ఎన్నాళ్లకెన్నాళ్లకి వెన్నెల్ల వచ్చింది మా కళ్లకి..గరుడపురాణం శవాజీ నీకు జోహార్లు

 


అటు తెలంగాణ ప్రభుత్వం కక్ష గట్టిందన్న ప్రచారం..మరోవైపు టివి9 షేర్ల క్రయవిక్రయాల్లో ఎయిర్ పోర్టుల దగ్గరే కొన్నిసార్లు పోలీసులు నిలిపివేసిన వైనం తప్ప ఈ మధ్యకాలంలో ఎక్కడా కన్పించని శివాజీగారూ( అంటే టివి ఛానళ్లకి అని అర్ధం) భలేగా ప్రత్యక్షమైపోయారు. 

విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ ఓ నినాదం ఓ ఉద్యమం మేం ఊహ కూడా తెలీని రోజుల్లో జరిగింది. తిరిగి ఇప్పుడు విశాఖ స్టీల్స్  ప్లాంట్ను ప్రవేట్ పరం చేస్తామంటూ కేంద్రం ప్రకటించగానే, బరిలోకి దిగడమే కాకుండా..తమ వాదనకి, అభిప్రాయాలకు, పురాణాలకు సరైన ప్రాముఖ్యత నిచ్చే ఛ ానళ్ల వెంటబడ్డారు. పాపం గతంలోనైతే ఇది నంబర్ వన్ ఛానల్లో జరిగేది. కానీ ఇప్పుడు మేనేజ్ మెంట్, దాంతో పాటే భజన పాలసీ కూడా మారిపోవడంతో..విధిలేని పరిస్థితుల్లో తమ వర్గం ఛానల్ గా ముద్ర బడిన ఛానల్స్లో మాత్రమే ఈయన వాయిస్ విన్పించాల్సి వచ్చింది.

ఐతేనేం శివాజీగారు చక్కగా తమ ఆవేదనని విన్పించారు..పనిలో పనిగా అటు యాంకరుడు..ఇటు తమపైనా సోషల్ మీడియాలో ఎలాంటి బూతులు వాడతారో కూడా చెప్తూ వాపోయారు..కరెక్టే సార్..సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోల్స్ కి అడ్డుకట్ట పడాల్సిందే కానీ..మరి అదేదో మీకు మాత్రమే పరిమితంలాగా మీపై దాడి చేసే వర్గం మాత్రమే కాదు..మీకు మద్దతుగా మాట్లాడే సోషల్ ట్రోలర్స్ కూడా మీ ప్రత్యర్ధి వర్గాలపై అదే రకమైన కామెంట్లు చేస్తున్నారని కూడా చెప్తే మీ మాటలకు గౌరవం హుందాతనం వచ్చేవి..అక్కడికేదో మీరే దేశభక్తులు..ఇతరులు కారన్నట్లు మాట్లాడితేనే జనం మిమ్మల్ని పట్టించుకోరు..
మీరు వద్దన్నా..కేంద్రం తాను అనుకున్నది తాను చేస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు..విశాఖ ఉక్కు ఎక్కడికీ తరలిపోవడం లేదన్న మాట కూడా గుర్తుంచుకోవాలి..విశాఖ స్టీల్ ప్లాంట ్ఉద్యమం లక్ష్యం వేరు..ఇప్పుడు మీరు చెప్తున్న లక్ష్యం వేరు. ప్రవేటీకరణ తప్పదు.దానికి రాష్ట్రప్రభుత్వం వ్యతిరేకించాల్సిందే..అంత మాత్రాన ఇక్కడున్న ప్రభుత్వం ఏదో దగ్గరుండి ఆ పని పూర్తి చేస్తుందనే భ్రమలను మీరు జనంలోకి తీసుకెళ్లడం మానాలి..అదే నిజమైతే నష్టాలను సాకుగా చూపించి ఆర్టీసిని ఎప్పుడో మూసేయాలిగా..అది చేయకుండా ప్రభుత్వంలోకి ఎందుకు కలుపుకున్నారు.. కేవలం మన ధృక్కోణంలోనే అవతలివారి ప్రవర్తనని చూడొద్దు..ఎటూ మీ జనసేన, మీ బిజెపి, మీ టిడిపి ఉద్యమాలు చేసేస్తాయ్ కాబట్టి వారికి మద్దతుగా నిలవండి..ప్రవేట్ కంపెనీల పరం కాకుండా చూడండి..దానికి ప్రభుత్వం కూడా మద్దతు పలుకుతుందో  లేదో చూద్దాం..

Comments