ఆ ఛానల్‌కి విశాఖ స్టీల్ ప్లాంట్‌కీ పోలికా..ఇదేందిరా సామీ ..ఎక్కువ సేపు కష్టపడి లాభాల్లోకి తెచ్చేస్తారట ఛానల్‌ని..

 

ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చిందనే సామెతలాగా( సామెతకి సందర్భానికి సంబంధం లేదు) విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారనే అంశంపై అటు బిజెపిని ఇటు వైఎస్సార్సీపీని ఇరుకునబెట్టవచ్చంటూ డిస్కో( డిస్కషన్ కి షార్ట్ ఫామ్)కి కూర్చున్న ఓ వైరముత్తుకు పాపం బిజెపి యువనేత విష్ణువర్ధన్ రెడ్డి ఇచ్చిన జలక్ తో ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కాని పరిస్థితి..అయినా కూడా ఓ ప్రవేట్ ఛానల్ యాజమాన్యం కష్టాలకు..ప్రభుత్వరంగ సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఎక్కడ పోలిక

ఇంతకీ సదరు విష్ణువర్ధన్ రెడ్డి ఏమన్నాడంటే..బాబూ ఫలానా మీ ఛానల్ కి అన్ని బ్రాంచులున్నాయ్..ఐనా నష్టాల్లో ఉంది..మరి ఈ స్థితిలో ముందుకు తీసికెళ్లాలంటే ఏదైనా పెట్టుబడి తెస్తావా లేదంటే నష్టాల్లో ఉన్నామని మూసేస్తారా..ఏదోలా నడిపించాలని చూస్తారా అంటూ షాక్ ఇచ్చాడు..దీనికి సదరు యాంకరుడు..తన తెలివితేటలన్నీ రంగరించి..మా టివి ఛానల్ మేనేజ్ మెంట్ ఉద్యోగులు వారిపై ఆధారపడిన వారి బతుకులు..వైద్యాలు..అవి ఇవీ అన్నీ దృష్టిలో  పెట్టుకుని పని చేస్తుంది. మేం కూడా ఎక్కువసేపు కష్టపడి పని చేస్తాం..ఆల్రెడీ చేస్తున్నాం..అంతేకానీ మూసేయం అంటూ కవర్ చేశాడు..కానీ ఇక్కడే ఈ పాయింట్ పైనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది..ఎందుకంటే సదరు చానల్ లో కనీసం 60 మందిని ఏడాదికాలంలో లేపేశారు..ఒక్కరైనా అడగరు..పైగా ఈ విషయం తెలిసే విష్ణు ఇలా అడిగారంటున్నారు..అసలు ఇక్కడ స్టీల్ ప్లాంట్కి సదరు ఛానల్ కి సంబంధం ఏంటి..స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ ది..న్యూస్ ఛానల్ ప్రవేట్ ది..ప్రవేట్ ఉద్యోగాలు సంస్థలు ఎప్పుడు మూతబడినా..వాటికి జవాబుదారీతనం ఉండదు..ఉద్యమాలు జరగవ్..కాబట్టే ఇదే ఛానల్లో 60మందిని లేపేసినా ఎవడూ అడగరు..కానీ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వానిది..ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించే పనివాళ్లు అక్కడ ఉంటారు..ఈ చిన్న లాజిక్ మర్చిపోయి..గెస్ట్ రెచ్చగొట్టగానే  రెచ్చిపోయి ఇలా దొరికిపోతే ఎలా..? మన పిచ్చకానీ..కష్టపడితే న్యూస్ ఛానల్స్ లాభాల్లోకి వచ్చే రోజులా..యాడ్స్ రావాలి గ్రూ గారూ..!

Comments