విజయశాంతి లెక్కలే వేరు ఈ సారైనా ఫలిస్తాయో లేదో..! ఉగ్రవాదులు వెంటబడితే జయలలిత సేవ్ చేసిందా.వామ్మో!

  


నవరసనాయిక విజయశాంతి నటించడం మానేసి చాన్నాళ్లైంది..ఈ కామెంట్ కరెక్టే..

సినిమాల్లో కంటే రాజకీయాల్లోనే ఆమె ఎక్కువ నటిస్తోంది..ఈ కంక్లూజన్ కూడా కరెక్టే 

సరి లేరు నీకెవ్వరూతో లైమ్ లైట్లోకి వచ్చేసి..తర్వాత బిజెపిలోకి చెక్కేయడంతో మంచి ఊపుమీదున్నట్లు కన్పిస్తోన్న విజయశాంతి ఇప్పుడు ఏకంగా తమిళనాడు పాలిటిక్స్ పై కూడా మరోసారి కన్నేసినట్లు కన్పిస్తోంది. జయలలిత జయంతి సందర్భంగా అంటూ ఆమె పెట్టిన ఓ ట్వీట్( ఆమె  టీమ్) దీనికి నిదర్శనం. జయలలిత అప్పట్లో ఆమెని పురచ్చతలైవి సోదరిగానూ..ప్రచార ఫిరంగిగానూ వర్ణించిందట..పైగా అప్పట్లో ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో కూడా విజయశాంతి ఉందన్నట్లుగా ఆ ట్వీట్ సాగింది. 

నాయనా..అసలు విజయశాంతి ఉగ్రవాదుల జోలికి ఎందుకు వెళ్లిందిరా సామీ ..కొంపదీసి పోలీస్ లాకప్, భారతరత్న, వైజయంతి ఐపిఎస్ మున్నగు సినిమాల్లో టెర్రరిస్టుల పుచ్చ పగలగొట్టినందుకు కాదు కదా..!  ఓ వైపు జయలలితని గుర్తు చేసుకుంటున్నట్లే బిల్డప్ ఇస్తూ తన ఇమేజ్ , డబ్బా కొట్టుకోవడమే కన్పిస్తుంది ఈ ట్వీట్లో..ఇంతకీ బిజెపి తమిళనాడులో అన్నాడిఎంకేని అడ్డం పెట్టుకుని పవర్ చలాయించాలని చూస్తుంది కాబట్టి..ఆ క్రమంలో తనకి కూడా కాస్త పెద్ద పాత్ర దక్కుతుందని కానీ విజెశాంతి ప్లాన్ కాదు కదా..! కానీ ఇలా చేసే గతంలో ఏపీకి ఇటు తమిళనాడుకు ఎటూ కాకుండా పోయింది. తర్వాతేదో దాసరిగారి పుణ్యమాని ఒసేయ్ రాములమ్మాతో తల్లి తెలంగాణ వరకూ ఎదగగలిగింది. ఇంతకీ అప్పట్లో ఆమె వేసిన ప్లాన్ ఏంటనా..

1999కి ముందు తమిళనాడులో అక్కడి నటీనటుల సంఘం తరపున పెద్ద శిబిరం వేసుకుని మరీ దక్షిణాది నటుల ఉద్యమం ఒకటి నడిచింది దానికి విజయశాంతి హాజరై..తాను ఇక్కడి నటినేనంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తెలుగుదేశానికి వచ్చి( ఏపీకి అని అర్ధం) ఇదే పలుకు పలికింది. దీంతో ఆమెని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ఓ వైపు తెలంగాణలో బిజెపికి సౌండ్ అవుతానంటూ చెప్పి..మళ్లీ జయ స్తోత్రంతో అరవోళ్లకి దగ్గరవుదామనే  ప్లానేసినట్లుంది. తీరా రెండు రాష్ట్రాల పెద్దలూ పట్టించుకోకపోతేనే, మళ్లీ మరో ఐదేళ్లు ఎదురు చూడాల్సి వస్తుంది

Comments