వలంటీర్లు వద్దు మరి..ఈ కరోనా సంగతేంటి

 


ఏపీలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ తనకి ఉన్న అధికారంతో ఇలా చేసింది.ఓకే. అంతవరకూ నో ప్రాబ్లెమ్, కానీ వాళ్ల ఫోన్లు కూడా లాక్కోవడం ఏంటట..ఇవి ప్రభుత్వం ఇచ్చినా, పర్సనల్‌గా కొనుక్కున్నా, మొబైల్ ఫోన్లలోని డేటా దుర్వినియోగం అవుతుందంటూ ఇలాంటి ఆదేశాలు బహుశా ఎక్కడా ఇచ్చి ఉండరు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం. పైగా వలంటీర్లంతా వైఎస్ జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ఉన్నారనే కదా కొన్ని వార్తా ఛానళ్లు ఆ మధ్య తెగ హడావుడి చేశాయ్. మరి ఇక ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్లెందుకు వ్యవహరిస్తారు..పాయింట్ నంబర్ వన్


ఇక పాయింట్ నంబర్ 2..రేషన్ సరుకుల డెలివరీ కోసం రంగులు వేసారు కాబట్టి ఆపేద్దాం ఆన్నారు ఆపేసారు..మరి ఇప్పుడు కనీసం ఆ రేషన్ సరుకులు ఇంటింటికీ చేరకపోయినా, వాళ్లు వచ్చి తీసుకోవాలన్నా కూడా వలంటీర్ల సాయం లేనిదే కుదరదు, కాబట్టి అది కూడా ఆపేస్తారా ?  ఏ డేటా అయితే వలంటీర్ల ద్వారా లీకవుతుందని అనుకుంటున్నారో..అదే డేటా డీలర్ల దగ్గర ఉండదా..? మరి వాళ్లనేం చేస్తారు..ఊళ్లలోంచి పోయి కొండల్లో గుట్టల్లో పడుకోమంటారా..? తమాషా కాదు..వైఎస్ జగన్ ప్రభుత్వం అధికార దర్పంతో ఏదేదో చేస్తుందనే ఆరోపణలు, దానిపై చర్యలు సరే..కానీ ఇలాంటి పెడ ధోరణితో అంతిమంగా ఏ ప్రజల కోసం లాభమని ఎస్ఈసీ చెప్తున్నారో ఆ జనాలకే ఇది పెద్ద దెబ్బ  పడుతుంది. సరుకులు అందవ్, పెన్షన్లు ఆగితే పరిస్థితి ఏంటి..పోనీ అసలు టార్గెట్ అదే అని వైఎస్సార్సీపీ ఆరోపించవచ్చు కానీ..ఈ కరోనా సంగతేంటంట..చాలా రోజుల తర్వాత వందకి దాటిన కేసులు నమోదు అయ్యాయ్. మూమెంట్ గతంలోలానే ఉంది కానీ..దేవుడి దయ వలన కోటి్న్నరమందికి టెస్టుల రూపేణా జనాభాలో 25శాతంమందికి తమ శరీరంలో వైరస్ ఉఁదో లేదో తెలుసుకున్నారు. మరో సగంమందికి వచ్చి పోయినట్లు సీరం సర్వేలు చెప్తున్నాయ్. మరి ఇలాంటి దశలో తిరగబెబడుతున్న కరోనా పేషెంట్లను ఎస్ఈసీ ఏమైనా దగ్గరుండి ఆస్పత్రులకు తరలిస్తుందా..మందులను చేరవేస్తుందా..

ఆ పని వలంటీర్లు బ్రహ్మాండంగా చేసారు కాబట్టే ఏపీలో ఎన్ని ఎక్కువ కేసులున్నా...ఇప్పుడు వందలోపుకు పరిమితం అయ్యాయ్. ఇలాంటి సిచ్యుయేషన్‌లో వలంటీర్లను ఎన్నికల విధులకు దూరం చేయండి కానీ..ఫోన్లు లాక్కుని శాడిజం ప్రదర్శించకండి

Comments