మరి సారా వారి కోడలు కూడా కొత్త పార్టీ పెడుతుందా..?

 


వైఎస్ షర్మిల అన్న మీద పగ తీర్చుకునేందుకు కొత్త పార్టీ పెడుతుందంటూ ఓ మేధావి తన ముందుచూపును..అసలు సిసలు జర్నలిజాన్ని జనాలకు రుచిచూపించాడు..మరి అదే కోవలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ రుబాబు చేసే ఓ పెద్దాయన కోడలు కూడా తెలంగాణలో పార్టీ పెడుతుందా...అని ఎవరైనా రాస్తే ఎలాగుంటుంది..

ఎందుకంటే సదరు రంగుమారిన పార్టీకి తెలంగాణలో దిక్కూ దివాణం లేకుండా పోయింది..నడిపించే లీడర్లు కాదు కేడరే కకావికలైపోయింది..మరి ఈ తరుణంలో ఆ తరుణీమణి తన భర్తకి పార్టీ పగ్గాలు ఇవ్వడం లేదనే దుగ్ధతో ఎప్పుడో ఆయనగారు చూపించిన వెన్నుపోరు బాటలోనే ఈమె కూడా సొంతంగా పార్టీ పెట్టుకునే ఛాన్స్ ని ఎవరైనా కాదనగలరా

ఎవడికైనా చిర్రెత్తుకొచ్చినా..వళ్లు మండినా..పిచ్చ ఎక్కి..పచ్చకామెర్లల రోగుల్లాగా రెచ్చిపోయినా..ఇలా రాస్తే మాత్రం ఠారెత్తుకురావడం ఖాయం..రేపో ఎల్లుండో ఆ స్థాయి ఎటాక్ వస్తే ఎలా డిఫెండ్ చేసుకోగలరో మరి...అంతే..మనం ఎవడిపైనైనా..ఏ  రాయైనా వేయవచ్చు..పైశాచికానందం పొందవచ్చును..కానీ అదే రాయి అంతకంటే బలంగా న్యూటన్ లా ప్రకారం వచ్చి మీద పడితే...వామ్మో ఊహించుకోవడమే కష్టం కదా..

Comments