అబ్బ ఈరోజు మెట్రో ట్రైన్ జన్మ ధన్యమైంది...ఆయన జర్నీ చేసాడు

 

మెట్రో రైల్లో పవన్ కల్యాణ్ జర్నీ


మెట్రో రైలెక్కిన పవన్ కల్యాణ్


సిటీ అందాలు తిలకించిన పవన్ కల్యాణ్


ఛత్..నీ...ఇంతకంటే అధ్వాన్నపు వార్తలు ఉంటాయా...కారు..బస్సు , విమానం అంటే సరే...కావాలంటే సొంతంగా కొనుక్కుని జర్నీ చేయగల ఆస్తిపరులు  ఆశాపరులు ఉంటారు..కానీ మెట్రో కానీ..రైలు కానీ జర్నీ చేయాలంటే..మనం వాటి దగ్గరకు పోవాల్సిందే..అవి మన దగ్గరకు రావ్( నాకు తెలిసిన జ్ఞానంలో) ఏ వార్తా లేకపోతే..ఇలాంటి పనికిమాలిన బ్రేకింగులు పెట్టే ఛానళ్లనుంచి మనం తెలుసుకునే సమాచారం ఏదీ ఉండదు..ప్రతీదానికి భూకంపం వచ్చింది..జల ప్రళయం వచ్చేసింది మీరు చస్తారు అన్నంత రేంజ్ లో బిల్డప్ తప్ప



పైగా ఆయనేమైనా ముఖ్యమంత్రా...ప్రధానమంత్రా..రాష్ట్రపతా...ఏదీ కాదు..వీళ్లంతా జనంలో కలిసి నడిచారంటే అదో వార్త..మరెందుకు ఈ తపన..పవన్ కల్యాణ్ క్రేజున్న హీరో కాబట్టి..ఏ వార్త వేసినా జనం చూస్తారనే పిచ్చ భ్రమ..
పైగా ఓ ఛానల్ అయితే..ఆయన మాస్క్ కూడా పెట్టుకున్నారు..అట..మాస్క్ పెట్టుకోకపోతే..ఏం జరుగుతుందో తెలుసు కాబట్టే పెట్టుకున్నాడు..ఐతే ఏంటి...ఎవరూ లేకపోతే తీసేస్తాడు..దానికేంటి..అది కూడా పెద్ద ఘనతలాగా చెప్పొద్దు..

Comments

  1. గాంధీ మళ్లీ పుట్టాడు అనే దరిద్రపు కంపు కంటే ఇది కాస్త ఇంపుగానే ఉంది. మనకి నచ్చనిది వార్తే కాకూడదు అంటే ఏ అడవిలోకో పోయి బ్రతకడం మేలు!

    ReplyDelete
  2. అత్తారింటికి దారేది సినిమాలోలాగా మెట్రో స్టేషన్ మొత్తం ఖాళీ చేయించినట్లు ఫీలయిపోతున్నారే!
    మెట్రో రైళ్ళు ఎవరూ ఎక్కడం లేదు అని వార్తలొస్తే మెట్రో రైల్ ఎక్కడం సేఫ్ అని చేసి చూపించారు. వరదలొస్తే హోం మంత్రి(ణి) విహంగ వీక్షణం చేసినా వార్తే మరి !

    ReplyDelete

Post a Comment