ఆటలో అరటిపండు పవన్ కల్యాణ్-పరువు తీసే ఛాన్స్ ఇంకొకళ్లకివ్వడు

 

పోటీకి సై..ఆ తర్వాత దోస్తీ కోసం కుస్తీ..తర్వాత అసలు శాల్తీనే కన్పించకుండా తిరగడమంటే పవన్ కల్యాణ్ కే సాధ్యమవుతుంది..ఏదీ ఎక్కడ సందర్భశుద్ధి కన్పించదు..అమరావతిలో హైదరాబాద్ లో పోటీ గురించి మాట్లాడతారు..హైదరాబాద్లో తిరుపతి పార్లమెంట్ ఎంపీ సీటుకు పోటీపై ప్రకటనలు ఇస్తారు..ఢిల్లీ పోయి అమరావతి రాఝధానిగా ఉండేవరకూ పోరాటం చేస్తానంటారు..విపరీతమైన ఫాలోయింగ్ ..ఓ మాదిరి ఓట్లశాతం..ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీగా వ్యవహరిస్తోన్న జనసేనకి అసలు పవన్ కల్యాణ్ కాకుండా ఇంకొకరు లీడర్ అయితే..కనీసం కత్తి పద్మారావ్( మర్చిపోయారా), ఆర్.కృష్ణయ్య, కాసాని జ్ఞానేశ్వర్, లేదంటే కనీసం..కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు ఉన్నా చాలేమో..పార్టీని గందరగోళం లేకుండా నడిపించేవాళ్లు..కానీ ఈయనేమో తన సినిమా షూటింగ్ కోసం పోయి...పైకి తిరుపతి ఎంపి సీటుపై చర్చలంటూ బిల్డప్ ఇస్తాడు

ఇప్పుడు బిజెపితో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు మద్దతు అన్నాడు కదా..కనీసం ఒక్క జనసేన లీడర్ ఉన్నాడా బిజెపి వాళ్లతో..కన్పిస్తున్నాడా..ప్రసంగాలు చేస్తున్నారా లేదు కదా..మరి పవన్ గారు ఇచ్చే మద్దతు ఏంటి..పోనీ ఇతగాడేమైనా ప్రచారానికి పోతాడా..రేపు అంటే ఆదివారం ఒక్క రోజు..అంటే అదీ కుదరదన్నమాట..మరి ఆటలో అరటి  పండు అంటే ఏంటి..ఇది కాదా...

పాతికేళ్లు రాజకీయం చేస్తామంటే..ఆందులో ఆరేళ్లు ఇలా నాశనం చేసారు..పైకి మళ్లా ఎక్కడ కనబడ్డా కూడా..నాకోసం క్రియాశీలకంగా వ్యవహరించే కార్యకర్తలు కావాలి..వాళ్ల పనులు వాళ్లు చూసుకుంటూ పార్టీ కోసం పని చేసేవాళ్లు కావాలి..నాకు ఏదన్నా భయం లేదు..పోటీ కోసం భయపడను..ఏ ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీ చేస్తాం..మాకు భయమన్నదే లేదు..అంటూ ఊగిపోతూ లెక్చర్లు..పోటీ చేస్తే ఓట్లు చీలుతాయంటూ ఓ వితండ వాదన..అసలు మీ నిర్వాకంతో మనకంటూ ఓట్లు ఇంకా మిగిలి ఉన్నాయా మహా ప్రభూ అని ఫ్యాన్స్ మింగాలేక కక్కాలేక చస్తున్నారు..

Comments