి టీవికి ఆర్నాబ్  సలహా ఇవ్వొచ్చు..ఈ కేసులో సిబిఐని పిలవండి..ఇదిగో నన్ను ఇలా ఇంటరాగేట్ చేయండి..ఇదిగో అర్నాబ్ అసలు ఎందుకు డబ్బు ఎగ్గొట్టాడు..అన్వయ్ నాయక్ ని అర్నాబ్ చంపేశాడు..చచ్చేలా చేసాడా..ఏది ఇందులో పెద్ద తప్పు..దేనికి ఎంత శిక్ష పడుతుందో కూడా సెక్షన్ల వారీగా బ్రేకింగ్స్ నడపమనండి.. అబ్బే అలా ఎలా చేస్తాం...

ఇంట్రెస్డింగ్ గా బిజెపి ఆరోపిస్తున్నట్లు ఇందులో ఎలాంటి పగ ప్రతీకారం లేదు..ఎందుకంటే ఈ ఏడాది మే నెలలోనే 

అన్వయ్ నాయక్ భార్య మహారాష్ట్ర హోంమినిస్టర్ ని కలిసి కేసుపై పురోగతి లేదని జోక్యం చేసుకోవాలని కోరితే..పోలీసులకు కేసు ఇన్వెస్టిగేషన్ పై ఫోకస్ పెట్టమని చెప్పారు..కాబట్టి..ఇదేదో సుశాంత్ ఎపిసోడ్ కి ముడిపెట్టి ఏదో రేటింగ్స్ పెంచుకుందామనుకుంటే పొరపాటు..సుశాంత్ డెత్ చోటు చేసుకుంది జూన్ 16న...

( ఓ వేళ నిజంగానే ప్రతీకారం ఉన్నా...అన్వయ్ నాయక్ చనిపోయిందైతే అబద్దం కాదు కదా...)

Comments

  1. మరి అస్తమానూ జలగ, మహా మేత భజన చెసే, పెట్టినప్పటినుంచి జలగ భజన, ఆత్మ స్తుతి పరనింద తప్ప మరేం చెయని మనస్సాక్షి పత్రిక అనే టాయిలెట్ పేపర్ని, చానల్ చండాలాన్ని, నీలాంటి వీపు గోకే గోడ పత్రికల ఓనర్ లని ఏం చెయ్యాలి, మక్కెలిరగొట్టాలి కదా న్యాయం గా

    ReplyDelete
  2. ఏమైనా ఈ రోజు రాత్రి టివిలు ప్రశాంతంగా ఉంటాయి.

    ReplyDelete

Post a Comment