కాంచన అంటే లారెన్స్ సినిమా కాదు..అర్జున్ రెడ్డిలో విజయ్‌కి నానమ్మ కాదు సామీ..ఆమెకంటూ ఓ హిస్టరీ ఉంది


 సాక్షి పత్రిక  ఎంత దివాళకోరుగా నడుస్తుందనడానికి ఇదో చిన్న ఎగ్జాంపుల్..ఓ వైపు జగన్ కి మైలేజీ తేవడం మాట పక్కనబెడితే..ఇలాంటి వార్తలు రాసేటప్పుడు కాస్తైనా జ్ఞానం, అనుభవం ఉన్న వాళ్లు రాయవద్దా..?


హెడ్డింగ్ వరకూ ప్రముఖ నటి అని పెట్టారు..బానే ఉంది కానీ..ఆమె ఎవరో ఏంటో ఇప్పటి ప్రేక్షకులు కాదు..అసలు ముందు రచయితకైనా తెలుసా అనే డౌటనుమాన సందేహం వస్తోంది..కాంచన జస్ట్ అర్జున్ రెడ్డిలో  విజయ్ కి నానమ్మ..బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో నటి మాత్రమేనా..

అంత హడావుడిగా న్యూస్ రాయాల్సిన అవసరం ఏముంది..కాంచన అంటే ఓ బ్యూటీ క్వీన్..కాంచన అంటే ఎన్టిఆర్, ఏఎన్నార్, కృష్ణ,శోభన్ బాబు ఇలా బోలెడుమంది దిగ్గజ నటుల సరసన నటించిన హీరోయిన్, బ్లాక్ అండ్ వైట్ కాదు..ఫస్ట్ ఈస్టమన్ కలర్..(రేవా) అవేకళ్లులో హీరోయిన్ ఆమే..అప్పటి తరం నటీమణుల్లో ఇప్పటికీ బతికి ఉండి అడపాదడపా నటిస్తున్న యాక్ట్ర్రెస్ కూడా ఈమేనేమో బహుశా. కనీసం తెలుగులోనే వంద సినిమాల్లో హీరోయిన్గ గా నటించి ఉంటుందామె..పాతనీళ్లని కొత్త నీళ్లు వెనక్కి నెట్టడం మామూలే కానీ..మరీ ఇంతలా ఫలానావాడికి బామ్మ క్యారెక్టర్ ..ఫలానా సినిమాలో అమ్మమ్మగా చేసింది అనేంత అనామకురాల్లిగా రాయడం దారుణం. ఓ వేళ ఇప్పటి తరానికి ఏమీ తెలీదని రచయిత ఉద్దేశమైతే అది శుద్ధ తప్పు


Comments