ఇలాంటి మాటలతోనేనండి బాబూగారూ మీపై జనానికి మొహం మొత్తింది..అమెజాన్ మీ వల్ల వచ్చిందా


చంద్రబాబుగారు ఇక మారరు..కన్ఫామ్..కావాలంటే చూడండి..అమెజాన్ వచ్చింది ఆయన వల్లనేనట..టిడిపి విజన్ వల్లనే అట..ఇంతకంటే దుర్మార్గం ఏదైనా ఉందా..? మరిదే విజన్..ఏపీలో ఎందుకు ఏమీ చేయలేకపోయాయ్..2004 వరకూ మీరు చేసిన పనులతోనే..హైదరాబాద్ లో 16 ఏళ్ల తర్వాత కూడా అన్నీ మీ వల్ల వస్తుంటే..ఏపీలో ఎందుకు ఏమీ రాలేదు..సరే ఇప్పుడంటే జగన్ ని చూసి కార్ొరేట్లు ప్యాంట్ తడుపుకుంటున్నారు..వచ్చే వాళ్లు కూడా పారిపోతున్నారు..మరి 2019 వరకూ మీరే కదా ఉంది..అప్పుడెందుకు ఏమీ తీసుకురాలేదు..ఓహో ఇప్పుడు వచ్చేవన్నీ కూడా అలా తమ దయతోనే వచ్చాయంటారా..ఈ మాటలు కేవలం మీ కేడర్ కి తప్ప బయట జనాలకు ఎంత వినోదం పంచుతున్నాయో తెలుసా..ఇదొక్కటి చాలు జిహెచ్ఎంసి ఎలక్షన్స్ లో మీ పార్టీని టిఆర్ఎస్ ఓ ఆట ఆడించడానికి..ఇలా చేయకండయ్యా..
కావాలంటే టిఆర్ఎస్ కి ఆరేళ్లైంది అధికారం కట్టబెట్టి..ఇంకా రోడ్లు ఇలా ఎందుకు ఉన్నాయని అడగమనండి..ఇంకా ఎందుకు రియాల్టీ మోసగాళ్లు రెచ్చిపోతున్నారని అడగమనండి..ఇంకా ఎందుకు ప్రతి ఇఁటీకి వాటర్ కనెక్షన్ ఇవ్వలేకపోతోందో అడగమనండి..డబుల్ బెడ్ రూమ్స్ ఎన్ని ఇచ్చాయో అడగమనండి..అబ్బే అవి వదిలేసి..ఈలాంటి..( మీభాషలోనే) ప్రకటనలు చేయకండి..ఎందుకంటే టీఆర్ఎస్ బాసుకు మండుకొచ్చిందంటే..హైటెక్ సిటీ ఎవరు ఓపెన్ చేసారు..దానికి ఎవరు పునాదిరాయి వేశారు..ఎందుకు వేశారు..లాంటి హిస్టరీ అంతా మరోసారి తవ్వేస్తారు..మన బండారం బైటపడుతుంది..అసలు అమెజాన్ అనే ఈ కామర్స్ సంస్థ వెబ్ సర్వీసెస్ ఇక్కడ పెట్టడానికి మీ విజన్ కి ఏంటండి సంబంధం..టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కినవేళ..ఎక్కడ మ్యాన్ పవర్ ఉందో..అక్కడకు వస్తున్నాయ్ సంస్థలు..అంతేకానీ..అప్పుడెప్పుడో హైటెక్ సిటీ ( మీరు కట్టలేదు) నావల్లే వచ్చింది..అందుకే ఇప్పటికీ వచ్చేవన్నీ నా వల్లనే వస్తున్నాయని చెప్పకండి..పైగా ఇదంతా కూడా ఫారిన్ డైరక్ట్ ఇన్వెస్ట్ మెంట్స్ రూపంలో వచ్చేవి..మీ రాష్ట్రప్రభుత్వాలకు సంబంధం లేని రూట్ ...కేవలం కేంద్రప్రభుత్వాల పాలసీల్లో మార్పులతోనే ఇలాంటి పెట్టుబడులు వస్తాయ్..దానికి మీరేసిన రోడ్డుని ఆధారంగా చూపొద్దు..
మన గొప్ప మనం చెప్పుకోకూడదు..ఇవతలివాళ్లు చెప్పాలి..వాళ్లు చెప్పలేదా..వదిలేయాలి..ఈలోపే ఆత్రంగా మన భజన మనమే చేసుకుంటే ఎలా..ఇంకా నయం హైదరాబాద్ కి వరదలు కూడా మన విజన్ తోనే అని చెప్పలేదు..

ఎందుకంటే..మీరు కట్టిన సైబరాబాద్కి డ్రైనేజీ సిస్టమే లేదు..దాంతోనే ఈ ప్రాంతాల్లో చుక్క నీరు పడ్డా గంటల కొద్దీ ట్రాఫిక్ జామయ్యేది..

 

Comments