కొత్త స్ట్రెయిన్ అట..మరి టీకా మళ్లీ తయారు చేయాలా..భారత్ బెంబేలు పడాలా వద్దా..!


 కొత్త వైరస్ స్ట్రెయిన్ గురించి ఇప్పటిదాకా మనకేం తెలుసనేది పక్కనబెడితే..ముందుగా లండన్లో దీనికి బి డబుల్ వన్ సెవెన్ అనే పేరు పెట్టారు..సెప్టెంబర్ 20,21 తర్వాత కెంట్ లో కనిపెట్టారు..అంతేకాదు.. సార్స్ కోవిడ్ 2 వైరస్ లో 23 రకాలుగా జన్యు క్రమంలో తేడాలు వచ్చాయని గమనించారు..అంతేకాదు వీటిలో 17  ఉత్పరివర్తనాలు 

వైరస్ సంక్రమించే తీరు..అది పేషెంట్లలో కలిగించే మార్పులపై ప్రభావం చూపిస్తాయని కనుక్కున్నారు..వీటిలో స్పైక్ ప్రోటీన్ కూడా  ఒకటి..అంటే దీని ద్వారా మన సున్నితమైన కణజాలంలోకి వెళ్తుందని ఇప్పటిదాకా అనుకున్నారు కదా..అలానే కాదు ఇంకోలా కూడా సంక్రమించవచ్చు..స్ప్ర్రెడ్ అవ్వచ్చు అని ఇక్కడే..ఓ పాయింట్ గమనించాలి..స్పైక్ ప్రోటీన్ ఆధారంగానే వ్యాక్సిన్ తయారీ చాలా చోట్ల బేస్ అయింది..మరి ఇదెలా జరిగిందయ్యా అంటే..ఏదోక పేషెంట్లో ప్రవేశించిన వైరస్ అనేక రకాలుగా మారిపోయి..ఇమ్యూన్ సిస్టమ్ ని బాగా దెబ్బతీసి..అక్కడ్నుంచి ఇంకొకరికి  అలా స్ప్రెడ్ అవుతూ బలం పుంజుకుంది..లేదంటే త్వరగా వ్యాపించే గుణాన్ని సంతరించుకుంది..ఐతే లక్కీగా చాలామంది చెప్పడం ఏంటంటే..వైరస్ స్ట్రెయిన్ రూపాంతరం ఉత్పరివర్తనం చెందినా కూడా..ఇప్పటిదాకా ఇచ్చిన ట్రీట్ మెంట్ కి లొంగుతుందని

ఎంత వేగంగా సంక్రమిస్తుందంటే..నవంబర్ లో వచ్చిన కేసుల్లో 28శాతం..డిసెంబర్ లో 62శాతం కేసులు బీ డబుల్ వన్ 7 స్ట్రెయిన్ తోనే వచ్చాయ్..ఐతే స్కాట్ లాండ్ లో వేల్స్ లో తక్కువ స్థాయిలో ఉందంటున్నారు..శాతాల సంగతి కాసేపు పక్కనపెడితే..అసలు మనుషుల ప్రవర్తనతోనే దీని వేగం ఎక్కువ అవుతుందనే వాళ్లూ ఉన్నారు..ఎక్కడ పడితే అక్కడ దగ్గడం..తాకడం తుమ్మడం, మాస్క్ పెట్టుకుంటే ఒకలాగా..సోషల్ డిస్టెన్స్ పాటిస్తే ఒకలాగా వైరస్ వ్యాప్తి చెందుతుందని..ఈ రక్షిత చర్యలు పాటించకపోవడం వల్లనే ఈ వేగం నమోదవుతుందనే అంచనాలూ ఉన్నాయ్..

యూకే స్ట్రెయిన్ లాగా...డెన్మార్క్ లో 9..ఆస్ట్రేలియాలో 2,ఇటలీ..నెదర్లాండ్స్, ఐలండ్ లో ఒక్కోటి కన్పించాయ్..ఐతే ఇతర దేశాల్లో తక్కువ కన్పించడానికి ఓ కారణముంది ప్రపంచంలోనే ఇతర దేశాలకంటే ఎక్కువగా ఈ  స్ట్రెయిన్లపై రీసెర్చ్ చేస్తుంది లండన్ మాత్రమే ఇతర దేశాల్లో ఇలా వైరస్ రకాలపై స్టడీలు జరగడం లేదు..కాబట్టే ఇతర చోట్ల తక్కువ అని చెప్పొచ్చు..అంటే బైటపడం మాత్రమే..అసలు లేవు ఆనడానికి లేదు..

మరి వ్యాక్సిన్ ట్రయల్స్ ని ప్రారంభించారు..అలానే మోడెర్నా..ఫైజర్ ఆస్ట్రాజెనెకా డోసులు కూడా పడుతున్నాయ్ కదా..వాటిపై ఏదైనా ప్రబావం ఉంటుందా అంటే..ఖచ్చితంగా ఎందుకంటే ఈ వ్యాక్సిన్లు తయారీ చేసేనాటికి బి డబుల్ సెవెన్ ని ఐడెంటిఫై చేయలేదు..ఐతే స్పైక్ ప్రోటీన్ ని న్యూట్రలైజ్ చేసి..యాంటీబాడీలను డెవలప్ చేయడమే టీకాల ఉద్దేశం కాబట్టి..లండన్ ఇంపీరియల్ కాలేజ్ ప్రొఫెసర్ డానియేల్ ఆల్ట్‌మన్ చెప్తారు..కాబట్టి టీకాలకు వచ్చిన ఢోకా లేదంటారు..ఐతే యూకే ప్రభుత్వం దీర్ఘకాలంలో మాత్రం టీకాలు వేయించుకున్నవారి హెల్త్ కండిషన్ ని ఇతర వేరియంట్లకు కూడా ఇమ్యూనిటీ కలిగి ఉన్నారో లేదో పరిశీలించడం చేస్తుందని అంటున్నారు

కానీ కొత్త స్ట్రెయిన్ తో మాత్రం వైరల్ లోడ్ ఎక్కువగా ఉందని ఖచ్చితమైన ఆధారాలు కన్పిస్తున్నాయ్. అంటే కోరనా వైరస్ సోకినవారిలో ఈ  స్ట్రెయిన్ మరింత ఎక్కువ బాధని కలిగిస్తుందని తేలింది  మరి ఇప్పుడు 
ఇండియా ఏం చేయాలి

సెప్టెంబర్ 20 తర్వాత భారత్ కి వచ్చిన వాళ్లందరినీ గుర్తు పట్టాలి..ఆర్టీపీసిఆర్ టెస్టులు చేయించాలి మన వ్యాక్సిన్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోందనే ప్రశ్న రాకతప్పదు..ఏ మార్పూ ఉండదు..ఎందుకంటే కరోనా వైరస్ భవిష్యత్తులో మరింతగా మ్యూటేషన్స్..అంటే ఉత్పరివర్తనాలు చెందుతుందని మే నెలలోనే ప్రపంచదేశాల్లోని సైంటిస్టులు హెచ్చరించారు..అప్పట్నుంచే ఈ ప్రమాదాలను ఊహించే దానికి అనుగుణంగానే టీకాల తయారీ సాగింది..అందులో భాగంగానే ఇప్పుడు భారత్‌లో కూడా తయారవుతున్న వ్యాక్సిన్లు డిజైన్ చేయబడ్డాయని చెప్తున్నారు

ఇప్పుడు ఫైనల్ గా ఇంకో మాట..అసలు డిస్ట్రిబ్యూట్ అయ్యే టీకాలు కొత్త స్ట్రెయిన్ కాదు..ఉన్న స్ట్రెయిన్లకైనా సమర్ధవంతంగా పని చేస్తాయా లేదా..ఇదే ఆలోచించాలి..ఎందుకంటే పైకి 90శాతం..95శాతం పని చేస్తాయని చెప్తున్నా..ప్రపంచంలో ఇంతవరకూ ఏ టీకాకి 100శాతం కాదు..అసలు 80శాతం ఎఫికసీ..అంటే సమర్ధత ఉండదు..కొన్ని రకాల వైరస్ లకు ఇంతవరకూ వ్యాక్సినే లేదు..

మనం వేసుకున్న టీకా పని చేసిందీ లేనిదీ..తెలియాలంటే కనీసం ఏడాది ఆగాలి..అంటే టీకా వేయించుకున్న వ్యక్తికి ఏడాది వరకూ సదరు వైరస్ రాకూడదు..అలానే తర్వాత మరో ఏడాది..ఇలా కనీసం మూడేళ్ల పాటు చూస్తే..అప్పటికీ కరోనా వైరస్ రాకపోతే ఆ టీకా పని చేసినట్లు లెక్క..ఐతే మరి తయారు చేస్తున్న వ్యాక్సిన్లు ఎంతకాలం వరకూ రక్షణ కల్పిస్తాయన్నది ఇంతవరకూ ఏ కంపెనీ కూడా ప్రకటించలేదు..ఇలాంటి పరిస్తితుల్లో మన దగ్గరున్న పరిమిత ఆయుధాలు..మాస్క్..పరిశుభ్రత విధానాల అమలు..లేదంటే..వైరస్ సోకించుకుని దాన్నుంచి బైటపడేందుకు ట్రీట్ మెంట్ తీసుకుని బైటపడటం..


Comments